“उसकी वजह से और मुश्किल में केरल की नर्स निमिषा प्रिया की जान” जानें कहां हुई गड़बड़

हैदराबाद: ज्ञातव्य है कि केरल की नर्स निमिषा प्रिया यमन में तलाल अब्दो मोहम्मदी हत्याकांड में मौत की सज़ा का सामना कर रही है। केंद्र सरकार, केरल सरकार और कई गैर-सरकारी संगठन इस मामले को ब्लडमनी के ज़रिए उसकी सज़ा रद्द करवाने या माफ़ी दिलाने की पूरी कोशिश कर रहे हैं।

इसी क्रम में प्रजा शांति पार्टी के अध्यक्ष के. ए. पॉल ने कई महत्वपूर्ण टिप्पणी की है। कहा कि सभी निमिषा प्रिया को मौत की सज़ा से बचाने के लिए 19 दिनों से कड़ी मेहनत कर रहे हैं। इसी बीच भारत के ग्रैंड मुफ़्ती कंतापुरम शेख अबू बकर मुसलियार द्वारा दिए गए झूठे बयानों ने मामले को और जटिल कर दिया है।

शेख अबू बकर ने 29 जुलाई को एक बयान में घोषणा की कि निमिषा प्रिया की मौत की सज़ा रद्द कर दी गई है। के. ए. पॉल का तर्क है कि इस बयान ने पीड़ित परिवार को उलझन में डाल दिया है। इससे क्षमादान की बातचीत और मुश्किल हो गई है। उन्होंने शेख अबू बकर से तलाल के परिवार से तुरंत माफ़ी मांगने की माँग की।

निमिषा प्रिया पर 2017 में तलाल अब्दो महदी की हत्या का आरोप का सामना कर रही है। उसने आरोप लगाया कि तलाल, जो उसका प्रायोजक था, ने उसका पासपोर्ट ज़ब्त कर लिया और उसका यौन उत्पीड़न किया। फिर भी अदालत ने फैसला सुनाया कि उसकी मौत नशीली दवाओं के ओवरडोज़ से हुई थी, जिसके बाद उसने उसके शरीर के टुकड़े-टुकड़े करके उसे पानी की टंकी में फेंक दिया। यमन के सर्वोच्च न्यायालय ने 2024 में उसकी अपील खारिज कर दी और मौत की सज़ा बरकरार रखी। 16 जुलाई, 2025 को फाँसी की सज़ा तय की गई थी, लेकिन यमनी सरकार ने आखिरी समय में इसे स्थगित कर दिया।

हालाँकि, शेख अबू बकर के कार्यालय द्वारा जारी एक बयान में कहा गया कि निमिषा प्रिया की मौत की सज़ा रद्द कर दी गई है। इसके बाद भारतीय विदेश मंत्रालय ने स्पष्ट किया कि यह जानकारी गलत है। केंद्र सरकार ने कहा कि यमन से अभी तक कोई आधिकारिक सूचना नहीं मिली है और मामले की जाँच अभी भी जारी है। निमिशा प्रिया मामले में फिलहाल ब्लड मनी के भुगतान के लिए बातचीत चल रही है, लेकिन तलाल का परिवार इनकार कर रहा है। वे शरिया कानून के तहत प्रतिशोधात्मक न्याय (क़िसास) की माँग कर रहे हैं।

Also Read-

ఆయన వల్లే నిమిష ప్రియ ప్రాణం మళ్ళీ చిక్కుల్లోకి

హైదరాబాద్ : కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియ, యెమెన్‌లో తలాల్ అబ్దో మహ్మదీ హత్య కేసులో మరణ శిక్ష ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆమె శిక్షను రద్దు చేయడానికి లేదా బ్లడ్ మనీ ద్వారా క్షమాపణ పొందేందుకు కేంద్ర ప్రభుత్వం, కేరళ ప్రభుత్వం, పలు ఎన్జీవోస్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ. పాల్ పలు కీలక వ్యాఖ్యలు చేసారు. నిమిష ప్రియను ఉరిశిక్ష నుంచి కాపాడేందుకు 19 రోజులుగా తాను తీవ్రంగా కృషి చేస్తుండగా భారత గ్రాండ్ ముఫ్తీ కాంతపురం షేక్ అబూబకర్ ముస్లియార్ ఇచ్చిన అబద్దపు ప్రకటనలు ఈ కేసును మరింత జటిలం చేశాయని ఆరోపించారు.

షేక్ అబూబకర్ జూలై 29న విడుదల చేసిన ప్రకటనలో నిమిషా ప్రియ ఉరిశిక్ష రద్దయినట్లు ప్రకటించారు. ఈ ప్రకటనలు బాధితుడైన తలాల్ కుటుంబాన్ని కలవర పెట్టాయని, దీని వల్ల క్షమాపణ చర్చలు మరింత క్లిష్టమయ్యాయని కే.ఏ. పాల్ వాదిస్తున్నారు. షేక్ అబూబకర్ తక్షణమే తలాల్ కుటుంబానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు.

నిమిషా ప్రియ 2017లో తలాల్ అబ్దో మహదీని హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంది. ఆమె తన స్పాన్సర్‌గా ఉన్న తలాల్ తన పాస్‌పోర్ట్ స్వాధీనం చేసుకొని, లైంగికంగా వేధించినట్లు ఆరోపించింది. ఈ క్రమంలో అతనికి అధిక మోతాదులో మత్తు మందు ఇవ్వడం వల్ల మరణించాడని, ఆ తర్వాత ఆమె అతని మృతదేహాన్ని ముక్కలు చేసి వాటర్ ట్యాంక్‌లో పడేసినట్లు కోర్టు నిర్దారించింది. యెమెన్ సుప్రీంకోర్టు 2024లో ఆమె అప్పీలును తిరస్కరించి, ఉరిశిక్షను ఖరారు చేసింది. జూలై 16, 2025న ఉరిశిక్ష అమలు కావాల్సి ఉండగా, చివరి నిమిషంలో యెమెన్ ప్రభుత్వం దానిని వాయిదా వేసింది.

అయితే, షేక్ అబూబకర్ కార్యాలయం జారీ చేసిన ప్రకటనలో ఉరిశిక్ష రద్దయినట్లు పేర్కొనడంతో, ఈ సమాచారం నిజం కాదని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. యెమెన్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం రాలేదని, కేసు ఇప్పటికీ విచారణలో ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం, నిమిషా ప్రియ కేసులో బ్లడ్ మనీ చెల్లింపు కోసం చర్చలు కొనసాగుతున్నాయి, కానీ తలాల్ కుటుంబం నిరాకరిస్తోంది. షరియా చట్టం కింద ప్రతీకార న్యాయం (కిసాస్) కోరుతోంది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X