హైదరాబాద్: పైడి జయరాజు జయంతి సందర్భంగా పాత మంచిర్యాలలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల పైడి జయరాజ్ హాల్ యందు ఘనంగ వర్క్ షాప్ ఏర్పాటు చేసినారు. ఈ సందర్భంగా ఆయన సినిమాలు స్క్రీనింగ్ చేసి ఫిలిం అప్రిసియేషన్ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ప్రముఖ రచయిత అల్లం రాజయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ పల్లెల్లో అత్యంత అద్భుతమైన కంటెంట్ ఉందన్నారు. దీనిని సినిమా రూపంలో మలచగలిగితే అత్యంత ప్రజాదరణ లభిస్తుంది. తెలంగాణలోని యువకులకు ఎంతో ప్రతిభ ఉంది. దానికి తగిన గుర్తింపు మరియు ప్రోత్సాహం అవసరం. ప్రపంచమంతా నేడు కొత్త కంటెంట్ కొరకు మరియు ప్రతిభ ఉన్న యువత కొరకు ఎదురు చూస్తుంది.
పైడి జయరాజు జయంతి సందర్భంగా మంచిర్యాల జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన వారు మరియు సినీ పరిశ్రమలు మంచి స్థానంలో స్థిరపడుతున్నవారు. అందరితో సినీ పాటల రచయిత చంద్రమౌళి గారు “ఫిల్మ్ అప్రిషేషన్ “వర్క్ షాప్ ఏర్పాటు చేయడం అభినందనీయము. ఎటువంటి కార్యక్రమాలు ఇంకెన్నో జరగవలసిన అవసరం ఉందని అన్నారు.
పరేషాన్ సినిమా పాటల రచయిత, మాసక్కని సినిమా అక్కల చంద్రమౌళి మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా నుండి ఎంతోమంది మంచి ప్రతిభ ఉన్నప్పటికీ సరైన అవగాహన లేక ఎదగలేక పోతున్నారు. వారందరికీ మంచి మార్గదర్శకత్వం అవసరము. అందుకే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ గారి సూచనతో పైడి జయరాజ్ హాల్ లో పాఠశాల ఉపాధ్యాయుడు అడ్డచర్ల సాగర్ గారి సహకారంతో వర్క్ షాప్ ఏర్పాటు చేయడం జరిగిందియ. ఈ కార్యక్రమానికి సినీ పరిశ్రమలో స్థిరపడ్డ వారు మరియు నూతనంగా పరిశ్రమలోకి వస్తున్నవారు హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో ఇంటింటి రామాయణం దర్శకుడు నరెడ్ల సురేష్, అప్పని శ్రీకాంత్, సిద్దు మపన్యాల రాజకుమార్, వెంకటేష్, విల్సన్ తబిత, వేణుగౌడ్, శంకర్, డిఓపి బాలు ఆక్టర్, రవితేజ, కిరణ్, సమ్మన్న,విమలెష్,,వినయ్ శ్రీనివాస్, 50 మంది ఇండిపెండెంట్ ఫిలిం మేకర్స్ పాల్గొన్నారు.