హైదరాబాద్ : తెలంగాణ ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లు పెండింగ్ లో ఉన్నా కూడా గురు నానక్ మరియు శ్రీనిధి కళాశాలల యాజమాన్యాలు యూనివర్సిటీ పేరుతో అక్రమంగా ఫీజు వసూళ్లకు పాల్పడుతూ విద్యార్థులను మరియు వారి తల్లితండ్రులను దోపిడీ చేసిన విషయంలో విద్యార్థులకు న్యాయం చెయ్యాలని కోరుతూ శాంతియుతంగా తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కి వినతి పత్రాన్ని సమర్పించేందుకు వెళ్లిన NSUI రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూరి తో సహా NSUI నాయకులను పోలీసులు అడ్డుకొని గోషామహల్ పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది.
ఈ సందర్భంగా NSUI రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూరి మాట్లాడుతూ విద్యార్థులకు న్యాయం చెయ్యాలని కోరుతూ శాంతియుతంగా విద్యా శాఖ మంత్రి కి వినతి పత్రాన్ని ఇచ్చేందుకు వెళ్లిన తమని పోలీసులు దౌర్జన్యంగా అదుపులోకి తీసుకొని గోషామహల్ పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్నారని.
గురు నానక్ మరియు శ్రీనిధి కళాశాలల యాజమాన్యాల అక్రమ దందా వల్ల సుమారు 5 వేలాది మంది విద్యార్థులు మరియు వారి తల్లితండ్రులు దోపిడీకి గురై ఆందోళనలో ఉన్నారని.ఈ సదరు యాజమాన్యాలకు తెలంగాణ ప్రభుత్వ పెద్దల అండదండలు ఉన్నాయనే పక్కా ఆధారాలతోని వెళ్లినందుకే పోలీసులు తమని అడ్డుకున్నారని.విద్యార్థులకు న్యాయం జరిగే వరకు NSUI పోరాటం ఆపబోదని వెంకట్ స్పష్టం చేశారు.