NOTA: विधायकों के बहुमत से ज्यादा नोटा को पड़े हैं वोट, इसीलिए परेशान रहते हैं प्रत्याशी

हैदराबाद: तेलंगाना चुनाव नतीजों में बीआरएस ने ग्रेटर हैदराबाद में सबसे ज्यादा सीटें जीती हैं। हालांकि, इस चुनाव के नतीजों में ग्रेटर में नोटा को 44 हजार वोट मिले हैं। ग्रेटर हैदराबाद के अधिकांश क्षेत्रों में कांग्रेस, बीआरएस, भाजपा और कांग्रेस जैसी प्रमुख पार्टियों के बाद नोटा दूसरे स्थान पर है।

नोटा को मेडचल मल्काज़गिरी जिले में 15,418 वोट मिले हैं और रंगारेड्डी जिले में सबसे कम 12,824 वोट मिले हैं। हैदराबाद जिले में 16,222 वोट नोटा के नाम दर्ज किये गये है। निर्वाचन क्षेत्र संदर्भ में देखा जाये तो नोटा को कुतबुल्लापुर में नोटा को 4,079 अधिक वोट मिले हैx। जबकि नामपल्ली में सबसे कम 544 वोट मिले हैं। लेकिन 2018 के चुनावों की तुलना में, हालांकि इस बार ग्रेटर में नोटा के वोटों में थोड़ी कमी आई है। पहले की तुलना में 471 नोटा वोट कम हुए हैं।

कुछ जगहों पर नोटा को हजारों वोट मिले हैं। मेडचल में 3,737, सेरिलिंगमपल्ली में 3,145, एलबीनगर में 2,966, मल्काजगिरी में 2,608, कुकटपल्ली में 2,458, उप्पल में 2,536 और महेश्वरम में 2,031 वोट नोटा को पड़े हैं। इसके अलावा, 10 सेगमेंट ऐसे हैं, जिनमें 1,000 से 2,000 के बीच नोटा को वोट पड़े है, जबकि 6 सेगमेंट ऐसे हैं, जहां 500 से 1,000 के बीच नोटा को वोट गिरे हैं।

रंगारेड्डी जिले के चेवेल्ला में नोटा को मिले वोट बीआरएस उम्मीदवार के बहुमत से ज्यादा हैं। इस क्षेत्र में बीआरएस उम्मीदवार काले यादय्या को 76,218 वोट मिले हैं, जबकि कांग्रेस उम्मीदवार भीम भरत को 75,950 वोट मिले हैं। काले यादय्या ने कांग्रेस उम्मीदवार के खिलाफ महज 268 वोटों के मामूली अंतर से जीत हासिल की है। गौरतलब है कि यहां नोटा को 1,423 वोट मिले हैं।

याकूतपुरा में एमआईएम उम्मीदवार ने 878 वोटों से जीत हासिल की है, जबकि नोटा को यहां 704 वोट मिले हैं। किशन रेड्डी को भी पिछले दिनों अंबरपेट सेगमेंट में इसी तरह की स्थिति का सामना करना पड़ा था। चूंकि नोटा के वोट जीत-हार तय करने के स्तर पर हैं। ऐसे में नोटा का नाम आते ही प्रत्याशी परेशान हो रहे हैं।

ఎమ్మెల్యే మెజారిటీ కంటే నోటాకు వచ్చిన ఓట్లే ఎక్కువ

హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ అత్యధిక సీట్లు గెలుచుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల ఫలితాల్లో గ్రేటర్ లో నోటాకు 44 వేల ఓట్లు రావడం గమనార్హం. గ్రేటర్ హైదరాబాద్ లోని చాలా సెగ్మెంట్లలో కాంగ్రెస్, బీఆర్​ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లాంటి ప్రధాన పార్టీల తర్వాతి స్థానంలో నోటా నిలిచింది.

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో నోటాకు15,418 ఓట్లు రాగా, అత్యల్పంగా రంగారెడ్డి జిల్లాలో12,824 ఓట్లు వచ్చాయి. హైదరాబాద్​ జిల్లాలో 16,222 ఓట్లు నోటాకు పడ్డాయి. సెగ్మెంట్ల పరంగా చూస్తే… కుత్బుల్లాపూర్లో అత్యధికంగా నోటాకు 4,079 ఓట్లు రాగా, అత్యల్పంగా నాంపల్లిలో 544 ఓట్లు వచ్చాయి. అయితే 2018 ఎన్నికలతో పోలిస్తే ఈసారి గ్రేటర్ లో నోటాకు ఓట్లు కొంత తగ్గినా.. ఉనికి మాత్రం చాటింది. గతంలో పోలిస్తే 471 ఓట్లు తగ్గాయి.

నోటాకు కొన్ని చోట్ల వేలల్లో ఓట్లు వచ్చాయి. మేడ్చల్​లో 3,737 ఓట్లు, శేరిలింగంపల్లిలో 3,145, ఎల్​బీనగర్​లో 2,966, మల్కాజ్ గిరిలో 2,608, కూకట్​పల్లిలో 2,458, ఉప్పల్​లో 2,536, మహేశ్వరంలో 2,031 ఓట్లు నోటాకు వచ్చాయి. అలాగే వెయ్యి నుంచి రెండు వేలలోపు నోటాకు పడిన సెగ్మెంట్లు 10 ఉండగా, ఐదొందల నుంచి వేయిలోపు పడిన సెగ్మెంట్లు 6 ఉన్నాయి.

రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో బీఆర్ఎస్​ అభ్యర్థికి వచ్చిన మెజారిటీ కంటే నోటాకు వచ్చిన ఓట్లే ఎక్కువ. ఈ సెగ్మెంట్ లో బీఆర్ఎస్​ అభ్యర్థి కాలె యాదయ్యకు 76,218 ఓట్లు రాగా, కాంగ్రెస్​ అభ్యర్థి భీమ్​ భరత్​కు 75,950 ఓట్లు వచ్చాయి. కేవలం 268 ఓట్ల అతిస్వల్ప మెజారిటీతో కాలె యాదయ్య కాంగ్రెస్​ అభ్యర్థిపై విజయం సాధించారు. ఇక్కడ నోటాకు1,423 ఓట్లు రావడం గమనార్హం.

యాకుత్​పురాలో ఎంఐఎం అభ్యర్థి 878 ఓట్ల మెజారిటీతో గెలవగా, ఇక్కడ నోటాకు 704 ఓట్లు పోలయ్యాయి. చేవెళ్లలాంటి పరిస్థితే గతంలో అంబర్​పేట సెగ్మెంట్​లో కిషన్​ రెడ్డికి కూడా ఎదురైంది. ఇలా గెలుపు ఓటములను డిసైడ్​ చేసే స్థాయిలో నోటా ఓట్లు ఉంటుండటంతో నోటా పేరు చెబితేనే అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X