హైదరాబాద్ : ఎల్బి స్టేడియంలో ఆగస్టు 29 రోజున జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ శివసేనా రెడ్డి ఆధ్వర్యంలో పోస్టర్, టీ షర్ట్స్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్. కార్యక్రమంలో పాల్గొన్న స్పోర్ట్స్ సలహాదారుడు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణి ప్రసాద్, ఖైరతాబాద్ డిసిసి అధ్యక్షుడు రోహిన్ రెడ్డి ఇతర ముఖ్య నేతలు.
నేషనల్ స్పోర్ట్స్ డే పోస్టర్ ను, టీ షర్ట్ ను ఆవిష్కరించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి పొన్నం ప్రభాకర్, రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ. 29న ధ్యాన్ చంద్ జన్మదినం సందర్భంగా స్పోర్ట్స్ డే లో భాగంగా పోస్టర్ లోగో ఆవిష్కరించడం జరిగింది. ధ్యాన్ చంద్ జన్మదినం సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా క్రీడలను ప్రోత్సహించాలని గౌరవ ముఖ్యమంత్రి ఆలోచన. ఇటీవల కొరియా దేశం వెళ్ళినప్పుడు అక్కడ క్రీడా సంస్థలు క్రీడాకారులతో సమావేశాన్ని ఏర్పాటు చేసిన తరువాత, తెలంగాణ లో కూడా స్పోర్ట్స్ యూనివర్శిటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ప్రకటించారు.
ఇది కూడ చదవండి-
గ్రామీణ ప్రాంతాల నుండి తెలంగాణ లో ప్రజా పాలన లో క్రీడాకారులను వారి నైపుణ్యాలను బయటకు తెచ్చివిధంగా ప్రభుత్వం సంకల్పం తీసుకుంది. అందులో భాగంగా జాతీయ క్రీడా దినోత్సవం కార్యక్రమంలో భాగంగా పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. రాష్ట్రం భవిష్యత్ లో క్రీడా రంగంలో నంబర్ 1 ఉండాలి. క్రీడా రంగంలో భవిష్యత్ లో పాఠశాల దశ నుండి క్రీడల్లో రాణించేలా ప్రోత్సహించాలని ప్రయత్నం లో భాగంగా క్రీడా దినోత్సవం ఘనంగా జరపాలని ప్రభుత్వం భావిస్తోంది. మంత్రులు, ఎమ్మేల్యేలు, ప్రభుత్వ అధికారులంతా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి.
29 నాడు గచ్చిబౌలి స్టేడియంలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు ధ్యాన్ చంద్ విగ్రహానికి పూలమాల వేస్తారు. అన్ని జిల్లాల్లో క్రీడా దినోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి. ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేసిన తల్లిదండ్రుల స్పందన ముఖ్యం పిల్లలను ప్రోత్సహించాలి. శివసేన రెడ్డి స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అయ్యారు. స్పోర్ట్స్ కోసం పెద్ద ఎత్తున నిధుల కేటాయింపు జరుగుతుంది. కరీంనగర్ లో కూడా స్పోర్ట్స్ స్కూల్ ఉంది. స్పోర్ట్స్ కార్యక్రమానికి తెలంగాణ సమాజం మద్దతు ఇవ్వాలి.