హైదరాబాద్ : ఇటీవల కేంద్ర క్యాబినెట్ యూనిఫైడ్ పెన్షన్ స్కీం (UPS) పై తీసుకున్న నిర్ణయం 1.1.2004 తరువాత రిక్రూట్ అయిన ఉద్యోగుల పై పక్షపాత వైఖరి కంటిన్యూ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన నకారా జడ్జ్మెంట్ కు వ్యతిరేకంగా ఉంది.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పబ్లిక్ సెక్టార్ ప్రైవేట్ సెక్టార్ కార్మికులు ఎన్పీఎస్ కు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఓ పి ఎస్ కావాలని డిమాండ్ చేస్తున్నారు. పోరాటాల ఒత్తిడి వల్ల కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్పీఎస్ నుండి ఓ పి ఎస్ కు మారుస్తామని నిర్ణయించారు.
కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపై కఠిన వైఖరి మరియు బెదిరింపులు చేశాయి. కానీ పెరుగుతున్న పోరాటాల ఒత్తడి వల్ల కేంద్ర ప్రభుత్వం ఒక హై పవర్ కమిటీని ఏర్పాటు చేసింది. ఎల్పీఎస్ మాత్రం పూర్తిగా రద్దు చేసేది లేదని చెప్తూ వచ్చింది.
Also Read-
కానీ ఇప్పుడు ప్రకటించిన యుపిఎస్ స్కీమ్ ఉద్యోగుల సమస్యలను తీర్చేలా లేదు. 50% పెన్షన్ ఇవ్వటానికి అంగీకరించిన, ప్రతినెల బేసిక్ పే మరియు డిఏ నుండి 10% రికవరీ చేయడం తప్పనిసరి అని పేర్కొంది. ఇంతే కాకుండా ప్రభుత్వ వాటా ను 4.5% పెంచుతున్నట్లు ప్రకటించింది. అంటే మొత్తంగా 28.5 % రికవరీ ప్రైవేట్ ఫండ్ మేనేజర్ లకి అప్ప చెప్పడమే.
ఓ పి ఎస్ లో ఉన్న చాలా అంశాలు upsలో కనిపించట్లేదు. 80-85-90-95-100 ఏండ్లకు ఓ పి ఎస్ లో అదనపు పెన్షన్, పెన్షన్ కమ్యూటేషన్, లాస్ట్ పే drawn తదితర అంశాలు యుపిఎస్ లో లేదు. యుపిఎస్ లో చాలా ఆంక్షలుతో కూడిన కొన్ని బెనిఫిట్ లో ప్రకటించడం జరిగింది.
యుపిఎస్ ఒక ఆచీచూచి స్కీమ్ అని, ఓ పి ఎస్ ని అందరికీ వర్తింపజేయాలని NCCPA డిమాండ్ చేస్తుంది. 13న చలో ఢిల్లీ కార్యక్రమం చేపడుతున్నాం, అందులో యుపిఎస్ కూడా ఒక ప్రధానమైన అంశం ఉంటుంది. OPS డిమాండ్ కై ఉద్యోగ కార్మిక పోరాటాలకు సంఘీభావంగా NCCPA చేదోడువాడు ఇస్తుంది.
S.Sreedhar
ఉపాధ్యక్షులు,NCCPA