हैदराबाद : दिल्ली में गर्मी है। इस बार दिल्ली में गर्मी के सारे रिकॉर्ड तोड़ दिये हैं। दिल्ली में पहली बार तापमान 52.3 डिग्री पर पहुंच गया है। दिल्ली में भीषण गर्मी के बीच कुछ देर बारिश हुई। दिल्ली-एनसीआर में आंधी के साथ बारिश ने थोड़ी राहत दी। राष्ट्रीय राजधानी में बुधवार को अधिकतम तापमान 52.3 डिग्री पहुंच गया। राजधानी में पहली बार तापमान 52 डिग्री के लेवल को पार कर गया। अच्छी बात है कि अगले 24 घंटे में मानसून केरल पहुंच सकता है।
मौसम विभाग के अनुसार दिल्ली में कम से कम तीन मौसम केंद्रों पर अधिकतम तापमान 52 डिग्री सेल्सियस दर्ज किया है। मुंगेशपुर में 52.3 डिग्री तापमान दर्ज किया गया। नरेला में 49.9 डिग्री और नजफगढ़ में 49.8 डिग्री तापमान दर्ज किया गया। यह इस मौसम में राजधानी में दर्ज किया गया सबसे अधिक तापमान है। दूसरी ओर अगले 24 घंटे में केरल में मानसून दस्तक दे सकता है। भारतीय मौसम विभाग (IMD) ने कहा कि अगले 24 घंटों में मॉनसून केरल पहुंच सकता है। मौसम विभाग के मुताबिक केरल में मॉनसून के लिए माहौल अनुकूल है।
आईए[मडी ने आगे कहा कि राजस्थान, हरियाणा-चंडीगढ़-दिल्ली के अधिकांश हिस्सों, उत्तर प्रदेश, मध्य प्रदेश के कई हिस्सों और बिहार और हिमाचल प्रदेश के अलग-अलग इलाकों में लू चलने की स्थिति बनी हुई है। इसमें कहा गया है कि विदर्भ के कई इलाकों, जम्मू-कश्मीर के कुछ हिस्सों और उत्तराखंड और छत्तीसगढ़ के अलग-अलग हिस्सों में लू की स्थिति भी बनी है।
यह भी पढ़ें-
भारतीय मौसम विभाग ने कहा कि कम से कम अगले दो दिनों तक भीषण गर्मी से राहत मिलने की उम्मीद नहीं है। गुरुवार को भारत के उत्तर-पश्चिम हिस्सों में एक नये पश्चिमी विक्षोभ की संभावना है, जिससे सप्ताहांत में क्षेत्र में छिटपुट बारिश हो सकती है। आईएमडी के महानिदेशक मृत्युंजय महापात्र ने मई में पश्चिमी विक्षोभ की अनुपस्थिति को उत्तर पश्चिम और मध्य भारत में लू की स्थिति के लिए जिम्मेदार ठहराया। अगले कुछ दिनों में उत्तर प्रदेश, पूर्वी मध्य प्रदेश, पंजाब, हरियाणा, चंडीगढ़ और दिल्ली में अलग-अलग हिस्सों में रात में भी गर्मी का प्रकोप जारी रहने की संभावना है। (एजेंसियां)
దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం 52.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
హైదరాబాద్ : భారతదేశంలో ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం సమయంలో బయటికి రావాలంటేనే జనం తీవ్రంగా భయపడిపోతున్నారు. ఈ క్రమంలోనే దేశ చరిత్రలోనే తొలిసారి అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం ఏకంగా 52.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం తీవ్ర సంచలనంగా మారింది. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఢిల్లీలోని ప్రజలు ఎండ వేడిమికి తాళలేకపోతున్నారు. ఓ వైపు ఎండలు మండిపోతుండటంతో మరోవైపు.. కరెంటు వినియోగం భారీగా పెరుగుతోంది. ఇక అదే సమయంలో ఢిల్లీలో పలు చోట్ల వర్షం కూడా పడింది. అయితే ఎడారి రాష్ట్రమైన రాజస్థాన్ కంటే ఢిల్లీలో అధిక ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం.
ఢిల్లీలోని ముంగేష్‌పూర్‌లో ఉన్న వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు 52.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ క్రమంలోనే ఎండలు, వేడి గాలులు తట్టుకోలేక ఫ్యాన్లు, ఏసీలు, కూలర్ల వినియోగం భారీగా పెరగడంతో ఢిల్లీలో ఎప్పుడూ లేనంతగా విద్యుత్ వినియోగం జరుగుతోంది. బుధవారం ఏకంగా ఢిల్లీలో విద్యుత్ వినియోగం 8302 మెగావాట్లకు చేరింది.
మరోవైపు ఢిల్లీలో రికార్డ్ ఉష్ణోగ్రత నమోదైన అనంతరం తాజాగా పలు చోట్ల వర్షం కురుస్తుంది. ఇక ఢిల్లీలో గతంలో 2002 లో 49.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా ఇవాళ నమోదైన ఉష్ణోగ్రత దాన్ని అధిగమించిందని భారత వాతావరణ శాఖ రీజినల్ హెడ్ కుల్దీప్ శ్రీవాస్తవ తెలిపారు. మరోవైపు రాజస్థాన్ నుంచి వీచే బలమైన వేడి గాలుల కారణంగా ఢిల్లీలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వెల్లడించారు. ఇక సాధారణం కంటే 9 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని పేర్కొన్నారు.
ఇక ఎడారి రాష్ట్రమైన రాజస్థాన్‌లో ఎండలు బెంబేలెత్తిస్తున్నాయి. రాజస్థాన్‌లోని ఫలోడిలో 51 డిగ్రీలు, 50.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు హర్యానాలోని సిర్సాలో 50.3 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైంది. అరేబియా సముద్రం నుంచి తేమతో కూడిన గాలుల కారణంగా దక్షిణ రాజస్థాన్‌లోని బార్మర్, జోధ్‌పూర్, ఉదయపూర్, సిరోహి, జలోర్ వంటి ప్రాంతాల్లో బుధవారం 4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత తగ్గిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
భారీ ఉష్ణోగ్రతల కారణంగా బుధవారం దేశంలోని వాయువ్య ప్రాంతాలకు భారత వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వేడిగాలులు కూడా వీచే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది. బుధవారం నుంచి ఢిల్లీతో సహా పలు ప్రాంతాల్లో వేడిగాలులు, అత్యంత వేడిగాలుల పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. ముంగేశ్‌పూర్, నరేలా ప్రాంతాల్లో మంగళవారం 49.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. (ఏజెన్సీలు)