हैदराबाद: नगरपालिका विभाग के प्रधान सचिव दाना किशोर ने बताया है कि इस प्रचार में कोई सच्चाई नहीं है कि बड़े शहर को बेंगलुरु जैसे जल संकट का सामना हैदराबाद को करना पड़ेगा और लोगों को गर्मियों के अंत तक पर्याप्त पानी है। इसके बारे में किसी प्रकार की चिंता नहीं करनी चाहिए। शहर में जल संकट को लेकर चल रहे विभिन्न प्रकार के प्रचार की पृष्ठभूमि में सोमवार को उन्होंने खैरताबाद स्थित जलमंडली कार्यालय में अधिकारियों के साथ समीक्षा की। इस मौके पर उन्होंने कहा कि जनवरी से कई इलाकों से पानी के टैंकरों की अभूतपूर्व बुकिंग के कारणों का पता लगाने के लिए 1710 इलाकों में सर्वेक्षण किया है। यह बात सामने आई है कि पिछले साल कई इलाकों में बहुमंजिला इमारतों के निर्माण के कारण लाखों जल उपभोक्ता बढ़ गए हैं।
दाना किशोर ने कहा कि 31,766 ग्राहकों ने पिछले महीने बुक किए गए लगभग 1.60 लाख टैंकरों का अध्ययन किया है। उनमें से लगभग 20,551 के पास निजी आवास पाए गए हैं। उन्होंने बताया कि जितने भी लोगों ने टैंकर बुक कराए है, उनके घरों में बोरिंग सूखी पाई गई। जिन लोगों ने पिछले साल जनवरी से 8 अप्रैल तक वास्तविक टैंकर बुक नहीं कराए थे, इस साल जनवरी से 8 अप्रैल तक हर महीने कम से कम तीन और अधिकतम पांच टैंकर बुक किए हैं। पता चला है कि अधिकांश टैंकरों द्वारा बुक किए गए क्षेत्रों में भूमिगत जल नीचे चला गया है। उन्होंने कहा कि टैंकरों की बुकिंग और बढ़ने की संभावना है। इसलिए आवश्यकता के अनुसार पानी की आपूर्ति की व्यवस्था की जा रही है।
प्रधान सचिव ने कहा कि वर्तमान में जल मंडल के अधिकार क्षेत्र में 595 टैंकर हैं। इस महीने की 25 तारीख तक 300 और नए पानी के टैंकर उपलब्ध कराए जाएंगे और वे बढ़ती जरूरतों के लिए हर महीने 3.5 लाख ट्रिप के साथ पानी की आपूर्ति करेंगे। उन्होंने कहा कि जीएचएमसी से 200 अतिरिक्त ड्राइवर पहले ही उपलब्ध किये जा चुके हैं। प्रतिदिन अतिरिक्त रात 10 बजे से सुबह 5 बजे तक टैंकर चलाने वाले ड्राइवरों से 100 रुपये शुल्क लिया जाएगा। अतिरिक्त मजदूरी के रूप में 150 रुपये प्रति दिन दिये जाएंगे। उन्होंने कहा कि ग्रेटर को सिंचित करने वाले जुड़वां जलाशयों के अलावा, मंजीरा और सिंगूर जलाशयों में पर्याप्त पानी है और सरकार ने कठिन समय की स्थिति में नागार्जुनसागर से शहर में पानी की आपूर्ति के लिए पहले ही 50 करोड़ रुपये मंजूर कर दिए हैं और मोटरें स्थापित कर रहे हैं।
वर्तमान में 644 टैंकर सेवाएं प्रदान कर रहे हैं, जिनमें से 76 नए टैंकर इस महीने की 1 तारीख से उपलब्ध कराए गए हैं। उन्होंने कहा कि इस महीने की 10 तारीख से अन्य 67 टैंकरों की आपूर्ति की जाएगी। जलमंडली द्वारा संचालित टैंकरों की संख्या 738 तक पहुंच जाएगी। इसके अलावा अगले माह सौ टैंकर और चलाए जाएंगे। जल संस्थान ने मई माह में टैंकरों की संख्या बढ़ाकर 838 करने की रणनीति तैयार की है। नागार्जुन सागर से अब तक उपलब्ध पानी लगभग 133.71 टीएमसी है जबकि डेड स्टोरेज पर उपलब्ध पानी 131.66 टीएमसी है और डेड स्टोरेज से ऊपर 2.05 टीएमसी पानी उपलब्ध होगा। जल मंडल की गर्मियों की जरूरतों के लिए 5.60 टीएमसी पानी तैयार है।
హైదరాబాద్ వాసులకు చల్లటి శుభవార్త చెప్పిన దాన కిషోర్
హైదరాబాద్ : మహా నగరానికి బెంగళూరు తరహాలో నీటి ఎద్దడి వస్తుందన్న ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదని, వేసవి ముగిసే వరకు సరిపోయేంత నీరుందని ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ సూచించారు. సిటీలో నీటి ఎద్దడిపై రకరకాలుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సోమవారం ఆయన ఖైరతాబాద్‌లోని జలమండలి ఆఫీసులో అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి నుంచే పలు ప్రాంతాల నుంచి గతంలో ఎన్నడూ లేని విధంగా వాటర్ ట్యాంకర్ల బుకింగ్ రావటంతో అప్రమత్తమై 1710 ప్రాంతాల్లో సర్వే నిర్వహించి అందుకు గల కారణాలు అన్వేషించినట్లు తెలిపారు. చాలా ప్రాంతాల్లో బహుళ అంతస్తుల భవనాలు వెలవడంతో గడిచిన ఏడాదిలోలక్ష మంది నీటి వినియోగదారులు పెరిగినట్లు వెల్లడించారు.
గడిచిన నెల రోజుల్లోనే 31,766 మంది వినియోగదారులు సుమారు 1.60లక్షల ట్యాంకర్లను బుక్ చేయడంపై అధ్యయనం చేసినట్లు తెలిపారు. వీటిలో దాదాపు 20,551 మంది వ్యక్తిగత నివాసాలు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. ట్యాంకర్లు బుక్ చేసిన వారంతా తమ ఇళ్లలో బోర్లు డ్రై అయిపోయిన వారే ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. గతేడాది జనవరి నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు అసలు ట్యాంకర్లనే బుక్ చేయని వారు, ఈ సంవత్సరం జనవరి నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు ప్రతి నెలా కనిష్టంగా మూడు, గరిష్టంగా ఐదు ట్యాంకర్లను బుక్ చేసిన వారున్నట్లు తెలిపారు. ఎక్కువ మంది ట్యాంకర్లు బుక్ చేసిన ఏరియాల్లో భూగర్భ జలాలు అడుగంటి పోయినట్లు గుర్తించామన్నారు. ట్యాంకర్ల బుకింగులు మున్ముందు మరింత పెరిగే అవకాశాలు ఉండటంతో, అవసరానికి తగిన విధంగా నీటిని సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం జలమండలి పరిధిలో 595 ట్యాంకర్లు ఉన్నాయని, ఈ నెల 25కల్లా మరో 300 కొత్త వాటర్ ట్యాంకర్లను అందుబాటులోకి తెచ్చి, మున్ముందు పెరిగే అవసరాలకు గాను ప్రతి నెల 3.5లక్షల ట్రిప్పులతో నీటిని సరఫరా చేస్తామని తెలిపారు. ఇప్పటికే అదనంగా 200 మంది డ్రైవర్లను జీహెచ్ఎంసీ నుంచి సమకూర్చుకున్నట్లు తెలిపారు. ఉదయం 6నుంచి రాత్రి 10గంటల వరకు ట్యాంకర్లు నడిపే డ్రైవర్లకు రోజూ అదనంగా రూ. వంద, రాత్రి 10గంటల నుంచి తెల్లవారుజాము 5గంటల వరకు ట్యాంకర్లు నడిపే డ్రైవర్లకు రూ. 150 రోజువారీ అదనపు వేతనాలు చెల్లిస్తున్నట్లు తెలిపారు. గ్రేటర్‌కు నీరందించే జంట జలాశయాలతో పాటు మంజీరా, సింగూరు జలాశయాల్లోనూ కావల్సినంత నీళ్లున్నాయని, మరీ కష్టకాలం వస్తే నాగార్జునసాగర్ నుంచి సిటీకి నీటిని తరలించి సరఫరా చేసేందుకు ఇప్పటికే సర్కారు రూ.50కోట్లు మంజూరు చేయగా, మోటార్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
మే 1న ఫస్ట్ మోటారు ఆన్ చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ట్యాంకర్లను ఎక్కువగా బుకింగ్ చేస్తున్న ఏరియాల్లో భూగర్భ జలాల రీఛార్జ్, వాన నీటి హార్వెస్టింగ్ వంటి అంశాలపై అవగాహన కల్పించేందుకు 18 స్వచ్ఛంద సంస్థలతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ప్రతి 300 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న స్థలంలో వాటర్ హార్వేస్టింగ్ పిట్ తప్పనిసరిగా ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. హార్వెస్టింగ్ పిట్ ఏర్పాటు చేయలేని భవనాలకు రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకునేలా క్షేత్ర స్థాయిలో చర్యలు చేపట్టాలని జలమండలి అధికారులను ఆదేశించారు.
గ్రేటర్ హైదరాబాద్‌కు ప్రతి రోజు దాదాపుగా 2602.29 ఎంఎల్డీల నీరు సరఫరా చేస్తున్నట్లు దానకిశోర్ తెలిపారు. ఈ నీటిని రోజు విడిచి రోజు ఆయా ప్రాంతాలను బట్టి గంట నుంచి గంటన్నర సేపు సరఫరా చేస్తు్న్నామన్నారు. సుమారు 13లక్షల డొమెస్టిక్ కనెక్షన్లు, మరో 40 వేల కమర్షియల్ కనెక్షన్లకు నీటిని సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ఎక్కడైనా లీకేజీలు, పైప్ లైన్లు ధ్వంసమైన సందర్భాల్లో 10గంటల్లోపు మరమ్మతులను చేపట్టి నీటి సరఫరాను పునరుద్ధరించాలని ఆదేశించారు. దీనికి కేవలం ఐదు గంటల్లోనే మరమ్మతులు పూర్తి చేసి నీటి సరఫరాను పునరుద్ధరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. గ్రేటర్‌కు సరఫరా చేస్తున్న 2602.29 ఎంఎల్డీల్లో హైదరాబాద్ కోర్ సిటీకి 1098 ఎంఎల్డీలు, గ్రేటర్‌లో విలీనమైన శివార్లకు 1084.44 ఎంఎల్డీలు, ఓఆర్ఆర్ చుట్టున్న స్థానిక సంస్థలకు 270.66 ఎంఎల్డీలు, మిషన్ భగీరథకు 149.19 ఎంఎల్డీలు సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు.
సిటీకి సరఫరా చేస్తున్న 2602.29 ఎంఎల్డీల నీళ్లలో 96 శాతం డొమెస్టిక్ అవసరాలకు, మరో నాలుగు శాతం కమర్షియల్ అవసరాలకు సరఫరా చేస్తుండగా, ఈ మొత్తం 2602.29 ఎంఎల్డీల నీటిలో జంట జలాశయాల్లో ఒకటైన ఉస్మాన్ సాగర్ నుంచి 90.92 ఎంఎల్డీలు, హిమాయత్ సాగర్ నుంచి 25.54 ఎంఎల్డీలు, సింగూరు, మంజీరా నుంచి 491.19 ఎంఎల్డీలు, కృష్ణా ఫేజ్ 1,2,3 ద్వారా 1254.37 ఎంఎల్డీలు, గోదావరి ఫేజ్ వన్ నుంచి 740.27 ఎంఎల్డీల నీటిని సిటీకి సరఫరా చేస్తున్నట్లు వివరించారు.
జనవరి నుంచి గతంలో ఎన్నడూ లేని విధంగా ట్యాంకర్లకు డిమాండ్ పెరుగుతుండటంతో జలమండలి నిర్వహించిన సర్వేలో హైదరాబాద్‌లో భూగర్భ జలాలు అడుగంటిపోవడమే ఇందుకు కారణమని తేలింది. భూగర్భ జలాల శాఖ సైతం ఇదే విషయాన్ని వెల్లడించిందని అధికారులు తెపారు. ట్యాంకర్ బుక్ చేసే వినియోగదారులకు నీరు సరఫరా చేసేందుకు జలమండలి సిబ్బంది రాత్రింబవళ్లు పనిచేస్తున్నారు. ట్యాంకర్ డిమాండ్ నగరమంతా గాక పశ్చిమ ప్రాంతాలైన మణికొండ, గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్, కూకట్‌పల్లి, జూబ్లీ హిల్స్, బంజారాహిల్స్ లోనే అధికంగా ఉందన్నారు.
ప్రస్తుతం 644 ట్యాంకర్లు సేవలు అందిస్తుండగా వీటిలో ఈ నెల 1వ తేదీ నుంచి 76 కొత్త ట్యాంకర్లను సమకూర్చారు. ఈ నెల 10వ తేదీ నుంచి మరో 67 ట్యాంకర్లు సమకూరనున్నట్లు తెలిపారు. జలమండలి ఆపరేట్ చేస్తున్న ట్యాంకర్ల సంఖ్య 738కి చేరనుంది. వచ్చే నెలలో మరో వంద ట్యాంకర్లను ప్లస్‌గా నడపనున్నారు. మే మాసంలో ట్యాంకర్ల సంఖ్య 838కు పెంచేలా జలమండలి వ్యూహాన్ని సిద్ధం చేసింది. నాగార్జున సాగర్ నుంచి ఈ రోజు వరకు అందుబాటులో ఉన్న నీరు దాదాపు 133.71 టీఎంసీలు కాగా డెడ్ స్టోరేజీ వద్ద అందుబాటులో ఉన్న నీరు 131.66 టీఎంసీలు, డెడ్ స్టోరేజీపైన 2.05 టీఎంసీలు అందుబాటులో ఉండనుంది. జలమండలి వేసవి అవసరాలకు 5.60టీఎంసీలు నీరు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. (ఏజెన్సీలు)