हैदराबाद/नई दिल्ली: पूर्व केंद्रीय मंत्री और भाजपा सांसद मेनका गांधी ने इंटरनेशनल सोसाइटी फॉर कृष्ण कॉन्शियसनस (ISKCON) पर बड़ा आरोप लगाते हुए उसे भारत का सबसे बड़ा धोखेबाज बताया है।
राष्ट्रीय जनता दल के राष्ट्रीय अभियान प्रभारी प्रशांत कनौजिया द्वारा एक्स पर साझा किए गए वीडियो में मेनका यह बात कहते नजर आ रही हैं। वीडियो में मेनका बता रही हैं कि ISKCON को सरकार द्वारा गौशाला चलाने के लिए जमीन और फायदा मिलता है, लेकिन वो धोखा दे रही है।
भाजपा की सांसद मेनका ने कहा, “मैं हाल में अनंतपुर गौशाला गई थी। एक भी सूखी गाय नहीं थी वहां। पूरी की पूरी डेयरी थी। एक भी बछड़ा नहीं था। इसका मतलब सब बेचे गए। ISKCON अपनी गायों को कसाईयों को बेच रहे हैं। जितना ये करते हैं, उतना कोई नहीं करता।”
उन्होंने कहा, “सड़क पर ये हरे राम-हरे कृष्ण कहते हैं और दूध-दूध कहते हैं, लेकिन जितना इन्होंने कसाईयों को बेचा है, शायद ही किसी ने बेचा हो।”
दुनिया के सबसे प्रभावशाली कृष्ण संप्रदाय इस्कॉन ने अभी तक पूर्व केंद्रीय मंत्री के आरोपों पर प्रतिक्रिया नहीं दी है। पशु अधिकार कार्यकर्ता मेनका गांधी पशु कल्याण के मुद्दों पर सोशल मीडिया पर बोलती रहती हैं।(एजेंसियां)
मैं कई सालों से कह रहा हूँ भारत का सबसे बोगस और फ़र्ज़ीवाडा कोई संस्थान हैं तो वो ISKON हैं। अब तो भाजपा सरकार की वरिष्ठ नेता मानेका गांधी जी ने भी बोल दिया। ये सड़क पर हरे कृष्ण चिल्लाते हैं पर भीतर इनका बड़ा एजेंडा है। ISKON घनघोर जातिवादी भी है। कोई इनका प्रभुपाद है उसने तो… pic.twitter.com/tgrZx0VYi0
— Prashant Kanojia (@KanojiaPJ) September 26, 2023
ఇస్కాన్ అతిపెద్ద మోసకారి, కసాయిలకు గోవులను అమ్మేస్తోంది: మేనకా గాంధీ
హైదరాబాద్/న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ మేనకా గాంధీ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సమాజం (ISKCON) పై సంచలన ఆరోపణలు చేశారు. తన గోశాలలోని ఆవులను కసాయిలకు అమ్ముకుంటోన్న ఇస్కాన్ దేశంలోనే అతిపెద్ద మోసకారి అని మేనకా గాంధీ విమర్శించారు. ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన కృష్ణుడి శాఖ అయిన ఇస్కాన్ మాజీ కేంద్ర మంత్రి చేసిన ఆరోపణలపై ఇంకా స్పందించలేదు. జంతు హక్కుల కార్యకర్త అయిన మేనకా గాంధీ జంతు సంరక్షణ సమస్యలపై సోషల్ మీడియా వేదికగా తన గళం విప్పుతున్నారు.
ఇస్కాన్ (ISKCON) దేశంలోనే అతిపెద్ద చీటర్ గోశాలల ఏర్పాటుకు భూమి, నిర్వహణ సహా ప్రభుత్వం నుంచి లబ్దిపొందుతోంది అని మేనకా గాంధీ ఆరోపించారు. ఆమె ఆరోపణలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం ఇస్కాన్ పర్యటనను ఆమె గుర్తుచేసుకున్నారు. అనంతపురం ఇస్కాన్ గోశాలలో పాలిచ్చిన ఆవులు లేదా దూడలను తాను చూడలేదన్నారు. డెయిరీ మొత్తంలో ఎండిపోయిన ఆవు లేదు అక్కడ ఒక్క దూడ కూడా లేదు. అంటే అన్నీ అమ్ముడయ్యాయి అని మేనకా గాంధీ దుయ్యబట్టారు.
‘తన వద్ద ఉన్న మొత్తం గోవులను కసాయిలకు ఇస్కాన్ అమ్మేస్తోంది వారు చేసినంతగా మరెవరూ చేయరు. మళ్లీ రోడ్లపై ‘హరే రామ్ హరే కృష్ణ’ అని పాడతారు. అప్పుడు తమ జీవితమంతా పాలపైనే ఆధారపడి ఉంటుందని చెబుతారు బహుశా కసాయిదారులకు వీళ్లు అమ్మినంతగా పశువులను ఎవరూ అమ్మి ఉండరు’ అని ఆమె ఆరోపణలు చేశారు.
హరే కృష్ణ ఉద్యమంలో అనుబంధమైన ఇస్కాన్‌కు ప్రపంచవ్యాప్తంగా వందలాది దేవాలయాలు, లక్షలాది మంది భక్తులు ఉన్నారు. స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంసలపై కొన్ని నెలల కిందట విమర్శలు చేసి ఇస్కాన్ వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. అమోఘ్ లీలా దాస్ వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారితీయడంతో ఆయన నిషేధించి తప్పుదిద్దుకునే ప్రయత్నం చేసింది. (ఏజెన్సీలు)