हैदराबाद : उगादी के अवसर पर तेलंगाना के कामारेड्डी जिले में एक भयानक त्रासदी घटी है। जिले के एल्लारेड्डी मंडल के वेंकटपुर अग्रहारम गांव में एक मां और उसके तीन बच्चों की तालाब में गिरने से मौत हो गई। स्थानीय लोगों से सूचना मिलने के बाद पुलिस घटनास्थल पर पहुंची और शवों को बरामद किया। मृतकों की पहचान मौनिका (26), मैथिली (10), अक्षरा (8) और विनय (6) के रूप में की गई है।
बताया जा रहा है कि मौनिका अपने बच्चों को लेकर ताबाल में कपड़े धोने के लिए गई थी। पहले बच्चे नहाने के लिए तालाब में उतरे और डूब गए। उन्हें बचाने की कोशिश में मां भी डूब गई। पुलिस ने तालाब से चार लोगों के शव बरामद किये। दुर्घटना के कारणों की जांच की जा रही है। क्या चारों लोग डूबकर मरे हैं या क्या कोई अन्य कारण है। इसकी जांच कर रहे हैं।

उगादी के दिन एक ही परिवार के चार लोगों की मृत्यु हो जाने से वेंकटपुर अग्रहारम में शोक का माहौल हो गया। इस बीच, मौनिका के परिवार के सदस्यों ने मां और तीन बच्चों की मौत पर संदेह व्यक्त किया हैं। परिजनों ने मांग की है कि पुलिस मामले की गहन जांच कर उन्हें न्याय दिलाए। इस घटना का पूरा विवरण अब तक नहीं मिल पाया है।
ఉగాది పండగ వేళ తీవ్ర విషాదం, చెరువులో పడి తల్లి ముగ్గురు పిల్లలు మృతి
హైదరాబాద్ : ఉగాది పర్వదినాన కామారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎల్లారెడ్డి మండలం వెంకటాపూర్ అగ్రహారం గ్రామంలో చెరువులో పడి తల్లి, ముగ్గురు పిల్లలు మృతి చెందారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. మృతులను మౌనిక (26), మైతిలి (10), అక్షర (8), వినయ్ (6) గా గుర్తించారు.
కాగా, మృతులు బట్టలు ఉతకడానికి వెళ్లి చెరువులో పడి మరణించినట్లు తెలుస్తోంది. మొదట పిల్లలు చెరువులోకి స్నానానికి దిగి నీళ్లలో మునిగిపోగా వారిని కాపాడే ప్రయత్నంలో తల్లి కూడా నీట మునిగి మరణించినట్లు సమాచారం. చెరువులో నుంచి నలుగురి మృతదేహాలను పోలీసులు వెలికితీశారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. నలుగురు నీళ్లలో మునిగి ఊపిరి ఆడకే చనిపోయారా..? లేదా మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో ఆరా తీస్తున్నారు.
పండగ పూట ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందటంతో వెంకటాపూర్ అగ్రహారంలో విషాదచాయలు అలుముకున్నాయి. ఇదిలా ఉంటే తల్లి, ముగ్గురు పిల్లల మృతిపై మౌనిక కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు సమగ్రంగా విచారణ చేసి తమకు న్యాయం చేయాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. (ఏజెన్సీలు)