हैदराबाद: दिनदहाड़े हाथों में बंदूक लिए दो लुटेरे मकान घुस गये। घर में केवल दो महिलाएं और एक बच्ची हैं। महिला और बच्ची ने लुटेरे के हाथ में से बंदूक छीन लिया और उसकी पिटाई कर दी। महिला और बच्ची के साहस भरने वाली घटना से जुड़ा सीसीटीवी वीडियो वायरल हो गया। यह घटना हैदराबाद के बेगमपेट में घटी है।
मिली जानकारी के अनुसार, गुरुवार को दोपहर करीब ढाई बजे बेगमपेट में आनंद थिएटर के पास एक मकान में दो बदमाश घुस गये। वे अपने साथ बंदूक भी लेकर आये। बदमाशों ने एक घर वालों को धमकाकर चोरी करने की योजना बनाई। उस वक्त घर में एक महिला और उसकी बेटी के साथ एक और बुजुर्ग महिला थी। जब लुटेरे बंदूक दिखाकर धमका रहे थे तो छोटी बच्ची बिना डरे हिम्मत और टाइमिंग के साथ लुटेरे पर कूद पड़ी। तुरंत चोर गिर गया और मां-बेटी ने मिलकर चोर की पिटाई कर दी। चोर का विरोध करने पर मां-बेटियों ने उसके हाथ से बंदूक छीन ली और उसे ही धमकाया। यह देखकर एक बदमाश डरकर वहां से भाग गया। बदमाश को सड़क तक भगाया। यह देख पड़ोसी भी मौके पर पहुंच गये।
इसी बीच एक और चोर घर में रुक गया और उसे लूटने की कोशिश की, लेकिन मां-बेटी ने उसे भी बंदूक से धमकाया। चोर भी डर के मारे भाग गया। स्थानीय स्थानीय लोग भी चोर को देखकर डर गए। लेकिन माँ और बेटी ने बिना किसी हिचकिचाहट के चोर को भगा दिया। पुलिस को सूचना मिलने पर मौके पर पहुंची और बंदूक बरामद कर ली गई। पुलिस ने मामला दर्ज कर सीसीटीवी फुटेज के आधार पर जांच करते हुए कुछ ही समय में दोनों चोरों को पकड़ लिया। पुलिस को पता चला कि ये बदमाश उत्तर प्रदेश के हैं और उस परिवार को जानते है।
इसी क्रम में मां-बेटी की बहादुरी की सभी तारीफ कर रहे हैं। बिना किसी डर के चोरों का डटकर सामना करते देख हैट्स-ऑफ कहकर सराहना कर रहे हैं। कहा कि सभी महिलाएं इसी तरह बहादुर बनना चाहिए। लोगों का मानना है कि महिलाएं केवल चोर ही नहीं मुश्किलों में बहादुरी से लड़ने की क्षमता होती है। पुलिस इस मामले की आगे की कार्रवाई कर रही है।
బేగంపేట్‌లో కాల్పుల కలకలం
— Telugu Scribe (@TeluguScribe) March 21, 2024
ఒక ఇంట్లోకి తుపాకీతో దూరిన ఆగంతకుడు.. ఆగంతకుడితో తిరగబడ్డ తల్లీ కూతుళ్లు.
ఇద్దరు అగంతకులను అదుపులో తీసుకున్న పోలీసులు.
తెలిసిన వ్యక్తులే ఇంట్లోకి చేరుబడ్డట్టు గుర్తించిన పోలీసులు.
రేపు మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్న నార్త్ జోన్ డిసిపి రోహిణి… pic.twitter.com/8UFORlAjyY
తుపాకీ లాక్కుని దొంగలను పరుగెత్తించారు, ఈ తల్లీకూతుళ్ల ధైర్యానికి హ్యాట్సాఫ్
హైదరాబాద్: పట్టపగలు చేతిలో తుపాకీతో ఇద్దరు దొంగలు ఇంట్లో ఉన్నది ఆడవాళ్లు మాత్రమే సాధారణంగా అయితే తుపాకీ చూసి భయంతో గజగజా వణికిపోతూ వాళ్లకు కావాల్సింది ఇచ్చి పంపించి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేస్తుంటారు. మరికొందరు అరుపులూ కేకలతో ఇరుగుపొరుగు వారిని పిలిచి దొంగలను పట్టించే పాట్లేమో పడుతుంటారు. కానీ ఈ తల్లీ కూతుళ్లు అందుకు భిన్నం. ధైర్యానికి, సమయస్ఫూర్తికి నిలువెత్తు రూపాలుగా మారిపోయారు. దొంగల చేతిలో తుపాకీలు చూసినా ఏ మాత్రం భయం లేకుండా వారిపై శివంగుల్లా దూకి ఆ తుపాకీని లాక్కుని వాళ్లనే పరుగులు పెట్టించారు. ఎందరో మహిళల్లో ధైర్యాన్ని నింపే ఈ ఘటనకు సంబంధించిన సీసీ వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఘటన హైదరాబాద్ బేగంపేటలో జరిగింది.
బేగంపేట ఆనంద్ థియేటర్ సమీపంలోని ఓ ఇంట్లోకి మధ్యాహ్నం రెండున్నర సమయంలో ఇద్దరు దుండగులు చొరబట్టారు. అయితే వాళ్ల వెంట ఓ నాటు తుపాకీని కూడా తెచ్చుకోగా దాంతో ఇంట్లో వాళ్లను బెదిరించి చోరీ చేయటానికి ప్లాన్ చేసున్నారు. అయితే ఆ సమయంలో ఇంట్లో తల్లీ కూతుళ్లతో పాటు మరో వృద్ధురాలు కూడా ఉన్నారు. దొంగలు తుపాకీతో బెదిరిస్తుండగా ఏమాత్రం భయపడకుండా ధైర్యంగా, సమయస్ఫూర్తితో ఆ దొంగపైకి శివంగిలా దూకింది ఆ చిన్నారి. వెంటనే ఆ దొంగ కింద పడటంతో తల్లీకూతుళ్లు ఇద్దరూ ఆ దొంగను చితకబదారు. ఆ దొంగతో తలపడి.. అతని చేతిలో ఉన్న తుపాకీని లాక్కుని అతన్నే బెదిరించారు ఆ తల్లీ కూతుళ్లు. అది చూసి భయంతో ఓ దొంగ పరుగు లంకించుకున్నారు. వీధిలో వరకు తరిమారు. దీంతో ఇరుగుపొరుగు వాళ్లు స్పందించి పరుగు పరుగున వచ్చారు.
ఇదిలా ఉంటే మరో దొంగ మాత్రం ఇంట్లోనే ఉండి దోచుకునేందుకు ప్రయత్నించగా తుపాకీతో అతన్ని కూడా బెదిరించారు. ఆ దొంగ కూడా భయంతో బయటకు పరుగులు తీయగా స్థానికులు అందులోనూ మగవాళ్లు కూడా ఆ దొంగను చూసి భయపడినా ఆ తల్లీకూతుళ్లు మాత్రం ఏమాత్రం జంకకుండా తరిమితరిమి కొట్టారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. నాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేసి ఆ ఇద్దరు దుండగులు కాస్త వ్యవధిలోనే పట్టేసుకున్నారు పోలీసులు. అయితే వాళ్లు ఉత్తరప్రదేశ్‌కు చెందిన వాళ్లని ఆ కుటుంబానికి తెలిసినవాళ్లేనని పోలీసులు గుర్తించారు.
అయితే ఆ తల్లీకూతుళ్లు ప్రదర్శనించిన ధైర్యసాహసాలను చూసిన అందరూ వారిపై ప్రశంసలు గురిపిస్తున్నారు. ఏమాత్రం భయపడకుండా దొంగలపై శివంగుల్లా దూకటాన్ని చూసి హ్యాట్సాఫ్ అంటూ మెచ్చుకుంటున్నారు. అందరు మహిళలూ ఇలాగే ధైర్యంగా ఉండాలంటున్నారు. మహిళలు ఎవ్వరికీ తక్కువ కాదని దొంగలనే కాదు ఎలాంటి కష్టం వచ్చినా ధైర్యంగా పోరాడి గెలిచే సత్తా ఉటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. (ఏజెన్సీలు)