భారత జాగృతి ఆధ్వర్యంలో జూలై 15న ఉదయం 10 గంటలకు బ్రిస్ బేన్ లోని గాయత్రి మందిర్ లో ప్రారంభం
హైదరాబాద్: ఆస్ట్రేలియాలోని బ్రిస్ బేన్ నగరంలో జరిగే బోనాలు పోస్టర్ ను ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత నేడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీమతి కవిత బ్రిస్ బెన్ లోని తెలంగాణ వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. భారత జాగృతి ఆధ్వర్యంలో జరగనున్న ఈ కార్యక్రమం జూలై 15న ఉదయం 10 గంటలకు బ్రిస్ బేన్ లోని గాయత్రి మందిర్ లో ప్రారంభమవుతుంది.
ఈ కార్యక్రమానికి బ్రిస్ బేన్ తెలంగాణ అసోసియేషన్, క్వీన్స్ ల్యాండ్ తెలుగు అసోసియేషన్, తెలుగు అసోసియేషన్ అఫ్ గోల్డ్ కోస్ట్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రేలియా లు మద్దతు పలికాయి. ఇవాళ జరిగిన ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం లో తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్, భారత జాగృతి ప్రధాన కార్యదర్శి రంగు నవీన్ ఆచారి, యువజన విభాగం అధ్యక్షుడు కోరబోయిన విజయ్, సాంస్కృతిక విభాగం కన్వీనర్ కోదారి శ్రీను, లీగల్ సెల్ కన్వీనర్ తిరుపతి వర్మ, రాష్ట్ర కార్యదర్శి విక్రాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు