हैदराबाद : तेलंगाना के नए सचिवालय में विधायक टी राजा सिंह को कड़वा अनुभव का सामना करना पड़ा है। बुलेट गाड़ी से आए राजा सिंह को सुरक्षाकर्मियों ने रोक लिया। जब वे वृहत जनप्रतिनिधियों की बैठक में भाग लेने आए तो उन्हें सचिवालय में प्रवेश नहीं करने दिया गया। राजा सिंह फिर वहां से लौट गये। सचिवालय में प्रवेश करने से रोके जाने पर राजा सिंह आगबबूला हो गए।
राजा सिंह ने कहा कि वे सचिवालय तभी आए जब मंत्री तलसानी ने उन्हें फोन किया कि शहर के विधायकों के साथ बैठक है। उन्होंने पूछा कि अगर विधायकों को सचिवालय में प्रवेश नहीं दिया जाएगा तो आम लोगों की क्या स्थिति होगी। उन्होंने कहा कि यह शर्म की बात है कि जनता के पैसे से बने सचिवालय में जनप्रतिनिधियों को जाने की अनुमति नहीं है।
मंत्री तलसानी श्रीनिवास यादव ने सचिवालय में ग्रेटर जनप्रतिनिधियों के साथ बैठक का आयोजन किया। इस बैठक में विधायक राजा सिंह को भी आमंत्रित किया गया। मंत्री पेशी भी यही कह रहे हैं। मंत्री पेशी ने स्पष्ट किया कि उन्होंने विधायक को निमंत्रण भेजा है और राजा सिंह गेट तक आए और चले गए।
సచివాలయంలోకి నో ఎంట్రీ, రాజాసింగ్‌కు చేదు అనుభవం
హైదరాబాద్ : తెలంగాణ కొత్త సచివాలయం వద్ద ఎమ్మెల్యే రాజాసింగ్ కు చేదు అనుభవం ఎదురైంది. బుల్లెట్ బండిపై వచ్చిన రాజాసింగ్ ను భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. గ్రేటర్ ప్రజాప్రతినిధుల సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన్ను సచివాలయంలోకి అనుమతించలేదు. దీంతో రాజాసింగ్ అక్కడి నుంచి వెనుదిరిగారు. సచివాలయంలోకి వెళ్లకుండా తనని అడ్డుకోవడంపై రాజాసింగ్ మండిపడ్డారు.
సిటీ ఎమ్మెల్యేలతో మీటింగ్ ఉందని మంత్రి తలసాని పిలిస్తేనే సచివాలయానికి వచ్చానని రాజాసింగ్ అన్నారు. ఎమ్మెల్యేలకే సచివాలయంలోకి అనుమతి లేకుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. ప్రజల డబ్బుతో కట్టిన సచివాలయంలోకి ప్రజా ప్రతినిధులను అనుమతించకపోవటం సిగ్గుచేటన్నారు.
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో సచివాలయంలో గ్రేటర్ ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే రాజాసింగ్‌కు కూడా ఆహ్వానం పంపారు. ఇదే విషయాన్ని మంత్రి పేషీ కూడా చెబుతుతోంది. తాము ఆహ్వానం పంపామని, రాజాసింగ్ గేటు వరకు వచ్చి వెళ్లిపోయారని మంత్రి పేషీ ప్రకటించింది. (ఏజెన్సీలు)