మరిన్ని మంచి రచనలు సుధీర్ చేయాలి – మంత్రి కేటీఆర్
ఉస్మానియా, అంబేద్కర్ వర్శిటీల విసీలు, టిసాట్ సీఈవో శైలేష్ రెడ్డి సమక్షంలో ఆవిష్కరణ
హైదరాబాద్: ప్రముఖ కవి, రచయిత రాజన్న సిరిసిల్లా జిల్లాకు చెందిన గంగాడి సుధీర్ రచించిన రెండవ పుస్తకం ‘కవనం’ కవితా సంపుటిని రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. నేడు హైదరాబాద్ టిసాట్ ప్రాంగణంలో జరిగిన వేడుకలో ఓయూ, అంబెద్కర్ యూనివర్శిటీ వీసీలు, టిసాట్ సీఈవో శైలేష్ రెడ్డి ఇతర విద్యావేత్తల సమక్షంలో పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్ భవిష్యత్తులో గంగాడి సుధీర్ మరిన్ని మంచి రచనలు చేయాలని అభిలషించారు.
ఈ సందర్భంగా రచయిత గంగాడి సుధీర్ మాట్లాడుతూ సచివాలయం ప్రారంభోత్సవం రోజున మంత్రి గంగుల కమలాకర్ చేతుల మీదుగా కవర్ పేజీ ఆవిష్కరించకున్న ‘కవనం‘ కవితా సంపుటిని తన జన్మక్షేత్రం సిరిసిల్లలో ఆవిష్కరించాలనుకున్నప్పటికీ, తన కార్యక్షేత్రంలో కేటీఆర్ చేతులమీదుగా విడుదలవడం సంతోషంగా ఉందన్నారు.
తన మొదటి పుస్తకం ‘ఇగురం’ కథా సంపుటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో పాటు అనేక మంది ప్రముఖుల, పండిత పామరుల ఆదరాబిమానాలు పొంది ఎంతో గుర్తింపును తెచ్చిందని, ఈ రెండవ పుస్తకాన్ని సైతం అలాగే ఆదరించాలని కోరారు. తన పుస్తకాలు అన్ని ప్రముఖ పుస్తక షాపులతో పాటు అమెజాన్లో https://www.amazon.in/s?me=A26XAD8JQ9CA9K&ref=sf_seller_app_share_new సైతం అందుబాటులో ఉన్నాయన్నారు రచయిత గంగాడి సుధీర్.
ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్తో పాటు ఓయూ వీసీ రవిందర్ యాదవ్, అంబేద్కర్ యూనివర్శిటీ వీసీ సీతారామారావ్, టీసాట్ సీఈవో శైలేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.