గతేడాది కన్నా 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అధికంగా సేకరణ
ముఖ్యమంత్రి కేసీఆర్ గారి రైతు అనుకూల విధానాలతో దేశానికే అన్నపూర్ణగా తెలంగాణ
ధాన్యం కొనుగోళ్లపై మంత్రి గంగుల కమలాకర్ ఉన్నతస్థాయి సమీక్ష
Hyderabad: రాష్ట్రంలో వానాకాలం ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగుతుందన్నారు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, ఈ రోజు మినిస్టర్ క్వార్టర్స్ లో సివిల్ సప్లైస్ కమిషనర్ ఇతర ఉన్నతాధికారులతో మంత్రి గంగుల ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. గత సంవత్సరం కన్నా ఇదే రోజుకి 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అధికంగా సేకరించామన్నారు. గత సీజన్లో నవంబర్ నెలలో 25.84 LMT’s సేకరిస్తే, ఈ నవంబర్లో దాదాపు 10 LMT’s ఎక్కువగా సేకరించామన్నారు.
సీఎం కేసీఆర్ గారి వ్యవసాయ అనుకూల విధానాలు, పుష్కలమైన నీటితో ఈసారి ధాన్యం నాణ్యత మరింత పెరిగిందని, దేశానికే తెలంగాణ అన్నపూర్ణగా మారిందన్నారు, ప్రైవేట్లో సైతం ఎంఎస్పీ కన్నా అధికంగా దర రావడం మంచి పరిణామమన్నారు. డిసెంబర్ మాసంలో కోతలు జరగుతున్న విదంగా ధాన్యం సేకరణ వేగవంతంగా జరుగుతుందని, ప్రభుత్వం అందుకు సంబందించి అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు.
మంత్రి తెలియజేసిన వివరాల ప్రకారం రాష్ట్రంలో 6734 కొనుగోలు కేంద్రాల ద్వారా నిన్నటివరకూ 6లక్షల 42వేల మంది రైతులనుండి 38.06 LMT’s ధాన్యం సేకరించామని ఇందులో 36.87 LMT’s ధాన్యాన్ని మిల్లులకు తరలించామని, వీటివిలువ 7837 కోట్లకుగానూ రైతులకు 4780 కోట్లు చెల్లించామన్నారు. ఇప్పటివరకూ 9.52 లక్షల గన్నీలు వాడమనీ ఇంకా ఎలాంటి కొరత లేకుండా 9.16లక్షల గన్నీలు అందుభాటులో ఉన్నాయని ఇప్పటికి 729 కేంద్రాల్లో ప్రక్రియ పూర్తై మూసేసామన్నారు, కొనుగోలు కేంద్రాల్లో ప్యాడీక్లీనర్లు, మాయిశ్చర్ మిషన్లు, టార్పాలిన్లు తదితర అన్ని మౌళిక వసతులు సమకూర్చామన్నారు, రైతులు ఎఫ్ఏక్యూ తో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకురావలన్నారు మంత్రి గంగుల కమలాకర్. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లైస్ కమిషనర్ వి.అనిల్ కుమార్, డిప్యూటీ కమిషనర్ రుక్మిణి తదితరులు పాల్గొన్నారు.