గర్భిణీలలో పోషక ఆహార లోపం, రక్త హీనత లేకుండా కాపాడేందుకు KCR న్యూట్రిషన్ కిట్స్

గర్భిణీలలో పోషక ఆహార లోపం, రక్త హీనత లేకుండా కాపాడేందుకు కే.సి.ఆర్ న్యూట్రిషన్ కిట్స్ పంపిణీ చేశారు.

కెసిఆర్ కిట్ లను అందచేశారు

ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను, NCD కిట్ లను పరిశీలించారు.

అలాగే, బీపీ ఆపరేటర్ల ను పంపిణీ చేశారు.

ఆ తర్వాత ప్రభుత్వ హాస్పిటల్ ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు.

హైదరాబాద్: రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా తెలంగాణ వైద్య ఆరోగ్య దినోత్సవం సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ రోజు పాలకుర్తి సామాజిక ఆరోగ్య కేంద్రంలో పోస్ట్ మార్టం గదిని ప్రారంభించారు. అనంతరం రోగులకు పండ్లు పంపిణీ చేశారు.

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కామెంట్స్:

వైద్య రంగంలో తెలంగాణ అగ్రగామిగా ఉంది. మన తెలంగాణ రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణ దిశగా తీసుకెళ్ళడానికి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగతున్నది. ఇందులో భాగంగా మన గౌరవ ముఖ్యమంత్రి కే.సి.ఆర్ గారు అనేక పథకాలను ప్రవేశపెట్టడం జరిగినది.

నీతి ఆయోగ్ విడుదల చేసిన 2021 హెల్త్ ఇండెక్స్ లో ఓవరాల్ ర్యాంకింగ్స్ లో తెలంగాణ 3 వ స్థానంలో, పురోగతిలో మొదటి స్థానంలో, వ్యాక్సినేషన్, ప్రసవాల పురోగతిలో టాప్ లో నిలిచింది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఒక్క మెడికల్ కళశాల కూడా ఇవ్వనప్పటికీ ఆరోగ్య తెలంగాణలో భాగంగా మన గౌరవ ముఖ్యమంత్రి కే.సి.ఆర్ గారు అన్ని జిల్లాలకు మెడికల్ కళాశాలలు మంజూరీ చేసి పనులు పురోగతిలో ఉన్నవి. అలాగే హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిని అదనముగా రెండు వేల పడకలకు పెంచడంతోపాటు హైదరాబాద్ నగరం చుట్టూ 4 వేల 200 పడకల తో నాలుగు మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం చేపట్టడం జరుగుతున్నది.

వరంగల్‌లో 24 అంతస్తులతో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం 11 వందల కోట్ల ఖర్చుతో నిర్మించడం జరుగుతున్నది. నూతనంగా ఏర్పడిన జనగాం జిల్లాలో మెడికల్ కళాశాల మంజూరీ చేసి రూ. 18 కోట్ల 70 లక్షలతో నిర్మాణ పనులు జరుగుచున్నాయి. మన పాలకుర్తి ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రిగా అప్ గ్రేడ్ కు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగింది. ప్రస్తుతం ఉన్న 30 పడకల తొర్రూర్ ఆసుపత్రి ని 100 పడకల ఆసుపత్రిగా అప్ గ్రేడ్ కు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగింది. తొర్రూర్ లో 16 లక్షలతో మార్చురీ భవనము నిర్మాణము చేసి ప్రారంభించుకున్నాము. పాలకుర్తి లో 33 లక్షల ఖర్చుతో మార్చురీ భవనము ఈ రోజు ప్రారంభించుకుంటున్నాము.

కే.సీ.ఆర్ కిట్
తెలంగాణ ప్రభుత్వం జూన్ 2, 2017 న కే.సి.ఆర్ కిట్ కార్యక్రమమును ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టింది.
పాలకుర్తి నియోజకవర్గంలో 13 వేల 965 మంది లబ్దిదారులకు కే.సి.ఆర్ కిట్లతో పాటు 17 కోట్ల 58 లక్షల రూపాయలు నగదు అందజేయడం జరిగింది.

కంటి వెలుగు కార్యక్రమము:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమమును ప్రతిష్టాత్మకంగా 2018 ఆగష్టు 15న ప్రారంభించింది. కంటి వెలుగు ద్వారా మన నియోజకవర్గంలో కంటి పరీక్షలు చేసి అందులో 30 వేల 437 మందికి కంటి అద్దాలు అందివ్వడం జరిగింది. కంటి వెలుగు కార్యక్రమము త్వరలో గిన్నిస్ రికార్డులకు ఎక్కనున్నది.

బస్తి దవాఖాన
మన నియోజకవర్గంలోని తొర్రూర్ మునిసిపాలిటి లో బస్తి దవాఖానా త్వరలో ప్రారంభించబోతున్నాం.

పల్లె దవఖానాలు(హెల్త్ వెల్ నెస్ సెంటర్లు)
మన నియోజకవర్గంలో 51 పల్లె దవఖానాల ద్వారా గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందజేస్తున్నాము.

ఆరోగ్య మహిళ:
అంతర్జాతీయ మహిళ దినోత్సవం మార్చి 8 వ రోజున జిల్లాలో ఆరోగ్య మహిళా క్లినిక్ లు ప్రారంభమయ్యాయి.
మహిళలకు ప్రతి మంగళవారం 8 రకాల వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందజేస్తున్నాము.

కే.సి.ఆర్ న్యూట్రిషన్ కిట్స్:
గర్భిణీ స్త్రీలలో పోషక ఆహార లోపం, రక్త హీనత లేకుండా కాపాడేందుకు కే.సి.ఆర్ న్యూట్రిషన్ కిట్స్ అందజేస్తున్నాము. మన నియోజకవర్గంలో 96 మందికి ఈ రోజు అందిస్తున్నాము.

తెలంగాణ డయాగ్నస్టిక్స్ సెంటర్:
ప్రజారోగ్యమే రాష్ట్ర ప్రభుత్వ ద్యేయంగా తెలంగాణ రాష్ట్రంలో 19 జిల్లాలో డ‌యాగ్నస్టిక్ సెంట‌ర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లాలో జ‌న‌గామ‌, మ‌హ‌బూబాబాద్, ములుగులోని ప్రభుత్వ ఆసుప‌త్రుల్లో వైద్య ప‌రీక్షల కేంద్రాల‌ను (డ‌యాగ్నస్టిక్ సెంట‌ర్లు) ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ ప్రభుత్వ డ‌యాగ్నస్టక్ కేంద్రాల‌లో 57 ర‌కాల ప‌రీక్షలు ఉచితంగా చేస్తారు.

ఆశా వర్కర్లు:
ఆశా వర్కర్ల కు దేశంలో ఎక్కడలేని విధంగా నెలకు 9 వేల 750 రూపాయల వేతనము ఇస్తున్నాము. కంటి వెలుగు పథకం దేశంలోనే వినూత్నంగా అమలు చేస్తున్నాం. పాలకుర్తి నియోజకవర్గం లో 1 లక్షా 30 వేల మందికి కంటి అద్దాలు ఇప్పించాం. బీజేపీ, కాంగ్రెస్ ఇతర ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ తరహా ఆరోగ్య పథకాలు అమలు కావడం లేదు. మనకు లాగా ఆయా రాష్ట్రాల్లో ఆశా వర్కర్ లకు వేతనాలు ఇవ్వటం లేదు.

ఈ సభలో పలువురు వ్యాధిగ్రస్తులు, వివిధ ఆరోగ్య సమస్యలను జయించిన వాళ్ళు డాక్టర్ల సేవలను కొనియాడుతూ ప్రసంగించారు. కిడ్నీ, కంట వెలుగు, ప్రసూతి వైద్యము చేయించుకొని నయమైన పేషంట్లు, వారి కుటుంబ సభ్యులు మాట్లాడారు.

అలాగే ఉత్తమ ప్రతిభ కనబరచిన పలువురు డాక్టర్లు, సిబ్బందికి మంత్రి సత్కరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టరేట్ ప్రఫుల్ దేశాయ్, drdo రాంరెడ్డి, dm&ho ప్రశాంత్, డాక్టర్లు, సిబ్బంది, స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రజలు, మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X