आधी रात को सड़क हादसा, कार में 8 करोड़ के आभूषण, पुलिस हैरान, समझो तो बहुत कुछ, वर्ना कुछ नहीं

हैदराबाद: गुरुवार आधी रात को आंध्र प्रदेश के एक राष्ट्रीय राजमार्ग पर अचानक तनाव पैदा हो गया। प्रकाशम जिले के ओंगोल तालुका के दशराजूपल्ली में विजयवाड़ा से नेल्लोर जा रही एक वैन अचानक सामने जा रही लॉरी को टक्कर गई। वैन में तीन यात्री सवार थे। इनमें एक ड्राइवर, एक सुरक्षा गार्ड और एक सुरक्षा सुपरवाइजर शामिल था। दुर्घटना में ड्राइवर और गार्ड घायल हो गए, जबकि सुपरवाइजर नागराजू सुरक्षित बाहर आ गया। रात में सड़क पर दुर्घटनाएं होना आम बात है, लेकिन आपको यह जानकर आश्चर्य होगा कि उस वैन में क्या ले जाया जा रहा था।

इस कार में 8 करोड़ रुपये के सोने के आभूषण थे। यह घटना उस समय हुई जब एक प्रमुख सोना बेचने वाली कंपनी विजयवाड़ा से आभूषणों को एक वाहन में नेल्लोर स्थित अपनी शाखा में ले जा रही थी। मामले की जानकारी मिलने पर पुलिस तुरंत मौके पर पहुंची और त्रिपुरांतकम सीआई गोसानी असान के नेतृत्व में सतर्क हो गई। सोने की सुरक्षा के लिए वैन को टोइंग वाहन के साथ ओंगोल तालुका थाना ले गया।

हालांकि, भारी मात्रा में सोने के आभूषणों को ले जा रहे वाहन दुर्घटनाग्रस्त हो जाने से पूरे राज्य में चर्चा का विषय बन गया। आभूषणों के बारे में पूरी स्पष्टता प्राप्त करने की आवश्यकता के चलते जांच की जा रही है। शुक्रवार की सुबह कंपनी के प्रतिनिधि पुलिस स्टेशन पहुंचे, सही दस्तावेज दिखाए और उन्हें दूसरे वाहन में आभूषणों को नेल्लोर ले गए।

Also Read-

అర్థరాత్రి రోడ్డుప్రమాదం, వాహనంలో రూ.8 కోట్ల బంగారం, షాకైన పోలీసులు

హైదరాబాద్ : జాతీయ రహదారిపై గురువారం అర్ధరాత్రి ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. విజయవాడ నుంచి నెల్లూరు వెళ్తున్న వ్యాన్‌ అకస్మాత్తుగా ప్రకాశం జిల్లా ఒంగోలు తాలూకా పరిధిలో దశరాజుపల్లి వద్ద ముందుండిన లారీని ఢీ కొట్టింది. వ్యాన్‌లో ముగ్గురు ప్రయాణికులు డ్రైవర్, సెక్యూరిటీ గార్డు, సెక్యూరిటీ సూపర్‌వైజర్ ఉన్నారు. ప్రమాదంలో డ్రైవర్, గార్డు గాయపడగా, సూపర్‌వైజర్ నాగరాజు మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. రాత్రివేళ రహదారిపై ప్రమాదాలు జరుగటం సాధారణం కానీ, ఆ వ్యాన్‌లో వారు ఏం తరలిస్తున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

అందులో ఏకంగా 8 కోట్ల విలువైన బంగారు ఆభరణాలున్నాయి. బంగారం విక్రయించే ఓ ప్రముఖ సంస్థ విజయవాడ నుంచి నెల్లూరులోని తమ బ్రాంచికి ఓ వాహనంలో ఆభరణాలు తరలిస్తుండగా ఘటన చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని త్రిపురాంతకం సీఐ గోసాని అసాన్‌ ఆధ్వర్యంలో అప్రమత్తమయ్యారు. బంగారం భద్రతకు టోయింగ్ వాహనంతో వ్యాన్‌ను ఒంగోలు తాలూకా స్టేషన్‌కు తరలించారు.

అయితే, భారీగా బంగారు ఆభరణాలు తరలించే వాహనానికి ప్రమాదం జరుగటంతో ఒక్కసారిగా రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆభరణాల గురించి పూర్తిగా క్లారిటీ రావాల్సిన అవసరముండటంతో విచారణ ప్రారంభించారు. శుక్రవారం ఉదయం ఆ సంస్థ ప్రతినిధులు పోలీసుస్టేషన్‌కు చేరుకుని సరైన డాక్యుమెంట్లు చూపించి, వాటిని మరో వాహనంలో నెల్లూరుకు తరలించారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X