Merry Christmas: తెలంగాణ ప్రజలకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు

హైదరాబాద్ : క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని  రాష్ట్ర, దేశ ప్రజలకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు మరియు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఏసుక్రీస్తు దీవెనలు ప్రలందరికీ లభించాలని ఇరువురు  సీఎంలు ఆకాంక్షించారు. శాంతి, కరుణ, సహనం, ప్రేమ విలువలను ప్రపంచానికి చాటిన ఏసుక్రీస్తు బోధనలు విశ్వమానవ సహోదరత్వానికి దోహదం చేశాయని కేసీఆర్ అభివర్ణించారు. మానవాళిని సత్యపథం వైపు నడిపించేలా ఏస్తుక్రీస్తు మార్గదర్శం చేశారని జగన్ అన్నారు. 

తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ వేడుకలు మొదలయ్యాయి. ఆసియా ఖండంలో రెండో అతిపెద్ద చర్చిగా గుర్తింపు పొందిన మెదక్ కెథడ్రల్ ​చర్చిలో క్రిస్మస్ వేడుకలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. ఉదయం 4.30 గంటలకు మొదటి ఆరధన నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పాస్టర్లు భక్తులకు దీవెనలు అందజేస్తారు.

రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు

శాంతి, కరుణ, ప్రేమ, సేవ అన్న క్రీస్తు బోధనలు అందరికీ ఆచరణీయం

సిఎం కేసిఆర్ గారు అన్ని మతాలను సమానంగా చూస్తూ అధికారికంగా నిర్వహిస్తున్నారు

తెలంగాణలో క్రిస్టియన్ మైనారిటీల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

హైదరాబాద్: ఏసుక్రీస్తు పుట్టిన రోజు డిసెంబర్ 25వ తేదీన ప్రపంచమంతా అత్యంత ఘనంగా జరుపుకునే క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

అందరినీ ప్రేమించాలి, శాంతి మార్గంలో నడవాలి, సేవాభావంతో మెలగాలి అన్న క్రీస్తు బోధనలు సర్వమానవాళికి ఆచరణీయమన్నారు. క్రీస్తు బాటలో నడిస్తే ఈ ప్రపంచంలో మోసాలు, పాపాలు ఉండవని, యుద్దాలకు ఆస్కారం లేదని అన్నారు. అన్ని మతాల సారం మానవత్వమే, అన్ని మతాలకు దేవుడు ఒక్కడే అన్న ఏసుక్రీస్తు ప్రభోదం మేరకు గౌరవ ముఖ్యమంత్రి కేసిఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చాక అన్ని మతాలను సమాన దృష్టితో చూస్తూ అన్ని మతాల ముఖ్య పండగలను అధికారికంగా నిర్వహిస్తున్నారని తెలిపారు.

దేశం మొత్తంలో రంజాన్ పండగను అధికారికంగా నిర్వహిస్తూ, రెండు రోజులు సెలవులిస్తూ, రంజాన్ పర్వదినం సందర్భంగా దాదాపు 2 లక్షల 85వేల మంది క్రిస్టియన్ సోదర, సోదరీమణులకు నూతన బట్టలిచ్చి, విందు ఇస్తున్న గొప్ప సంస్కృతిని నెలకొల్పిన ఏకైక ముఖ్యమంత్రి కేసిఆర్ గారు అన్నారు. అంతే కాకుండా క్రిస్టియన్ మైనారిటీ సోదరుల ఆత్మగౌరవం పెంపొందించేలా వారికి 2 ఎకరాల స్థలంలో 10 కోట్ల రూపాయలతో క్రిస్టియన్ భవనం నిర్మించడానికి కూడా శంకుస్థాపన చేశారన్నారు.

గతంలో ఎప్పుడూ లేనివిధంగా చర్చిల నిర్మాణానికి, మరమ్మత్తులకు, ఆధునీకరణకు, మౌలిక వసతుల ఏర్పాటుకు ప్రభుత్వ నిధులు ఖర్చు పెట్టేందుకు అనుమతినిచ్చిన ఏకైక ప్రభుత్వం కూడా తెలంగాణ అని తెలిపారు. క్రిస్టియన్ విద్యార్థులు నాణ్యమైన విద్య పొందేందుకు రెసిడెన్షియల్ పాఠశాలల్లో అడ్మిషన్లు ఇస్తున్నారని, విదేశాల్లో విద్య అభ్యసించేందుకు ఓవర్సీస్ స్కాలర్ షిప్ 20 లక్షల రూపాయలు అందిస్తున్నారని తెలిపారు.

క్రిస్టియన్ యువతకు ఉపాధి కల్పించేందుకు డ్రైవర్ ఎంపవర్ మెంట్ కింద 60 శాతం సబ్సిడీతో కార్లను అందిస్తున్నారని, ఉపాధి శిక్షణ ఇస్తున్నారని, 10 లక్షల వరకు సబ్సిడీ అందేలా బ్యాంకు లింకేజీతో రుణాలు కల్పిస్తున్నారని తెలిపారు. ఇప్పటి వరకు 1718 మందికి 19 కోట్ల రూపాయలను సబ్సిడీగా అందించిందన్నారు.

జెరూసలేంకు వెళ్ళే క్రిస్టయన్ భక్తులకు ప్రయాణ వసతులు కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం కూడా తెలంగాణ అన్నారు. టిఎస్ ప్రైమ్ కింద క్రిస్టియన్ మైనారిటీ యువతను పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తున్నారని, ఐటి పారిశ్రామిక వేత్తల కోసం ఐటి పార్కులు ఏర్పాటు చేస్తున్నామన్నారు.

ఇలా క్రిస్టియన్ మైనారిటీల సర్వతోముఖాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసిఆర్ గారి నాయకత్వంలో కృషి చేస్తోందని, దీనిని క్రిస్టియన్లందరూ గుర్తించి కేసిఆర్ గారికి మద్దతుగా నిలబడాలని కోరారు. మరోసారి క్రిస్టియన్ సోదర, సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.

ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి వేముల

నిజామాబాద్: క్రిస్మస్ పండుగ పర్వదినం పురస్కరించుకుని రాష్ట్ర రోడ్లు – భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. యేసుక్రీస్తు జన్మించిన ఈ శుభ దినాన అందరికీ శాంతి, సౌభాగ్యాలు చేకూరాలని ఆకాంక్షించారు. ఈ క్రిస్మస్ వేడుక ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషం నింపాలని, ఇంటింటా ఆనందపు కాంతులు వెల్లివిరియాలని అభిలషించారు.

క్రిస్టియన్ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు – మంత్రి గంగుల కమలాకర్

క్రైస్తవ సోదరులకు ముఖ్యమైన పండగ క్రిస్మస్ సందర్భంగా రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాష్ట్రంలో అన్ని పండగలను వైభవంగా నిర్వహిస్తున్నారని ప్రతి మతాన్ని సమానంగా చూస్తున్నారని, సర్వమత సౌభాతృత్వంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. ఏసుక్రీస్తు బోధనలు ప్రపంచానికి శాంతిని అందజేశాయని రేపు క్రిస్మస్ పండగని సోదరులంతా ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని మంత్రి గంగుల ఆకాంక్షించారు.

క్రిస్మస్ సందర్భంగా క్రిస్టియన్ సమాజానికి శుభాకాంక్షలు:ఎంపీ రవిచంద్ర

ఏసు ప్రభువు బోధనలు విశ్వ మానవాళికి నాడు,నేడు, ఏనాటికీ కూడా అనుసరణీయమే: ఎంపీ రవిచంద్ర

ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని ధర్మాలను సమదృష్టితో చూస్తారు:ఎంపీ రవిచంద్ర

మైనారిటీల భద్రత, సంక్షేమం, ఉన్నతికి అంకితభావంతో ముందుకు సాగుతున్నరు:ఎంపీ రవిచంద్ర

మైనారిటీలను ఉన్నత విద్యావంతుల తీర్చిదిద్దేందుకు 204 గురుకులాలను నెలకొల్పారు: ఎంపీ రవిచంద్ర

హైదరాబాద్ : క్రిస్మస్ పర్వదినం సందర్భంగా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర క్రిస్టియన్ సమాజానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఏసు ప్రభువు ప్రేమ,దయ,కరుణ, సత్యం,శాంతి,సహనం, సౌభ్రాతృత్వం విలువల గురించి బోధించారని,అవి నాడు,నేడు,ఏనాటికీ కూడా విశ్వ మానవాళికి ఆచరణీయం,అనుసరణీయమేనని రవిచంద్ర ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు అన్ని ధర్మాలను సమదృష్టితో చూస్తారని, మైనారిటీల భద్రత, సంక్షేమం, ఉన్నతికి అంకితభావంతో ముందుకు సాగుతున్నారన్నారు.మైనారిటీలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు గాను 204 గురుకులాలను నెలకొల్పారని తెలిపారు.క్రిస్మస్ వేడుకలను ప్రతి ఏటా తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని, పేదలకు పెద్ద ఎత్తున దుస్తులు బహుకరిస్తున్నదని రవిచంద్ర వివరించారు.

క్రిస్మస్ సందర్భంగా క్రిస్టియన్ మత పెద్దలకు తన తల్లిదండ్రులు నారాయణ,వెంకటనర్సమ్మల జ్ఞాపకార్థం కానుకలు అందజేసిన ఎంపీ రవిచంద్ర

క్రిస్మస్ పర్వదినం సందర్భంగా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తన తల్లిదండ్రులు నారాయణ,వెంకటనర్సమ్మల జ్ఞాపకార్థం క్రిస్టియన్ మత పెద్దలకు కానుకలు అందజేశారు.నర్సంపేట రోడ్డు డీసెంట్ ఫంక్షన్ హాల్ లో శనివారం గ్రేటర్ వరంగల్ క్రిస్టియన్ ఫెలోషిప్ నేతృత్వంలో ఎంపీ రవిచంద్ర తరపున వారి అన్న కిషన్ కుమారుడు శ్రీనివాస్ ఈ కానుకలు అందజేశారు.ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సారి కూడా సుమారు 500 మంది క్రిస్టియన్ మత పెద్దలకు నూతన వస్త్రాలను బహుకరించారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ పాస్టర్స్ పాల్ ముస్తఫా,కాకిలేటి అబ్రహం, మడిపల్లి లేవీ,గంధం అరుణ్ జేమ్స్,బాష్పాక ఏలియా,ఎమ్మెస్ సామేల్,సందెల లాజర్,కిన్నెర రవి,ఎమ్మెస్ రాజు,అసంపల్లి అబ్రహం,జన్ను ప్రభాకర్,బీ కాలేబు,జూపాక యాకోబ్,సాల్మన్ రాజ్, మహేందర్ పాల్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా క్రిస్మస్ కేక్ కట్ చేసి,పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు, ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

తెలంగాణ ప్రజలకు క్రిస్టమస్ శుభాకాంక్షలు: టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి

తెలంగాణ లోని క్రిస్టియన్ సోదర సోదరీమణులకు క్రిస్టమస్ పర్వదినోత్సవం సందర్భంగా హృదయ పూర్వక శుభాకాంక్షలు. క్రీస్తు జన్మ దినోత్సవం క్రిస్టమస్ పండుగను క్రిస్టియన్లు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ప్రతి ఇంటా పండుగ ఘనంగా జరగాలని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X