हैदराबाद: जगित्याला जिले के कोरुट्ला शहर में भीषण अग्नि दुर्घटना की घटना घटी है। कोरुटला शहर के गडिबुरुजु स्थित सूफिया नामक सामिल में बुधवार की सुबह आग लग गई। आसपास के लोग ध्यान में आने से पहल सामिल में रखे कीमती सागौन के लट्ठे पूरी तरह जल चुके। हर दिन की तरह रात 11 बजे सामिल के मालिक काम खत्म कर ताला लगाकर चले गया। हालांकि, यह पता नहीं चल पाया है कि आग शॉर्ट सर्किट के कारण लगी या आकस्मिक आग इसका पता नहीं चल पाया है।
आग से बहुत बड़ा नुकसान हुआ। इस अग्निकांड में लगभग एक करोड़ रुपये की संपत्ति का नुकसान हुआ है। सागौन के लट्ठे और कीमती सामान पूरी तरह जल गये। फायर ब्रिगेड को सूचना देने के बाद फायर ब्रिगेड ने आग बुझाई, लेकिन तब तक नुकसान काफी हो चुका। सामिल में आग लग के कारण के बगल के दो-तीन घर भी आग की चपेट में आ गये। लेकिन स्थानीय लोगों के सतर्क हो जाने से बड़ा हादसा टल गया।
సామిల్లో ఘోర అగ్ని ప్రమాదం, భారీగా ఆస్తి నష్టం
హైదరాబాద్: జగిత్యాల (తెలంగాణ) జిల్లా కోరుట్ల పట్టణంలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కోరుట్ల పట్టణంలోని గడిబురుజు వద్ద సుఫియా అనే సామిల్లో బుధవారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి, చుట్టుపక్కల వాళ్ళు గమనించి చేరుకునే లోపు సామిల్లో ఉన్న విలువైన వస్తువులు టేకు దుంగలు పూర్తిగా కాలిపోయాయి. ప్రతిరోజు లాగే రాత్రి 11 గంటల సమయంలో సామిల్ యజమానులు పని ముగించుకుని తాళం వేసి వెళ్లారు. అయితే షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందో లేక ప్రమాదవశాత్తు నిప్పంటుకుందో తెలియదు కానీ భారీగా మంటలు చెలరేగాయి.
దీంతో భారీగా నష్టం వాటిల్లింది. ఈ అగ్ని ప్రమాదంలో సుమారు కోటి రూపాయల వరకు ఆస్తి నష్టం వాటిలినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. టేకు దుంగలు అలాగే విలువైన సామాగ్రి ఉండడంతో అవి పూర్తిగా కాలిపోయాయి. ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. సామిల్కు మంటలు అంటుకోవడంతో పాటు సామిల్ పక్కన ఉన్న రెండు మూడు ఇళ్లలో కూడా మంటలు వ్యాపించాయి. అయితే అప్రమత్తమైన స్థానికులు బయటకు వెళ్లడంతో పెద్ద ప్రమాదం తప్పింది. (ఏజెన్సీలు)