हैदराबाद: तेलंगाना में लोकसभा चुनाव अहम पड़ाव पर पहुंच गया है। पूरे प्रदेश में मतदान का महापर्व चल रहा है। 17 लोकसभा क्षेत्रों में सुबह 7 बजे से ही मतदाता अपने मताधिकार का प्रयोग करने के लिए कतार में लग गए। गर्मी का मौसम होने के कारण लोग सूरज ढलने से पहले वोट डालने की चाहत लेकर मतदान केंद्रों पर पहुंच रहे हैं।
इसी क्रम में एक मतदान केंद्र पर हादसा हो गया। चुनाव ड्यूटी कर रहे कर्मचारियों में से एक कर्मचारी की दिल का दौरा पड़ने से मौत हो गई। यह दुखद घटना भद्राद्रि कोत्तागुडेम जिले के अश्वरावपेट के नेहरू नगर में घटी है। नेहरू नगर में बने 165 मतदान केंद्रों पर श्रीकृष्ण नामक कर्मचारी चुनाव ड्यूटी कर रहा था।
श्रीकृष्ण को दिल का दौरा पड़ा और वह नीचे गिर गया। इस घटना के कारण मतदान केंद्र पर मतदान रोक दिया गया। अधिकारियों ने तुरंत उसके शव को पोस्टमार्टम के लिए सरकारी अस्पताल भेज दिया। श्रीकृष कोत्तागुडेम जिले के चुंचुपल्ली में वरिष्ठ सहायक के पद पर कार्यरत हैं। जब इसकी जानकारी उनके परिजनों को हुई तो वे शोक में डूब गये। इस संबंध में अधिक जानकारी नहीं मिली है।
यह भी पढ़ें-
హైదరాబాద్ : తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు కీలక ఘట్టానికి చేరుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఓట్ల పండుగ నడుస్తోంది. ఉదయం 7 గంటల నుంచే 17 లోక్ సభ సెగ్మెంట్లలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు క్యూ కట్టారు. వేసవికాలం కావటంతో ఎండలు ముదరక ముందే ఓట్లు వేయాలన్న భావనతో ప్రజలు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు.
ఈ క్రమంలో ఓ పోలింగ్ కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సిబ్బందిలో ఓ ఉద్యోగి గుండెపోటుతో మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటని నెహ్రూ నగర్‌లో చోటు చేసుకుంది. నెహ్రూ నగర్‌లో ఏర్పాటు చేసిన 165 పోలింగ్ బూత్‌లో శ్రీకృష్ణ అనే ఉద్యోగి ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారు.
శ్రీకృష్టకు ఒక్కసారిగా గుండెపోటు రావటంతో కుప్పకూలిపోయాడు. ఏమైందని తెలుసుకునేలోపే శ్రీకృష్ణ తుదిశ్వాస విడిచారు. ఈ ఘటనతో పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ ఆగిపోయింది. అధికారులు వెంటనే ఆయన మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శ్రీకృష్ కొత్తగూడెం జిల్లా చుంచుపల్లిలో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. విషయం తెలుకున్న అతని కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు. ఎన్నికల విధులు నిర్వహిస్తూ తుదిశ్వాస వదలటం అందరినీ కలచివేసింది. (ఏజెన్సీలు)