హైదరాబాద్ : లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నియమావళి అమలులో భాగంగా జిల్లాలో ఇప్పటి వరకు 3 కోట్ల 28 లక్షల 66 వేల 780 రూపాయల నగదు పట్టుకొని సీజ్ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్తెలిపారు. అంతేకాకుండా కోటి 13 లక్షల 83 వేల 642.5 రూపాయల విలువ గల ఇతర వస్తువులు పట్టుకున్నట్లు ఆయన తెలిపారు.
దానితో పాటు 18,752.83 లీటర్ల మద్యం పట్టుకున్నట్లు కొని 122 కేసులు నమోదు చేసినట్లు 2144 లైసెన్స్ గల ఆయుధాలను డిపాజిట్ చేసినట్లు ఆయన వివరించారు. గడిచిన 24 గంటలలో అనగా ఆదివారం ఉదయం 6 గంటల నుండి సోమవారం ఉదయం 6 గంటల వరకు వివిధ ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ తనిఖీ సందర్భంగా మొత్తం 9,54,200/- రూపాయలు పట్టుకొని సీజ్ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ తెలిపారు.
ఫ్లయింగ్ స్క్వాడ్ ద్వారా 3,38,200/- రూపాయలు, పోలీస్ శాఖ ద్వారా 6,16,000/- రూపాయలు, 5,17,254/- రూపాయల విలువ గల ఇతర వస్తువులు పట్టుకొని సీజ్ చేయడం తో పాటు నగదు, ఇతర వస్తువులు పై 11 పిర్యాదులు రాగా వాటిని పరిశీలించి పరిష్కరించినట్లు, 5 గురి పై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. 94.14 లీటర్ల అక్రమ మద్యం పట్టుకొని ముగ్గురి పై కేసులు నమోదు చేసి ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఆరు లైసెన్స్ గల ఆయుధాలను డిపాజిట్ చేసినట్లు వివరించారు.
శిక్షణ తరగతులకు గైర్హాజరు అయిన వారికి షోకాజు నోటీసులు
హైదరాబాద్ : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో పి.ఓ, ఏ.పి.ఓ లకు ఏప్రిల్ 1,2 తేదీలలో రెండు రోజులపాటు 15 కేంద్రాల్లో శిక్షణ ఇవ్వడానికి ప్రతిపాదించడం జరిగినది. ఏప్రిల్ 1వ తేదీన 6000 మందికి శిక్షణ తరగతులు ఏర్పాటు చేయగా అందులో 1153 మంది గైర్హాజరు అయినారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎన్నికల అధికారి గైర్హాజరైన వారి పై చర్య తీవ్రంగా పరిగణించి వారికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగినది. దానితో పాటు ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారి చేశారు. ఎన్నికల విధులు పట్ల అలసత్వం వహించిన అధికారులకు ఇదే పరిస్థితి ఎదురవుతుందని జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ హెచ్చరించారు.
3 करोड़ 28 लाख 66 हजार 780 रुपये नकद जब्त
हैदराबाद : जिला निर्वाचन अधिकारी जीएचएमसी कमिश्नर रोनाल्ड रोज ने बताया कि लोकसभा चुनाव की पृष्ठभूमि में चुनाव नियमों के क्रियान्वयन के तहत जिले में अब तक 3 करोड़ 28 लाख 66 हजार 780 रुपये नकद जब्त किये गये हैं। इसके अलावा 13 लाख 83 हजार 642.5 करोड़ रुपये की अन्य वस्तुएं भी जब्त की गईं।
उन्होंने यह भी बताया कि 18,752.83 लीटर शराब की जब्ती के 122 मामले दर्ज किये गये हैं और 2144 लाइसेंसी हथियार जमा कराये गये हैं। जिला निर्वाचन अधिकारी रोनाल्ड रोज ने कहा कि पिछले 24 घंटों में यानी रविवार सुबह 6 बजे से सोमवार सुबह 6 बजे तक, विभिन्न प्रवर्तन टीमों ने कुल 9,54,200 रुपये जब्त किए हैं।
उड़नदस्ते द्वारा 3,38,200 रुपये, पुलिस विभाग द्वारा 6,16,000 रुपये, 5,17,254 रुपये मूल्य की अन्य वस्तुएँ तथा नकदी एवं अन्य सामग्री की 11 शिकायतों को जप्त कर जाँच एवं निराकरण किया गया। पांच आरोपियों पर एफआईआर दर्ज किया गया। उन्होंने बताया कि 94.14 लीटर अवैध शराब पकड़ने पर तीन लोगों के खिलाफ मुकदमा दर्ज किया गया है और तीन को गिरफ्तार किया गया है। छह लाइसेंसी असलहे जमा करा लिए गए हैं।