హైదరాబాద్: తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హరితోత్సవం సందర్భంగా నేడు తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ డా.బండా ప్రకాష్ ముదిరాజ్, ప్రభుత్వ విప్ ఏం ఎస్ ప్రభాకర్ రావు, ఎమ్మెల్సీ ఎల్ రమణ ,లెజిస్లేచర్ సెక్రటరీ నరసింహ చార్యులు గార్లు అసెంబ్లీ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ మాట్లాడుతూ ప్రస్తుతం పెరుగుతున్న అవసరాల నేపథ్యంలో అడవులు అంతరించి పోతున్నాయి.
దీనివల్ల వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వర్షపాతం తగ్గుతున్నది. వాతవారణ సమతుల్యం దెబ్బతింటున్నది. మానవ జీవితమే అల్లకల్లోలం అవుతున్నది. ఈ పరిస్థితిలో మార్పు తేవడానికి తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్దితో ప్రయత్నాలు ప్రారంభించింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఆకుపచ్చని తెలంగాణ రాష్ట్రంగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్ గారికి దక్కింది.తెలంగాణలో సమృద్ధిగా వానలు కురిసేందుకు చెట్లను రక్షించుకోవాలని. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనేది గతంలో ఒక నినాధంగానే ఉండేదని కానీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆచరణలోకి వచ్చిందన్నారు.
తెలంగాణ రాష్టాన్ని ఆకుపచ్చని రాష్ట్రంగా మార్చడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేశారన్నారు. రాష్ట్రములోని ప్రజలందరూ ఒక సామాజిక బాధ్యతగా మొక్కలను పెంచే విధంగా ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలను నిర్వహించిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అటవీ విస్తీర్ణం అధికంగా పెరిగిందని, దీనితో గ్రినరీ శాతం పెరిగిందని తెలిపారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ గారు స్వయంగా రైతు కావడం వలన చెట్ల ప్రాముఖ్యతను గుర్తించారని అన్నారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండటం వలనే తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఎదిగిందని తెలంగాణ శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ డా బండా ప్రకాష్ ముదిరాజ్ తెలిపారు.
