Qualitative Change In The Country Only With ‘Parivartan Bharat’: CM KCR

Hyderabad: Inspired by BRS National President and Chief Minister Sri K Chandrashekhar Rao’s call for a ‘Parivartan Bharat’ to bring a qualitative change with a slogan of ‘Ab Ki Bar Kisan Sarkar’ in the country, Indian soldiers come forward to join hands with CM KCR .

Former and retired Jawans ( Soldiers), who worked on the borders to safeguard the country, joined hands with the Kisan on the BRS platform. They displayed unity reflecting the spirit of ‘ Jai Jawan, Jai Kisan’. Leaders of Ex-Military Associations and Ex-servicemen from all the districts of Maharashtra joined the BRS party in the presence of CM KCR. BRS national president invited them into the party by offering Pink Scarfs.

Speaking on this occasion, CM KCR asserted a qualitative change will be achieved only by’ Parivartan Bharat’ (India Transformation). The BRS Supremo called for a radical change in the traditional decades old existing governance and administrative system and move forward with the goal of the welfare, development and upliftment of the all sections. CM KCR said that it is a remarkable occasion that the soldiers of the country are coming forward to establish the “Farmers Regime “on a call of Ab Ki Bar Kisan Sarkar. It is also a clear indication of qualitative change in the national politics.

The Chief Minister welcomed the army officers from all the districts of Maharashtra. BRS Chief explained about the various development and welfare schemes which were being implemented in Telangana state . CM KCR called upon the ex-servicemen that the time has come to rededicate themselves and continue their duty as heroic soldiers to bring a qualitative change in the lives of the people in Maharashtra.

Noted ex- soldier and Secretary of ‘Fauji Janata Party’ from Nashik district Bapurao Pagare joined the BRS. Along with him, ex-servicemen, ex-colonels, ex-lieutenants and many ex-soldiers who have served in various ranks in the India Army joined the BRS party. Praveen Anand Thoke from Malegaon, Sagar Magre (Nashik), Tukaram Dafad ( Pune) Sunil Andhare (Solapur), Baban Pawar (Shirur), Sandeep Lagad (Dond), Rajendra Kapre (Beed), Haridas Shinde (Darashiv), Shivaji Naik (Sangli), Dinkar Dhode ( Jalna). , Amul Mapari ( Washim), Suraj Namdev Raut, Ajinkia Raut, Nanda Kumar Kadse, Mahesh Chauhan from Akola, Umesh Hande from Ahmednagar, Narayan Tope from Hadapsar, Nagnath Gorpade, Ramesh Saheb from Sangli, Zainak Saheb from Dond and other ex-servicemen joined the BRS.

BRS leaders – MLC Palla Rajeshwar Reddy, MLA Balka Suman, former minister Samudrala Venugopalachari, BRS leaders Sankaranna Dongde, Kalvakuntla Vamsidhar Rao and others were present in this programme.

‘పరివర్తన్ భారత్’ తోనే దేశంలో గుణాత్మక మార్పు : CM KCR

హైదరాబాద్: ‘అబ్ కి బార్ కిసాన్ సర్కార్’ అనే నినాదంతో ముందుకు సాగుతూ, ‘పరివర్తన్ భారత్’ తోనే దేశంలో గుణాత్మక మార్పు సాధ్యమని బిఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దేశ ప్రజలకు ఇస్తున్న పిలుపుతో దేశ సైనికులు కూడా చేయి చేయి కలిపేందుకు ముందుకు వచ్చారు. దేశాన్ని కాపాడేందుకు ఇన్నాళ్ళు దేశ సరిహద్దుల్లో పనిచేసిన మాజీ జవాన్లు నేడు బిఆర్ఎస్ వేదికగా కిసాన్ తో జత కట్టారు. జై జవాన్, జై కిసాన్ నినాదానికి సంపూర్ణ అర్థాన్నిచ్చే దిశగా ఐక్యత చాటారు. ఈ మేరకు బిఆర్ఎస్ పార్టీలో మహారాష్ట్ర అన్ని జిల్లాల నుంచి మాజీ సైనిక సంఘాల నేతలు, మాజీ సైనికులు కేసీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి బిఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు, సీఎం కేసీఆర్ గులాబి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, పరివర్తన చెందిన భారతదేశంతోనే గుణాత్మక మార్పు సాధ్యమని సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు. సాంప్రదాయ పద్ధతుల్లో ఏడు దశాబ్దాలుగా కొనసాగుతున్న పాలనను సమూలంగా మార్పు చేసుకొని రైతుల సంక్షేమం, అభివృద్ధి, సబ్బండ వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.అబ్ కి బార్ కిసాన్ సర్కార్ పిలుపునందుకొని రైతు రాజ్య స్థాపన కోసం దేశ జవాన్లు ముందుకు రావడం గొప్ప పరిణామమని, ఇది దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పుకు సూచనగా బిఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

ఈ సంధర్భంగా మహారాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వచ్చిన సైనికాధికారులకు సీఎం స్వాగతం పలికారు. తెలంగాణలో అమలు చేస్తున్న పలు అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వివరించిన సీఎం కేసీఆర్ మహారాష్ట్రలో కూడా వీటిని అమలు చేస్తూ ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పుకు దోహదం చేసే దిశగా మరోసారి వీర సైనికులై కర్తవ్య నిర్వహణను కొనసాగించాల్సిన సమయం ఆసన్నమైందని మాజీ సైనికులకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.

ఈ మేరకు నాసిక్ జిల్లాకు చెందిన ‘ఫౌజీ జనతా పార్టీ’ కార్యదర్శి, ప్రజాదరణ కలిగిన మాజీ సైనికుడు సునిల్ బాపురావు పగారె బిఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరి చేరిక ప్రాధాన్యతసంతరించుకున్నది. వీరితో పాటు సైన్యంలో పలు ర్యాంకుల్లో పనిచేసిన మాజీ సైనికాధికారులు, మాజీ కల్నళ్ళు, మాజీ లెఫ్టినెంటులు, పలువురు మాజీ సైనికులు బిఆర్ఎస్ పార్టీలో చేరారు.

వీరిలో మాలెగావ్ నుంచి ప్రవీణ్ ఆనద్ థోకే, నాసిక్ నుంచి సాగర్ మాగ్రే, పూణే నుంచి తుకారాం దఫద్, సోలాపూర్ నుంచి సునిల్ ఆంధారె, శిరూర్ నుంచి బబన్ పవార్, డోండ్ నుంచి సందీప్ లగడ్, బీడ్ నుంచి రాజేంద్ర కప్రే, దరాశివ్ నుంచి హరిదాస్ షిండే, సంగ్లి నుంచి శివాజీ నాయక్, జల్నానుంచి దినకర్ ధోడే, వాషిమ్ నుంచి అముల్ మపరి, సూరజ్ నామ్ దేవ్ రౌత్, అజింకియా రౌత్, నంద కుమార్ కడ్సే, అకోలా నుంచి మహేశ్ చౌహాన్, అహ్మద్ నగర్ నుంచి ఉమేశ్ హండే, హడప్సర్ నుంచి నారాయణ్ తోపే, నాగ్నాథ్ గోర్పడే, సంగ్లీ నుంచి రమేశ్ సాహెబ్, దోండ్ నుంచి జైనక్ సాహెబ్ తదితర మాజీ సైనికులు బిఆర్ఎస్ పార్టీలో చేరారు.

తాము మహారాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5 లక్షల మందిమి మాజీ సైనికులమున్నామనీ , అందరం కలిసి కట్టుగా కిసాన్ సర్కార్ సాధన కోసం బిఆర్ఎస్ తో కలిసి నడుస్తామనీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నేతలు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే బాల్క సుమన్, మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలచారి, బిఆర్ఎస్ నాయకులు శంకరన్న దోంగ్డే, కల్వకుంట్ల వంశీధర్ రావు తదితరులున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X