हैदराबाद: दिग्गज निर्देशक कलाlतपस्वी के विश्वनाथ हमेशा के लिए इस दुनिया को छोड़कर चले गए हैं। उनका अंतिम संस्कार शुक्रवार को हैदराबाद के पंजागुट्टा श्मशान वाटिका में संपन्न हुआ। कलातपस्वी का अंतिम संस्कार वीरशैव जंगम परंपरा के अनुसार किया गया। उन्हें बैठे-बैठे दफनाया गया।
बीते दिनों मशहूर सिंगर एसपी बालासुब्रमण्यम के पार्थिव शरीर को भी बैठे-बैठे ही दफनाया गया था। मालूम हो कि एसपी बालू और के विश्वनाथ काफी करीबी रिश्तेदार हैं। बालसुब्रमण्यम के. विश्वनाथ के बड़े भाई है।
दोपहर करीब 2.30 बजे फिल्मनगर स्थित के. विश्वनाथ के आवास से पंजागुट्टा श्मशान घाट तक अंतिम यात्रा शुरू हुई। दोपहर करीब तीन बजे विश्वनाथ के शव को दफनाया गया। बिना किसी हड़बड़ी के बेहद साधारण तरीके से अंतिम संस्कार संपन्न हुआ।
संबंधित खबर:
దర్శకుడు కె విశ్వనాథ్ అంత్యక్రియలు, ఎస్పీ బాలు మాదిరిగానే ఖననం
హైదరాబాద్ : దిగ్గజ దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్ ) శాశ్వతంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఆయన అంత్యక్రియలు హైదరాబాద్‌లోని పంజాగుట్ట శ్మశాన వాటికలో శుక్రవారం ముగిశాయి. వీరశైవ జంగమ సంప్రదాయం ప్రకారం కళాతపస్వి అంత్యక్రియలు జరిగాయి. ఆయన్ని కూర్చోబెట్టి ఖననం చేశారు.
గతంలో దిగ్గజ గాయకుడు, గానగాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పార్థివదేహాన్ని కూడా ఇలానే కూర్చోబెట్టి ఖననం చేశారు. ఎస్పీ బాలు, కె.విశ్వనాథ్ చాలా దగ్గర బంధువులు అన్న సంగతి తెలిసిందే. బాలుకి కె.విశ్వనాథ్‌కు అన్నయ్య అవుతారు.
Related News:
ఆ తరవాత మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఫిలింనగర్‌లోని కె.విశ్వనాథ్ నివాసం నుంచి పంజాగుట్ట శ్మశాన వాటికకు అంతిమయాత్ర ప్రారంభమైంది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో విశ్వనాథ్ పార్థివదేహాన్ని ఖననం చేశారు. ఎలాంటి హడావుడి లేకుండా చాలా సింపుల్‌గా అంత్యక్రియలను ముగించారు.
93 ఏళ్ల కాశీనాథుని విశ్వనాథ్ గత కొంతకాలంగా వయోభారంతో కూడిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. చాలాకాలంగా ఇంటికే పరిమితమైన విశ్వనాథ్.. గురువారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. ఆయన్ని వెంటనే ఫిలింనగర్ అపోలో హాస్పిటల్‌కు తీసుకెళ్లారు.
అక్కడ చికిత్స పొందుతూ అర్ధరాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు. విశ్వనాథ్ పార్థివదేహాన్ని రాత్రే హాస్పిటల్ నుంచి ఇంటికి తరలించారు. ఈరోజు ఉదయం సినీ ప్రముఖులంతా విశ్వనాథ్ ఇంటికి వెళ్లి ఆయన పార్థివదేహానికి నివాళులు అర్పించారు.
మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ నటులు చంద్రమోహన్, కోటా శ్రీనివాసరావు, బ్రహ్మానందం, రాధికా శరత్‌కుమార్, నాజర్ సహా దర్శకులు ఎస్.ఎస్.రాజమౌళి, బోయపాటి శ్రీను, మెహర్ రమేష్, నిర్మాతలు సి.అశ్వనీదత్, అల్లు అరవింద్, డి.సురేష్ బాబు, సంగీత దర్శకులు ఎం.ఎం.కీరవాణి, వందేమాతరం శ్రీనివాస్ తదితరులు కె.విశ్వనాథ్‌కు నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు.
ఇదిలా ఉంటే, సరిగ్గా 43 ఏళ్ల క్రితం తన సినిమా ‘శంకరాభరణం’ విడుదలైన ఫిబ్రవరి 2వ తేదీనే కె.విశ్వనాథ్ శివైక్యం అవ్వడం విశేషం. మరణంలోనూ ఆయన తన క్లాసిక్ మూవీతో అనుబంధాన్ని వదులుకోలేదు. తొలి సినిమానే అక్కినేని నాగేశ్వరరావు లాంటి దిగ్గజ నటుడితో చేసిన కె.విశ్వనాథ్ దానికి నంది అవార్డు కూడా అందుకోవడం గొప్ప విషయం.
మొత్తం 8 నంది అవార్డులు తన ఖాతాలో వేసుకున్నారు. అంతేకాదు, ‘శంకరాభరణం’ సినిమాకు జాతీయ చలనచిత్ర అవార్డు దక్కింది. సినిమా రంగానికి ఆయన చేసిన కృషికి 2016లో ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది. 1992లో రఘుపతి వెంకయ్య పురస్కారం, పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. (ఏజెన్సీలు)