Birthday Gifts : KTR Distributes Laptops To 100 Students At The State Home And…

KTR Once Again Showcases His Kind Heart on His Birthday

Launches Another Humanitarian Initiative

KTR to Provide Financial Assistance to Families of 13 Weavers Who Committed Suicide in the Past Seven Months

Announcement Made as Part of Gift A Smile Program on His Birthday

Hyderabad : As part of his annual Gift A Smile initiative, KTR has once again launched a humanitarian program on the occasion of his birthday. This time, he has decided to support the families of 13 weavers who committed suicide in the state, providing financial aid for their children’s education and future needs.

KTR celebrated his birthday in the presence of students in Hyderabad, where he distributed laptops to 100 students of the State Home. He mentioned that the laptops would be useful for the students’ higher education.

In 2020, during the COVID-19 pandemic, KTR decided to celebrate his birthday by helping others, thus starting the Gift A Smile initiative. He called upon his well-wishers, fans, party leaders, and workers to participate in this program. Every year since, KTR has been involved in various service activities as part of the Gift A Smile program.

Also Read-

Over the past five years, he has provided more than 100 ambulance vehicles and tablets to 6,000 students for competitive exams, as well as three-wheeler scooters to 1,400 differently-abled individuals. He mentioned that he had intended to give laptops to State Home students last year but couldn’t due to elections. He fulfilled that promise this year.

KTR expressed great satisfaction with the program he has been running for the past five years. He stated that, as elders say, only birth and death are certain, while everything in between is uncertain. Thus, engaging in activities that bring satisfaction to the heart gives him the most happiness. His wife Shailima, son Himanshu, and daughter Riyanshi joined him in this event.

స్టేట్ హోమ్ లో ఉన్న వందమంది విద్యార్థులకు లాప్ టాప్ లు అందజేసిన కేటీఆర్

బర్త్ డే సందర్భంగా మరోసారి తన మంచి మనసు చాటుకున్న కేటీఆర్

మరో మానవీయ కార్యక్రమానికి శ్రీకారం

గత ఏడు నెలల్లో ఆత్మహత్య చేసుకున్న 13 మంది నేత కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయనున్న కేటీఆర్

తన జన్మదినం సందర్భంగా గిప్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా కేటీఆర్ ప్రకటన

హైదరాబాద్ : తన జన్మదినాన్ని పురస్కరించుకొని ఏటా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా కేటీఆర్ మరోసారి మానవీయమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈసారి తన జన్మదినం సందర్భంగా రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న నేత కార్మికుల కుటుంబాలకు అండగా ఉండాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న నేత కార్మికుల కుటుంబాలు, వారి పిల్లల విద్యా, భవిష్యత్ అవసరాల కోసం ఆర్థిక సహాయం చేయనున్నట్లు తెలిపారు.

అదే విధంగా తన బర్త్ డే సందర్భంగా హైదరాబాద్ విద్యార్థుల సమక్షంలో జరిగిన కార్యక్రమంలో కేటీఆర్ తన జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా స్టేట్ హోం లో ఉన్న 100 మంది విద్యార్థినిలకు లాప్ టాప్ లను అందజేశారు. విద్యార్థినుల ఉన్నత విద్యకు లాప్ టాప్ లు ఉపయోగపడతాయన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

2020 లో కరోనా సమయంలో కేటీఆర్ తన బర్త్ డే వేడుకలను ఇతరులకు సాయం చేసే విధంగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. అప్పుడే గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తనతో పాటు తన శ్రేయోభిలాషులు, అభిమానులు, పార్టీ నేతలు, కార్యకర్తలను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇలా ఏటా కేటీఆర్ బర్త్ డే సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా సేవ చేస్తున్నారు.

గత ఐదేళ్లలో పలు అంబులెన్స్ లతో 6,000 మంది విద్యార్థులకు పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా టాబ్లెట్ పరికరాలను అందజేశారు. 1400 మంది దివ్యాంగులకు మూడు చక్రాల స్కూటర్లను అందించినట్లు కేటీఆర్ తెలిపారు. గత ఏడాది తన జన్మదినం సందర్భంగానే స్టేట్ హోమ్ విద్యార్థులకు లాప్ టాప్ లు ఇవ్వాలని నిర్ణయించుకున్నానని కానీ ఎన్నికల వలన అది సాధ్యం కాలేదని అన్నారు. గతేడాది ఇచ్చిన హామీ ఈ ఏడాది నెరవేర్చినట్లు కేటీఆర్ చెప్పారు.

ఐదేళ్లు తాను చేస్తున్న ఈ కార్యక్రమం ఎంతో సంతృప్తినిస్తుందని కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. పెద్దలు చెప్పిన్నట్లు పుట్టుక మరణం మాత్రమే నిజమని మధ్యలో మిగిలినదంతా నిజమో? అబద్దమో? తెలియని పరిస్థితి ఉంటుందని అన్నారు. అందుకే జీవితంలో మనసుకి సంతృప్తినిచ్చే ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడే తనకు ఎక్కువ సంతోషం లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ తో పాటు ఆయన సతీమణి శైలిమ, కుమారుడు హిమాన్షు, కూతురు రియాన్షి పాల్గొన్నారు.

మరోవైపు, బి.ఆర్.ఎస్వి రాష్ట్ర అధ్యక్షులు & మాజీ చైర్మన్ శ్రీ గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారి ఆధ్వర్యంలో… బి.ఆర్.ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ & ఎమ్మెల్యే శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదిన వేడుకలు తెలంగాణ భవన్ హైదరాబాద్ లో ఘనంగా జరిగాయి.

ఈ వేడుకకి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, మాజీ ఎంపీలు బడుగుల లింగయ్య యాదవ్, రావుల చంద్రశేఖర్ రెడ్డి, హైదరాబాద్ జిల్లా ఇన్చార్జ్ దాసోజు శ్రవణ్ ,మాజీ కార్పొరేషన్ చైర్మన్లు గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఆంజనేయ గౌడ్, పల్లె రవికుమార్ గౌడ్, మేడే రాజీవ్ సాగర్, అనిల్ కూర్మాచలం, రామచంద్రనాయక్ మరియు జిల్లా పరిషత్ చైర్మన్లు, జిహెచ్ఎంసి కార్పొరేటర్లు, బి.ఆర్.ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరు అయ్యి హ్యాపీ బర్త్డే రామన్న అంటూ… లాంగ్ లీవ్ లాంగ్ లీవ్ కేటీఆర్ అంటూ నినాదాలు చేస్తూ కేక్ కట్ చేసి ఒకరికొకరు కేక్ తినిపించుకొని హ్యాపీ బర్త్డే కేటీఆర్ అని శుభాకాంక్షలు చెప్పుకున్నారు. తర్వాత మెగా రక్తదాన శిబిరం లో పాల్గొని పలువురు కార్యకర్తలు, అభిమానులు రక్తదానం చేయడం జరిగింది.

గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ… ఈ సందర్భంగా గడిచిన 10 సంవత్సరాల కాలంలో కేటీఆర్ గారు మంత్రిగా చేసిన సేవలను ఆయన గుర్తు చేశారు. ఆయన తెలంగాణ రాష్ట్రానికి ఐటీ శాఖ, మున్సిపల్ శాఖ, పరిశ్రమల శాఖ మంత్రివర్యులుగా ఉండి తెలంగాణ రాష్ట్రానికి కాకుండా భారతదేశానికి వన్నె తెచ్చే విధంగా ఆయన పనితీరు ఉందని కొనియాడారు. భారత దేశంలోనే కాకుండా అమెరికాలో సైతం ఆయన కీర్తి గడించడం జరిగింది. హైదరాబాద్ ని మేటి నగరంగా తీర్చిదిద్దడమే కాకుండా ఒక న్యూయార్క్ సిటీని తెలపించేలా హైదరాబాద్ ని తీర్చిదిద్దడం లో ఆయన పాత్ర చాలా కీలకమైనది. ఈరోజు కూడా ఐటి శాఖ మంత్రివర్యులుగా KTR ఉన్నారని ప్రజలు అనుకుంటున్నారు అలా ఉంది ఆయన పనితీరు కాబట్టి మన నాయకుడి జన్మదిన సందర్భంగా, కార్యకర్తలు, అభిమానులు, నాయకులు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేయాలని కోరడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X