BRS Working President KTR’s Challenge to Revanth Reddy for Lie director test
KTR at ABP News Southern Summit
Hyderabad: BRS party Working President K. T. Rama Rao (KTR) has accused Telangana chief minister Revanth Reddy of phone tapping opposition leaders’ and his own ministers’ phone conversations. In an open challenge to Revanth Reddy, KTR dared him to take a lie detector test before cameras to prove he was not engaging in phone tapping. He asserted that Revanth Reddy’s government is tapping not only ministers but even leaders within his own party. KTR added, “If Revanth has the courage, let him join me for a public lie detector test and declare openly that he is not involved in wiretapping ministers or opposition members.”
KTR also pointed a past incident where Revanth Reddy was caught with a bag containing Rs. 50 lakh in a vote-for-note case where he tried to purchase a legislator. “How someone with such a record of unethical actions could speak against us,” KTR stated. He continued by expressing disappointment in the failure of Revanth’s government to fulfill key promises and guarantees within the first 100 days in office.
Rahul Gandhi’s Silence on Key Issues in Telangana
KTR addressed Congress leader Rahul Gandhi’s inconsistency, questioning why Rahul, who speaks of justice and equality and the constitution in Delhi, remains silent about the Congress-led government’s actions against marginalized communities in Telangana. KTR urged Rahul Gandhi to focus on safeguarding Telangana’s communities from Congress-led bulldozer raj that threatens poorer communities.
Also Read-
Reflecting on BRS’s achievements over the past ten years, KTR cited the success of various development programs, from the IT sector to agriculture, noting that the BRS government had accomplished significant improvements for Telangana’s urban and rural sectors. He emphasized the importance of BRS’s schemes like Rythu Bandhu and Rythu Bheema for farmers, and the Aasara pensions increased from Rs. 200 to Rs. 2,000 for welfare. KTR affirmed that the people of Hyderabad have shown overwhelming support for the state’s progress and extended heartfelt thanks for their continued trust.
రేవంత్ రెడ్డి సొంతమంత్రులతో పాటు ప్రతిపక్ష నేతల ఫోన్లను టాప్ చేస్తున్నారు- భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణ
ఫోన్ టాపింగ్ వ్యవహారంలో రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ సవాలు
దమ్ముంటే కెమెరాల ముందు ఈ అంశంలో లై డిటెక్టర్ పరీక్షకు రావాలి
రేవంత్ రెడ్డికి దమ్ముంటే నా సవాలు స్వీకరించి బహిరంగంగా ఫోన్ ట్యాప్ చేయడం లేదని ప్రకటించాలి
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మంత్రులతో పాటు నా ఫోన్ టైపింగ్ చేయట్లేదని చెప్పాలి … సొంత పార్టీ ఎమ్మెల్యేలు ప్రతిపక్ష నేతల ఫోన్ లను కూడా ట్యాప్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధం కావాలి. రేవంత్ రెడ్డి ఫోన్ టాపింగ్ విషయంలో నాతోపాటు బహిరంగంగా కెమెరాల ముందు లై డిటెక్టర్ పరీక్షకు రావాలి. ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి అవే నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నారు.
50 లక్షల రూపాయల బ్యాగుతో పట్టుబడిన రేవంత్ రెడ్డిని దొంగ అనకుంటే ఏమంటారు. డబ్బుల కట్టలతో సభ్యులను కొనాలనుకున్న రేవంత్ రెడ్డి పైన కేసు పెట్టాల్సి వచ్చింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. 100 రోజుల్లోనే అనేక హామీలను నెరవేరుస్తామంటూ చెప్పి ఆరు గ్యారెంటీలు కాదు హాఫ్ గ్యారెంటీలు మాదిరి అయిపోయింది. హైదరాబాద్ లో జరిగిన ఏబీపీ న్యూస్ సదరన్ సమ్మిట్ లో పాల్గొన్న భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి అవే నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. 100 రోజుల్లోనే అనేక హామీలను నెరవేరుస్తామని చెప్పి ఆరు గ్యారెంటీలు కాదు.. హాఫ్ గ్యారెంటీలు చేశారు. దేశంలో పార్టీ ఫిరాయింపులకు ఆజ్యం పోసిందే కాంగ్రెస్ పార్టీ.
మా ప్రభుత్వ హయాంలో రాజ్యాంగబద్దంగా పార్టీ శాసనసభాపక్ష విలీనం జరిగింది. రాహుల్ గాంధీ ఢిల్లీలో రాజ్యాంగం ప్రతులు పట్టుకొని తమాషా చేస్తారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగం ఖూనీకి గురైనప్పుడు మౌనం వహిస్తున్నారు. రాజ్యాంగం విలువల గురించి ఢిల్లీలో గోల చేసే రాహుల్ గాంధీ.. తెలంగాణలో మాత్రం మౌనంగా ఉంటున్నారు.
మొహబ్బత్ కి దుకాణ్ అని చెప్తున్న రాహుల్ గాంధీ.. తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్న బుల్డోజర్ రాజ్యం గురించి మాట్లాడటం లేదు. కాంగ్రెస్ బుల్డోజర్ల నుంచి పేద ప్రజలను కాపాడటంపై రాహుల్ గాంధీ దృష్టి పెట్టాలి. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల అంచనాలు పెరగడం మా ఓటమికి ఉపకారణమైంది. మేం ప్రభుత్వ ఉద్యోగాలు భారీగా ఇచ్చినప్పటికీ.. ఆ విషయాన్ని ప్రజలకు చెప్పుకోవడంలో విఫలమయ్యాం.
శాసనసభ ఎన్నికల ఓటమి తర్వాత అంతర్గతంగా సమీక్షించుకొని ప్రజల కోసం పోరాడటానికి ముందుకు వెళ్లాం. సాధారణంగా భారతదేశంలో ఎన్నికలు అనేవి.. ఒకరి ఎంపిక కంటే అప్పుడు అధికారంలో ఉన్నవారిని తిరస్కరించడం కోసం జరుగుతుంటాయి. గత ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఎంపిక అనే కంటే మా ప్రభుత్వాన్ని తిరస్కరించారని చెప్పవచ్చు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పాటు చేసిన పార్టీని తెలంగాణ ఏర్పాటు కోసం కాంగ్రెస్ లో విలీనం చేయాలనుకున్నాం. కానీ కాంగ్రెస్ పార్టీ వల్లే విలీనం జరగలేదు. అదృష్టవశాత్తు తెలంగాణను అభివృద్ధి పథంలో తీసుకువెళ్లే అవకాశం మాకు దొరికింది. పది సంవత్సరాల్లో ఐటీ రంగం నుంచి వ్యవసాయ రంగం దాకా అన్ని రంగాలలో తెలంగాణ రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లాం.
అధికారం శాశ్వతమని మేం ఏనాడూ అనుకోలేదు. అధికారంలో ఉన్నప్పుడు మాత్రం రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలని మా సర్వశక్తుల ప్రయత్నం చేశాం. అందులో విజయం సాధించాం. ప్రస్తుతం ప్రతిపక్ష పాత్రలో ఉన్న మేము.. ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో, వారి ఆకాంక్షల కోసం పోరాటం చేయడంలో సంతృప్తిగా సంతోషంగా ఉన్నాం. కుటుంబ నేపథ్యం వంటి అనేక పాత చింతకాయ పచ్చడి విమర్శలు చేసిన అనంతరం కూడా మంత్రిగా విజయవంతంగా తన బాధ్యతలు నిర్వహించినప్పుడు అసంబద్ధమైన, అసత్యమైన విమర్శలు చేయడం అలవాటుగా మారింది.
అందుకే నాపై అహంకారి వంటి అర్థంలేని విమర్శలను కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. నాపై ప్రతిపక్షాలు చేస్తున్న అవినీతి, అహంకారం వంటి విమర్శలను రుజువు చేయాలని సవాలు విసురుతున్నా. ప్రజలు ప్రభుత్వ పరిపాలన వంటి అంశాల్లో బేరీజు వేసుకుని ఒక నిర్ణయానికి వస్తారు. కచ్చితంగా మా ప్రభుత్వం.. కాంగ్రెస్, బీజేపీల కన్నా గొప్పగా పనిచేసింది.
రాజకీయాల్లో గెలుపు ఓటముల పట్ల చలించిపోయే తత్వం కేసీఆర్ గారిది కాదు. ఆయన బలమైన మనస్తత్వం, వ్యక్తిత్వం జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను చూసింది. కేసీఆర్ గారు నిరంతరం భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నారు. తెలంగాణ కోసం ప్రణాళికలు రచిస్తున్నారు. కానీ అరచేతిలో స్వర్గం చూపించి మోసం చేసిన పార్టీ తీరుపైనా, ఆ పార్టీ పాలన వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపైన కేసీఆర్ గారు ఆవేదన చెందుతున్నారు.
కచ్చితంగా ప్రజలు మరోసారి కేసీఆర్ గారికి ముఖ్యమంత్రిగా పనిచేసే అవకాశం ఇస్తారని విశ్వసిస్తున్నాం. హైదరాబాద్ నగరంలో జరిగిన అభివృద్ధికి, రాష్ట్ర ప్రగతికి ప్రజలు పట్టం కట్టారు. వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. గ్రామీణ ప్రాంత ప్రజల కోసం కూడా అద్భుతమైన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతాంగానికి రైతుబంధు, రైతుబీమాతో సహా అనేక అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేశాం. 200 రూపాయలు ఉన్న ఆసరా పెన్షన్లను 2 వేల రూపాయలకు పెంచాం.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలకు అన్నీ చేస్తామని చెప్పి ఆశ పెట్టింది. గ్రామీణ, నగర ప్రాంతాలు అన్నీ కూడా మా ప్రభుత్వ హయాంలో సమగ్రంగా, సమాంతరంగా అభివృద్ధి చెందాయి. గత పది సంవత్సరాల్లో అభివృద్ధి, ప్రభుత్వ పాలనపైనే ప్రధానంగా దృష్టి సారించాం. వాటిపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం పార్టీకి రెండున్నర దశాబ్దాలుగా నిర్మించుకున్న నాయకత్వం ఉంది. అన్ని గ్రామాల్లో ధృడమైన పార్టీ నిర్మాణం చెక్కుచెదరకుండా ఉంది. ఒక్క ఎన్నికల్లో ఎదురైన పరాజయంతో పార్టీకి వచ్చిన ఇబ్బందేమీ లేదు.
ఎక్కువ మంది పిల్లలను కనాలన్న చంద్రబాబు వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. ప్రస్తుతం ఉన్న జనాభాకు తగ్గట్టుగా మౌలిక వసతులే లేని పరిస్థితి. ముందుగా వాటిని కల్పించడంపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. జనాభా నియంత్రణపై దక్షిణ భారతదేశానికి స్పష్టమైన అవగాహన ఉంది. జనాభా తగ్గించుకుని క్రమశిక్షణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు డీ లిమిటేషన్ పేరుతో నష్టం చేయడం అన్యాయం.