हैदराबाद: कर्नाटक चुनाव नतीजों पर सट्टा जोरों पर जारी है। मीडिया में खबरें आ रही हैं कि नतीजों पर 20 हजार करोड़ रुपए तक का सट्टा कारोबार हो चुका है। हाल ही में एक शख्स ने अपनी दो एकड़ जमीन बेटिंग लगाकर कर कहा कि इसके लिए कोई आगे आए। ये वीडियो इस वक्त सोशल मीडिया पर वायरल हो रहा है।
होन्नाली निर्वाचन क्षेत्र में कांग्रेस उम्मीदवार शांतनगौड़ा जीतने और वर्तमान विधायक एमपी रेणुकाचार्य की जीत बेटिंग जोरों पर जारी है। शांतनगौड़ा की जीत पर नागन्ना नाम के एक व्यक्ति ने अपनी दो एकड़ जमीन बेटिंग पर रख है। किसान ने गुरुवार की रात गांव में डंडोरा कराया। उसने कहा कि शर्त लगाने वाले को आने आये।
Karnataka Election 2023: కాంగ్రెస్ గెలుపుపై రెండెకరాలు పందెం, దండోరా వేయించిన రైతు
హైదరాబాద్: కర్ణాటక ఎన్నికల ఫలితాలపై బెట్టింగులు జోరుగా కొనసాగుతున్నాయి. ఫలితాలపై రూ.20 వేల కోట్ల వరకూ వ్యాపారం జరిగినట్టు మీడియాలో నివేదికలు వస్తున్నాయి. తాజాగా, ఓ వ్యక్తి తన రెండెకరాల పొలాన్ని పందేం కాసి ఇందుకు ఎవరైనా ముందు రావాలని చాటింపు వేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
హొన్నాళి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి శాంతనగౌడ గెలుస్తారని, సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంపీ రేణుకాచార్యదే విజయమంటూ పందేలు జోరుగా కొనసాగుతున్నాయి. శాంతనగౌడ గెలుపై నాగణ్ణ అనే వ్యక్తి తన రెండెకరాల పొలాన్ని పందేనికి ఉంచారు. ఎవరైనా పందెం కాసేవారు ఉంటే రావాలంటూ గ్రామంలో గురువారం రాత్రి దండోరా వేయించారు.
కొండసీమల చామరాజనగర జిల్లాలో పందేలు జోరుగా సాగుతున్నాయి. జిల్లా కేంద్రంలో సోమణ్ణ విజయంపై రూ.కోటి వరకు పందేలు కాసుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గుండ్లుపేట తాలూకా మల్లయ్యనపుర గ్రామానికి చెందిన కిరణ్ అనే వ్యక్తి తన చేతిలో రూ.3 లక్షలు పట్టుకుని కాంగ్రెస్ గెలుస్తుందంటూ పందెం కాశారు. ‘కాంగ్రెస్ గెలుస్తుందని నాకు నమ్మకం ఉంది నేను మూడు ఎకరాల పొలం.. రూ.75 లక్షల సొమ్ము పందెం కాస్తున్నా అంతేకాదు, ఇన్నోవా కారు, బైక్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా’ ఉన్నా అని అతడు చెప్పాడు.
దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు అతడి నివాసంపై దాడి చేసి, విచారణ చేపట్టారు. తాను చెబుతున్న అభ్యర్థులు గెలుస్తారని, ఎవరైనా రూ.కోటి పందెం కాయవచ్చంటూ ఒక వ్యక్తి సవాల్ విసిరిన వీడియో సైతం వైరల్ అయ్యింది. దీంతో అతడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
మైసూరు జిల్లా హెచ్‌డీ కోట నియోజకవర్గంలో కాంగ్రెస్, జేడీఎస్ అభ్యర్థుల గెలుపుపై పందెం కాశారు. కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తాడని జయరామ్ నాయక్ జేడీఎస్‌దే గెలుపని శివరాజ్ అనే ఇద్దరు వ్యక్తులు రూ.5 లక్షలకు సంతకాలు చేసిన బాండు పేపరు వైరల్ అవుతోంది. (ఏజెన్సీలు)