के रामकृष्ण राव तेलंगाना सरकार के नये मुख्य सचिव नियुक्त, जिम्मेदारी को प्रभावी ढंग से पूरा करने का किया वादा

हैदराबाद: के रामकृष्ण राव को तेलंगाना सरकार का मुख्य सचिव नियुक्त किया गया है। 1991 बैच के आईएएस अधिकारी है। वे वर्तमान में वित्त विभाग में विशेष मुख्य सचिव के पद पर कार्यरत हैं। वे 1 मई को सरकार के मुख्य सचिव का कार्यभार संभालेंगे। तेलंगाना सरकार ने रविवार को इस आशय के आदेश जारी किया। वर्तमान सीएस शांति कुमारी इस महीने की 30 तारीख को सेवानिवृत्त हो रही है।

रामकृष्ण राव वित्तीय प्रबंधन के विशेषज्ञ हैं। तेलंगाना गठन के बाद से अब तक 13 बजट पेश करने और जरूरत के अनुसार सरकारी योजनाओं के लिए धन उपलब्ध कराने में उनकी महत्वपूर्ण भूमिका रही है। वित्तीय मामलों में पारदर्शिता के लिए एकीकृत वित्तीय प्रबंधन प्रणाली (आईएफएमआईएस) शुरू की गई है। तेलंगाना के विभाजन के दौरान कर्मचारियों के विभाजन और पुनर्गठन के मुद्दों को प्रभावी ढंग से निपटाया गया। वित्त विभाग के विशेष मुख्य सचिव के अलावा उन्होंने योजना विभाग में भी अतिरिक्त जिम्मेदारी संभाली और जीआईएस प्रणाली को मजबूत किया।

इससे पहले रामकृष्ण राव ने सेंटर फॉर गुड गवर्नेंस के महानिदेशक, स्कूल शिक्षा निदेशक तथा आदिलाबाद और गुंटूर जिलों के कलेक्टर के रूप में कार्य किया था। उन्होंने शिक्षा और स्वास्थ्य के क्षेत्र में भी महत्वपूर्ण जिम्मेदारियां संभालीं। उन्होंने आईआईटी कानपुर और दिल्ली से अपनी डिग्री तथा अमेरिका से एमबीए की डिग्री पूरी की। रामकृष्ण राव इस वर्ष अगस्त में सेवानिवृत्त होंगे। हालांकि, खबर है कि सरकार उनका कार्यकाल इस साल के अंत तक बढ़ा सकती है।

तेलंगाना के नये मुख्य सचिव के रामकृष्ण राव ने मीडिया से कहा कि वे उन्हें सौंपी गई महत्वपूर्ण जिम्मेदारी को प्रभावी ढंग से पूरा करेंगे तथा सरकारी योजनाओं और नीतियों को जनता तक पहुंचाने का काम करेंगे। उन्होंने मुख्य सचिव नियुक्त करने के लिए मुख्यमंत्री रेवंत रेड्डी के प्रति आभार व्यक्त किया।

यह भी पढ़ें-

తెలంగాణ ప్రభుత్వ కొత్త సీఎస్గా రామకృష్ణారావు

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీగా కె.రామకృష్ణారావు నియమితులయ్యారు. 1991 ఐఏఎస్ బ్యాచ్ అధికారి అయిన ఆయన ప్రస్తుతం ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. మే 1న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్​ శాంతి కుమారి ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు.

సీనియర్​ ఐఏఎస్​ అయిన రామకృష్ణారావు ఆర్థిక నిర్వహణలో ఎక్స్​పర్ట్​గా ఉన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి 13 బడ్జెట్లను ప్రవేశపెట్టడంలో, అవసరాలకు తగ్గట్టు ప్రభుత్వ పథకాలకు నిధులు సమకూర్చడంలో కీలక పాత్ర పోషించారు. ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకత కోసం ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్‌‌మెంట్ సిస్టమ్ (ఐఎఫ్​ఎమ్​ఐఎస్​)ను ప్రవేశపెట్టారు. రాష్ట్ర విభజన సమయంలో ఉద్యోగుల విభజన, పునర్వ్యవస్థీకరణ సమస్యలను సమర్థంగా నిర్వహించారు. ఆర్థిక శాఖ స్పెషల్​ చీఫ్​ సెక్రటరీగానే కాకుండా ప్లానింగ్ శాఖలోనూ అదనపు బాధ్యతలు నిర్వహిస్తూ జీఐఎస్ వ్యవస్థను బలోపేతం చేశారు.

గతంలో ఆయన సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ డైరెక్టర్ జనరల్‌‌‌‌గా, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌‌‌‌గా ఆదిలాబాద్, గుంటూరు జిల్లాల కలెక్టర్‌‌‌‌గా పనిచేశారు. విద్య, ఆరోగ్య రంగాల్లోనూ ముఖ్యమైన బాధ్యతలు నిర్వర్తించారు. ఐఐటీ కాన్పూర్, ఢిల్లీలో డిగ్రీలు, అమెరికాలో ఎంబీఏ పూర్తిచేశారు. రామకృష్ణారావు ఈ ఏడాది ఆగస్టులో రిటైర్​ కానున్నారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఆఖరి వరకు ఆయనకు కొనసాగింపు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.

తనకు అప్పగించిన కీలక బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని ప్రభుత్వ పథకాలను, విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా పనిచేస్తానని కొత్త సీఎస్​ కె.రామకృష్ణారావు అన్నారు. ఆయన మిడియాతో మాట్లాడుతూ తన మీద నమ్మకంతో సీఎస్​గా నియమించినందుకు సీఎం రేవంత్​ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X