हैदराबाद: आंध्र प्रदेश में छोटे कारोबारियों को निवेश के लिए सरकार ‘जगन अन्ना तोडू’ योजना लागू कर रही है। इस योजना के तहत मुख्यमंत्री वाईएस जगन मोहन रेड्डी बुधवार को छोटे कारोबारियों के लिए 395 करोड़ रुपये का ब्याज मुक्त कर्ज जारी करेंगे। सीएम के कैंप कार्यालय से एक बटन दबाकर राशि जमा की जाएगी। जगन अन्ना तोडू योजना के तहत जगन सरकार 10 हजार रुपये ब्याज मुक्त कर्ज उपलब्ध करा रही है।
जगनन्ना तोडू के माध्यम से छोटे व्यापारियों की रोजी-रोटी के लिए सरकार खड़ी है। नए ऋण जारी होने से 3.95 लाख छोटे व्यापारियों को लाभ होगा। सरकार आने वाले छह महीनों के लिए 15.17 करोड़ रुपये की ब्याज प्रतिपूर्ति भी प्रदान करेगी। अब तक 15 लाख 31 हजार 347 लोगों को 2,406 करोड़ रुपये ब्याज मुक्त ऋण दिये जा चुके हैं। इससे छोटे व्यापारियों पर ब्याज का बोझ कम हो जाएगा।
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లోని చిరు వ్యాపారులకు పెట్టుబడి కోసం జగనన్న తోడు పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇందులో భాగంగా బుధవారం నాడు చిరు వ్యాపారుల కోసం వడ్డీలేని రుణం రూ.395 కోట్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విడుదల చేయనున్నారు. సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి బటన్ నొక్కి నగదును జమ చేయనున్నారు. జగనన్న తోడు పథకంలో భాగంగా.. ఒక్కో వ్యాపారికి రూ. 10వేల వరకు వడ్డీ లేని రుణం అందిస్తోంది జగన్ ప్రభుత్వం.
జగనన్న తోడు ద్వారా చిరు వ్యాపారుల జీవనోపాధికి ప్రభుత్వం అండగా నిలుస్తోంది. తాజాగా ఇచ్చే రుణం జారీతో.. 3.95 లక్షల మంది చిరువ్యాపారులకు లబ్ధి చేకూరనుంది. గత ఆరు నెలలకు సంబంధించి రూ.15.17 కోట్లు వడ్డీ రీయింబర్స్‌మెంట్ కూడా ప్రభుత్వం అందించనుంది. జగనన్న తోడు పథకం కింద ఇప్పటివరకు 15 లక్షల 31వేల 347 మందికి రూ. 2,406 కోట్లు వడ్డీ లేని రుణాలు అందాయి. దీంతో చిరు వ్యాపారులకు వడ్డీల భారం తప్పుతోంది. (ఏజెన్సీ)