కర్నూలు: యస్ డి వి అజీజ్ మూల కథ ఆధారంగా 1995-96 లో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో ప్రసారితమైన రేడియో నాటకం ఆధారంగా ప్రదర్శించబడిన పద్య నాటకం ఆధునిక హంగులు సొగసులు అల్లుకుంది నాటక రంగంలో టెక్నాలజీని జోడించి బ్యాక్ గ్రౌండ్ ఎల్ఈడి స్క్రీన్ తో విజువల్ ఎఫెక్ట్స్ ను జోడించి ఆదివారం సాయంత్రం కర్నూలు లోని టీజీవి కళాక్షేత్రంలో విజయవంతంగా ప్రదర్శించబడింది.
ఈ నాటకానికి నంది అవార్డు గ్రహీత పత్తి ఓబులయ్య దర్శకత్వం వహించారు. ఆయన మాట్లాడుతూ త్వరలోనే ఈ నాటకం 100 ప్రదర్శనలు ప్రదర్శించబడాలని రచయితను అభినందించారు. అలాగే ఈ నాటకాన్ని గద్య రచన మరియు గీత రచన చేసిన క్రీ శే|| పల్లేటి లక్ష్మీ కులశేఖర్ గారికి నివాళిగా అర్పించారు.
ఈ కార్యక్రమానికి అతిధులు గా హాజరైన శ్రీమతి గౌరు చరితా రెడ్డి పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే, బుడ్డా రాజశేఖర్ రెడ్డి శ్రీశైలం ఎమ్మెల్యే కళాకారులను ప్రోత్సహించాలని మరియు నాటకరంగానికి తమ వంతు సహాయం తప్పకుండా చేస్తామని సభాపూర్వకంగా తెలియజేశారు.
Also Read-
ముఖ్యఅతిథిగా హాజరైన గుమ్మడి గోపాలకృష్ణ ఏపీ నాటక అకాడమీ చైర్మన్, మాట్లాడుతూ నాటక రంగంలో టెక్నాలజీ పరంగా త్వరలో చాలా మార్పులు రాబోతున్నాయని తెలియజేశారు. రిజిస్టర్ అయిన సొసైటీల ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి గ్రాంట్స్ పొందవచ్చు అని తెలియజేశారు. నాటక రంగంలో ప్రదర్శనలు చేసే మహిళా కళాకారులకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మరియు వివిధ సంస్థలు తమ తమ వెబ్సైట్లో నాటక కళాకారుల పేర్లు మరియు నాటకానికి సహకరించే సాంకేతిక సిబ్బంది పేర్లు పబ్లిక్ డొమైన్ లో ఉంచాలని తెలిపారు, ఐకమత్యమే మహాబలం అందరూ కలిసిమెలిసి నాటక రంగాన్ని మరింత ముందుకు తీసుకుని వెళ్లాలని తెలియజేశారు.
పత్తి ఓబులయ్య గారు మాట్లాడుతూ సెల్ ఫోన్లు ఉపయోగించే యువతను నాటకాలు ఆకట్టుకుంటున్నాయని మరియు వారంలో ఒకరోజు నాటకాన్ని ప్రదర్శించే విధంగా చర్యలు తీసుకుంటామని మరియు వివిధ భాషలలో అనువదింపబడిన సామా నాటకం పద్య రచన చేయటం మనసుకు అహ్లాదాన్ని కలిగించిందని తెలియజేశారు.
ఈ కార్యక్రమానికి టీజీ వెంకటేష్ మాజీ రాజ్యసభ శాసనసభ్యులు నిర్వహణ వహించగా కార్యక్రమంలో అనేక రచయితలు, మహిళలు మరియు ప్రేక్షకులు అధిక సంఖ్యలో హాజరై ఈ నాటకాన్ని చూసి సోషల్ మీడియాలో తమ భావాలను పంచుకోవడానికి ఫోటోలు వీడియోలు తీసుకున్నారు.