हैदराबाद: आईटी अधिकारियों की छापों से तेलंगाना में एक बार फिर हड़कंप मचा दिया है। शहर में सैकड़ों टीमें कई इलाकों में तलाशी ले रही हैं। गुरुवार की सुबह आईटी टीमों ने कुछ कंपनियों के साथ-साथ कारोबारियों के घरों पर भी सघन तलाशी की। खबर है कि हैदराबाद के साथ-साथ उपनगरों में भी तलाशी ली जा रही है।
खबर है कि कारोबारी प्रसाद, रघुवीर और कोटेश्वर राव के घरों और कंपनियों की तलाशी ली जा रही है। यह तलाशी कुकटपल्ली में हिंदू फॉर्च्यून में भी जारी है। तलाशी व्यापारिक लेनदेन में आयकर भुगतान के संबंध में की जा रही है। मागंटी वज्रनाथ और रेलवे ठेकेदार वरप्रसाद के घरों में तलाशी ली जा रही है। आईटी रिटर्न और कंपनियों में निवेश से जुड़े उपरोक्त संदेह को दूर करने के लिए छापेमारी की जा रही है। सीआरपीएफ की तैनाती के बीच ये तलाशी ली जा रही है।
चिटफंड और फाइनेंस कंपनियों को निशाने पर लेकर तलाश की जा रही है। अमीरपेट, शमशाबाद, कुकटपल्ली, जुबली हिल्स, बंजारा हिल्स और कई अन्य इलाकों में तलाशी की जा रही है। खबर है कि अमीरपेट में पूजाकृष्णा चिटफंड कंपनी में 20 टीमें तलाशी कर रही हैं। निदेशक सोमपल्ली नागा राजेश्वरी, पूजा लक्ष्मी और एमडी कृष्णा प्रसाद के घरों पर भी आईटी की तलाशी चल रही है। चिटफंड कंपनी के मालिक रघुवीर के शमशाबाद स्थित घर पर तलाशी जारी है। अरीकापुडी कोटेश्वर राव के कुकटपल्ली इंदु फॉर्च्यून विला स्थित घर की तलाशी ली जा रही है।
మరోసారి ఐటీ సోదాలు, వంద టీమ్‌లతో తనిఖీలు
హైదరాబాద్: తెలంగాణలో మరోసారి ఐటీ సోదాలు కలకలంరేపాయి. నగరంలో ఏకంగా వంద బృందాలుగా ఏర్పడి పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది. గురువారం ఉదయం కొన్ని కంపెనీలతో పాటు వ్యాపారవేత్తల ఇళ్లలో విస్తృత తనిఖీలు చేపట్టింది ఐటీ బృందాలు. హైదరాబాద్‌తో పాటు శివారుల్లోని ప్రాంతాల్లో కూడా సోదాలు జరుగుతున్నట్లు సమాచారం.
వ్యాపారవేత్తలైన ప్రసాద్, రఘువీర్, కోటేశ్వరరావు ఇళ్లు, కంపెనీల్లో సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కూకట్‌పల్లిలోని హిందూ ఫార్చ్యూన్‌లోనూ ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. వ్యాపార లావాదేవీల్లో ఆదాయ పన్ను చెల్లింపులకు సంబంధించి ఈ సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మాగంటి వజ్రనాథ్, రైల్వే కాంట్రాకర్ వరప్రసాద్ల ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. ఐటీ రిటర్న్, కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించిన అంశాలు పై ఉన్న అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. సీఆర్పీఎఫ్ బందోబస్తు మధ్య ఈ సోదాలు జరుగుతున్నాయి.
చిట్ ఫండ్స్, ఫైనాన్స్ కంపెనీలు టార్గెట్‌గా సోదాలు జరుగుతున్నాయి. అమీర్‌పేట, శంషాబాద్, కూకట్పల్లి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ తో పాటు పలు ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. అమీర్‌పేట పూజాకృష్ణ చిట్ ఫండ్స్ సంస్థలో 20 టీమ్స్ తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం. డైరెక్టర్స్ సోంపల్లి నాగ రాజేశ్వరి, పూజ లక్ష్మీ, ఎండి కృష్ణ ప్రసాద్ ఇళ్లపై కూడా ఐటీ సోదాలు జరుగుతున్నాయి. శంషాబాద్ లో చిట్ ఫండ్స్ సంస్థ యజమాని రఘువీర్ ఇంటిపై సోదాలు కొనసాగుతున్నాయి. కూకట్పల్లి ఇందు ఫార్చ్యూన్ విల్లాలో అరికపూడి కోటేశ్వరరావు ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి. (ఏజెన్సీలు)