हैदराबादः डॉ. बी.आर. अंबेडकर ओपन यूनिवर्सिटी और महिला विकास एवं विस्तार विभाग के तत्वावधान में अंतरराष्ट्रीय मातृभाषा दिवस कार्यक्रम का आयोजन किया। इस अवसर पर सेवानिवृत्त प्राचार्य डॉ. संगनभटला नरसय्या ने मुख्य अतिथि के रूप में भाग लिया और मुख्य भाषण दिया।
హైదరాబాద్ : డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, మహిళా అభివృద్ధి మరియు విస్తరణ విభాగము ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా “మాతృభాష కమనీయం – విద్యాసాధన రమణీయం” అనే అంశంపై రిటైర్డ్ ప్రిన్సిపాల్ డా. సంగనభట్ల నర్సయ్య ముఖ్య అతిథిగా పాల్గొని కీలకోపన్యాసం చేశారు.
ఆయన మాట్లాడుతూ… విద్యార్థి మనో వికాసానికి, సమగ్ర అధ్యయనానికి మాతృ బాషా ప్రధాన భూమికను పోషిస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగు భాషను కాపాడుకోకుంటే సంస్ర్కుత బాష ఎదుర్కొంటున్న సవాళ్లనే రానున్న రోజుల్లో తెలుగు బాషా కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని ఇది చాలా ఆందోళన కలిగించే అంశంగా పేర్కొన్నారు. తెలుగు బాషా 2400 సంవత్సరాల కంటే పురాతనమైందనే ఆధారాలు ఉన్నాయని ఆ చరిత్రను భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం బాషా ప్రియులపైనా, యువత పైన, ప్రభుత్వాలపైనా ఉందన్నారు. ప్రాధమిక విద్యాభ్యాసం తప్పనిసరిగా మాతృభాషలోనే జరగాల్సిన ఆవశ్యకత ను వివరించారు.
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య. కె. సీతారామారావు మాట్లాడుతూ… ప్రస్తుత పరిస్థితుల్లో పర భాషలు నేర్చుకోవాల్సిన అవసరం ఎంత ఉందో దానికి మించి మాతృ భాషను కాపాడుకోవాల్సిన అవసరం భాషాభిమానులపై ఉందని అభిప్రాయపడ్డారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఆంగ్ల బాష అవసరం ఎంతగా ఉందో ఆ స్థాయికి ఏదగాలి అంటే ముందుగా ప్రాధమిక స్థాయిలో అభ్యాసన కీలకంగా మారనుందని పేర్కొన్నారు. మాతృ బాష అనేది విద్యార్థిలో పరిణతిని తెస్తుందని, తద్వారా ఉన్నత శిఖరాలకు ఎదిగే అవకాశం ఉందని వివరించారు. దేశంలో భిన్న సంస్కృతులు ఉన్నాయని, భాషలు కూడా వేర్వేరు అయినప్పటికీ ప్రజలకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా అన్ని బాషల రచయితలు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆహ్వానితురాలుగా పాల్గొన్న విశ్వవిద్యాలయ ఇంచార్జ్ అకడమిక్ డైరెక్టర్ ప్రొ.ఇ.సుధా రాణి మాట్లాడుతూ రానున్న రోజుల్లో పలు భాషల్లో సాహిత్య రచనలు చేసిన ప్రఖ్యాత సాహిత్యకారులను ప్రస్తుత జనరేషన్ కు పరిచయం చేయనున్నట్లు వివరించారు. సామాన్య ప్రజలకు, పరిశోధక విద్యార్థులకు డా.బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం మరింత ఉపయోగపడనుందనే ఆశాభావాన్ని వ్యక్త పరిచారు. మహిళా అభివృద్ధి మరియు విస్తరణ విభాగ ఇంచార్జ్ డా. జి. మేరీ సునంద కార్యక్రమం ఆవశ్యకతను వివరించారు.
కార్యక్రమంలో కళల విభాగాల డీన్ ప్రొ. షకీలా ఖాణం; కామర్స్ విభాగ డీన్ ప్రో. ఆనంద్ పవార్, విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ డా. ఎల్వీకే రెడ్డి, పరీక్షల విభాగ నియంత్రణ అధికారి డా. పరాంకుశం వెంకట రమణ, పలు విభాగాల అధిపతులు, అధ్యాపక, అధ్యపకేతర సిబ్బంది, ఉద్యోగులు, పరిశోధక విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
LINGUISTS IS RESPONSIBILITY OF THE PRESERVE THE MOTHER TONGUE: Dr. S. Narsaiah
Hyderabad: Dr. B. R. Ambedkar Open University (BRAOU), Women development and extension centre organized International Mother Language Day on “Matrubhasha Kamaneeyam – Vidyasadhana Ramaneeyam” on February 22 at the University Campus. Dr. S. Narsaiah, Retd. Principal, Govt. Degree College, Dharmapuri, was the Chief Guest for the program. Dr. Naraiah said that the mother tongue plays a major role in the mental development and comprehensive study of the students. It is a matter of great concern that if the Telugu language is not preserved in the current situation, the Telugu language will have to face the same challenges faced by the cultured language in the coming days. He said that there are evidences that Telugu language is more than 2400 years old and it is the responsibility of language lovers, youth and governments to present that history to the future generations. He also explained the need for primary education to be conducted in the mother tongue.
Prof K. Seetharama Rao, Vice-Chancellor, BRAOU presided over the program. Prof. Rao said that in the current situation, there is a need for language lovers to preserve their mother tongue more than the need to learn foreign languages. He said that the need for English language at the national and international level is so high that learning at the primary level will become crucial. He explained that the mother tongue brings maturity in the student and thus there is a chance to rise to higher heights. He also said that there are different cultures in the country and even though the languages are also different, writers of all languages need to work to create awareness among the people.
Prof. E. Sudha Rani, In-charge, Director (Academic) attended as special invitee for the program, she said that in the coming days, the famous writers who wrote literary works in many languages will be introduced to the current generation. Dr. B. R. Ambedkar Open University expressed hope that would be more useful to the general public and research students.
Dr. G. Mary Sunanda, Women development and extension centre explain the aims, objectives of the program and introduced the chief guest. Prof. Shakeela Khanam, Dean, Faculty of Arts, Prof. I. Anand Pawar, Director CSTD; Dr. L.V.K Reddy, In-charge, Learner Support Services; Dr. P. Venkata Ramana, Controller of examinations, Directors, Deans, Head of the Branches, Teaching and Non-Teaching Staff Members and Representatives of various Service Associations also participated in the program.