हैदराबाद: देश में 88 प्रतिशत दो हजार रुपये के नोट बैकों में वापस आ चुके हैं। 31 जुलाई 2023 तक बाजार में अब महज 42,000 करोड़ रुपये मूल्य के नोट ही बचे है। भारतीय रिजर्व बैंक ने यह जानकारी देते हुए कहा कि 31 जुलाई 2023 तक 3.14 लाख करोड़ रुपये के दो हजार रुपये के नोट बैंकों में वापस आ गए हैं। अब महज 42 हजार करोड़ रुपये मूल्य के नोट ही बाजार में चलन में है।
आरबीआई के अनुसार 19 मई 2023 को बाजार में चलन में मौजूद दो हजार रुपये के नोटों में से 88 प्रतिशत नोट बैंकिंग सिस्टम में वापस आ गए हैं। 31 मार्च 2023 को बाजार में 3.62 लाख करोड़ रुपये के दो हजार के नोट बाजार में चलन में थे। 19 मई 2023 को यह घटकर 3.56 लाख करोड़ रुपये रह गए थे। इसी दिन आरबीआई ने दो हजार रुपये के नोटों को बाजार से वापस लेने का फैसला किया था।
अगर आपके पास 2 हजार रुपये के नोट हैं और आप उन्हें बदलना चाहते हैं तो आप बैंकों में जाकर यह काम पूरा कर सकते हैं। मार्च 2018 में सिस्टम में 2000 रुपये के नोट सबसे ज्यादा 6.73 ट्रिलियन थे। लेकिन मार्च 2023 तक 2 हजार रुपए के नोट 3.62 ट्रिलियन की कमी आई। इसी क्रम में आरबीआई ने 2 हजार रुपये के नोट वापस लेने की भी घोषणा की। आरबीआई ने यह फैसला क्लीन नोट पॉलिसी के तहत लिया है। इसके साथ ही अब कहा जा सकता है कि 2000 के नोटों का चलन पूरी तरह से कम हो गया है। सिस्टम में अगले 2 महीने के बाद 2 हजार रुपये के नोट नहीं दिखेंगे।
2 వేల నోట్లపై ఆర్‌బీఐ కీలక ప్రకటన
హైదరాబాద్: బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక ప్రకటన చేసింది. రూ.2 వేల నోట్లకు సంబంధించి ముఖ్యమైన అప్‌డేట్ ఇచ్చింది. రూ.2 వేల నోట్ల ఉపసంహరణ ప్రకటన నుంచి చూస్తే ఇప్పటి వరకే దాదాపు 88 శాతం రూ.2వేల నోట్లు బ్యాంకులకు తిరిగి వచ్చేశాయని ఆర్‌బీఐ వెల్లడించింది. ఆర్‌బీఐ మే 19న రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు వెల్లడించింది. ఇప్పుడు జూలై 31 నాటికి చూస్తే దాదాపు రూ.3.14 ట్రిలియన్ రూ.2 వేల నోట్లు తిరిగి బ్యాంకులకు చేరాయి.
ఇంకా రూ. 42 వేల కోట్ల విలువైన రూ.2 వేల నోట్లు వ్యవస్థలో చెలామణిలో ఉన్నాయని ఆర్‌బీఐ తెలిపింది. బ్యాంకుల నుంచి తీసుకున్న డేటా ఆధారంగా ఆర్‌బీఐ ఈ విషయాన్ని వెల్లడించింది. బ్యాంకుల్లోకి వచ్చిన రూ. 2 వేల నోట్లను గమనిస్తే వీటిల్లో 87 శాతం డిపాజిట్ల రూపంలో వచ్చాయి. అలాగే 13 శాతం ఎక్స్చేంజ్ రూపంలో బ్యాంక్‌లకు చేరాయి. కాగా ఆర్‌బీఐ రూ.2 వేల నోట్ల ఎక్స్చేంజ్‌కు సెప్టెంబర్ చివరి వరకు గడువు ఇచ్చిన విషయం తెలిసిందే. అంటే ఇంకో రెండు నెలల గడువు ఉందని చెప్పుకోవచ్చు.
అందువల్ల మీ వద్ద రూ.2 వేల నోట్లు ఉంటే వాటిని ఎక్స్చేంజ్ చేసుకోవాలని భావిస్తే బ్యాంకులకు వెళ్లి ఈ పని పూర్తి చేసుకోవచ్చు. 2018 మార్చి నెలలో రూ.2 వేల నోట్లు వ్యవస్థలో చాలా ఎక్కువగా రూ. 6.73 ట్రిలియన్లుగా ఉన్నాయి. అయితే 2023 మార్చి నాటికి రూ.2 వేల నోట్లు రూ. 3.62 ట్రిలియన్లకు తగ్గాయి. ఈ క్రమంలోనే ఆర్‌బీఐ కూడా రూ.2 వేల నోట్ల ఉపసంహరణను ప్రకటించింది. ఆర్‌బీఐ క్లీన్ నోట్ పాలసీలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పుడు రూ. 2 వేల నోట్ల చెలామణి పూర్తిగా తగ్గిపోయిందని చెప్పుకోవచ్చు. వచ్చే 2 నెలల తర్వాత వ్యవస్థలో ఇక రూ. 2 వేల నోట్లు కనిపించకపోవచ్చు. (ఏజెన్సీలు)