हैदराबाद : विधानसभा चुनावों की तुलना में लोकसभा चुनाव में मतदान प्रतिशत कम होना और पिछले संसद चुनावों की तुलना में बढ़ने की संभावना पर सभी पार्टियां उस पर विचार कर रही हैं कि किसको कितना फायदा होगा। तेलंगाना में सोमवार को हुए संसदीय चुनाव मतदान में शाम पांच बजे तक 60 फीसदी मतदान हुआ। अधिकारियों में चर्चा है कि अंतिम रिपोर्ट तक 65 प्रतिशत मतदान होने की संभावना है। क्या मौजूदा मतदान पैटर्न उनके लिए नुकसानदेह है या लाभदायक है। इस पर राजनीतिक दल विचार कर रहे हैं। इस बार हैदराबाद के निवासी मतदान के लिए आंध्र प्रदेश गए। इसलिए ग्रेटर में मतदान में काफी कमी आई है।
छह महीने पहले हुए विधानसभा चुनाव में लगभग 71 प्रतिशत मतदान दर्ज किया गया था, जबकि 2019 के संसद चुनाव में 62.77 प्रतिशत मतदान दर्ज किया गया था. लेकिन इस बार राज्य में 65 फीसदी तक मतदान होने की संभावना है। सभी पार्टियां यह जानने में जुटी हैं कि पिछले संसदीय चुनाव की तुलना में बढ़े मतदान का उन्हें कितना फायदा होगा। इस बात का हिसाब-किताब लगाया जा रहा है कि बढ़े हुए मतदान का फायदा किसे होगा। इसके अलावा, प्रमुख दलों ने घोषणा की कि मतदान उनके पक्ष में गया।
कांग्रेस नेताओं को भरोसा है कि उन्होंने सत्ता में आने के 100 दिनों के भीतर छह गारंटियों को लागू करने की पहल की है और यही कारण है कि उनके पक्ष में मतदान दर्ज किया गया है। भाजपा को भरोसा है कि कांग्रेस के छह महीने के शासन से निराश लोगों ने उनके पक्ष में मतदान किया, इसलिए भारी मतदान हुआ। बीआरएस के नेता भविष्यवाणी कर रहे हैं कि उनके शासन के दौरान बिजली, खेती और पीने के पानी की कोई समस्या नहीं थी, लेकिन कांग्रेस के छह महीने के शासन के दौरान लोगों को कठिनाइयों का सामना करना पड़ा और यही कारण है कि उन्होंने उनके पक्ष में मतदान किया।
संबंधित खबर-
తెలంగాణలో ఓటింగ్ శాతంపై పార్టీల్లో హై టెన్షన్
హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే పోలింగ్ శాతం తగ్గడం, గత పార్లమెంట్ ఎలక్షన్స్‌తో పోల్చుకుంటే పెరిగే చాన్స్ ఉండడం తమకు కలిసొస్తుందా? లేదా? అని పార్టీలు బేరీజు వేసుకుంటున్నాయి. రాష్ట్రంలో సోమవారం జరిగిన పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ లో సాయంత్రం ఐదు గంటల వరకు 60 శాతం పోలింగ్ నమోదైంది. తుది రిపోర్ట్ వచ్చే వరకు 65 శాతం పోలింగ్ నమోదయ్యే చాన్స్ ఉందని అధికార వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ప్రస్తుతం సాగిన పోలింగ్ సరళి తమకు నష్టమా? లాభామా? అని రాజకీయ పార్టీలు ఆరా తీస్తున్నాయి. ఈ సారి హైదరాబాద్‌లోని సెటిలర్లు ఓటింగ్ కోసం ఏపీకి వెళ్లడంతో గ్రేటర్ పరధిలో గణనీయంగా పోలింగ్ తగ్గిందనే అభిప్రాయాలు ఉన్నాయి.
ఆరు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సుమారు 71 శాతం పోలింగ్ నమోదు కాగా 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 62.77 శాతం పోలింగ్ నమోదైంది. అయితే ఈసారి రాష్ట్రంలో 65 శాతం వరకు పోలింగ్ నమోదయ్యే చాన్స్ కనిపిస్తున్నది. గత పార్లమెంట్ ఎన్నికలతో పోల్చుకుంటే పెరిగిన పోలింగ్ శాతం తమకు ఏ మేరకు ప్రయోజనం చేకూరుస్తుందని అన్ని పార్టీలు ఆరా తీస్తున్నాయి. పెరిగిన ఓటింగ్ శాతం ఎవరికి లాభిస్తుందని లెక్కలు వేసుకుంటున్నాయి. పైకి మాత్రం ప్రధాన పార్టీలు ఓటింగ్ తమకు అనుకూలంగా జరిగిందనే ప్రకటించుకున్నాయి.
అధికారంలోకి వచ్చిన వందరోజుల్లోనే ఆరు గ్యారంటీల అమలుకు శ్రీకారం చుట్టామని, అందుకే తమకు అనుకూలంగా పోలింగ్ నమోదైందని ధీమాలో కాంగ్రెస్ లీడర్లు ఉన్నారు. కాంగ్రెస్ ఆరు నెలల పాలనపై విరక్తి చెందిన ప్రజలు తమకు అనుకూలంగా ఓటు వేశారని, అందుకే పెద్ద సంఖ్యలో పోలింగ్ జరిగిందని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తున్నది. తమ పాలనలో కరెంట్ కష్టాలు, సాగు, తాగు నీరుకు ఇబ్బందులు లేవని, కానీ, కాంగ్రెస్ ఆరు నెలల పాలనలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అందుకే తమకు అనుకూలంగా ఓటింగ్ జరిగిందని గులాబీ లీడర్లు అంచనా వేస్తున్నారు. (ఏజెన్సీలు)