हैदराबाद: तिरुमला (आंध्र प्रदेश) के पहले घाट रोड पर एक भीषण सड़क हादसा हो गया। भगवान बालाजी के दर्शन कर तिरुमला से तिरुपति आते समय 24वें मोड़ पर तूफानी वाहन बेकाबू हो गया। घाट सड़क पर दीवार से जा टकराया। तेलंगाना के मेदक जिले की पार्वतम्मा नाम की एक श्रद्धालु की मौके पर ही मौत हो गई। आंधी वाहन में सवार छह अन्य लोग गंभीर रूप से घायल हो गए और उन्हें तिरुपति रूया अस्पताल में भर्ती कर दिया गया।
लेकिन बीच मार्ग में ही कर्नाटक के रायदुर्गम की रहने वाली रेणुकम्मा नाम की एक भक्त की मौत हो गई। फिलहाल पांच घायलों का रूया अस्पताल में इलाज चल रहा है। हादसा पहले घाट रोड पर हुआ, जिससे यातायात बुरी तरह बाधित हो गया। टीटीडी के सतर्कता और यातायात कर्मियों ने जगह-जगह वाहनों के रुकते ही ट्रैफिक साफ कर दिया।
यह भी पढ़ें :
తిరుమల ఘాట్‌రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం, స్పాట్‌లోనే ఇద్దరు మహిళా భక్తులు మృతి
హైదరాబాద్: తిరుమల (ఆంధ్రప్రదేశ్) మొదటి ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీవారి దర్శనానంతరం తిరుమల నుంచి తిరుపతికి వస్తుండగా 24వ మలుపు వద్ద తుపాను వాహనం అదుపుతప్పింది. ఘాట్ రోడ్డులోని గోడను ఢీకొట్టింది. స్పాట్‌లోనే తెలంగాణలోని మెదక్ జిల్లాకు చెందిన పార్వతమ్మ అనే భక్తురాలు స్పాట్‌లోనే మృతి చెందింది. తుపాను వాహనంలోని మరో ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా వారిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.
అయితే మార్గ మధ్యలో కర్ణాటకలోని రాయదుర్గంకు చెందిన రేణుకమ్మ అనే భక్తురాలు ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం ఐదుగురు క్షతగాత్రులు రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మొదటి ఘాట్ రోడ్డులో ఈ ప్రమాదం చోటు చేసుకోవటంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనాలు ఎక్కడిక్కడ నిలిచి పోవడంతో టీటీడీ విజిలెన్స్, ట్రాఫిక్ సిబ్బంది ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.
మరో ఘటనలో ఆరుగురు మృతి
కాకినాడ జిల్లాలోనూ ఇవాళ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేటు బస్సు, ఆటో ఢీకొన్న ఘటనలో ఆరుగురు మహిళలు స్పాట్‌లోనే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్రంగా గాయపడ్డారు. తాళ్లరేవు మండలం సీతారామపురంలోని సుబ్బరాయునిదిబ్బ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రొయ్యల పరిశ్రమలో పని చేసి కూలీలు ఆటోలో తిరిగి వెళ్తుండగా ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయాలపాలైన వారిని యానాం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. మృతులంతా యానాంలోని నీలపల్లికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. (ఏజెన్సీలు)