हैदराबाद: भारत में सबसे ज्यादा आपराधिक मामले दक्षिण भारत के आंध्र प्रदेश, तमिलनाडु और तेलंगाना के मुख्यमंत्रियों में खिलाफ दर्ज हैं। बताया जा रहा है कि तेलंगाना के मुख्यमंत्री के चंद्रशेखर राव पर 64 मामले दर्ज हैं। इसमें 34 आईपीएस के गंभीर मामले शामिल हैं। इसके अलावा आंध्र प्रदेश के मुख्यमंत्री वाईएस जगन मोहन रेड्डी पर 38 मामले दर्ज हैं। उनमें से 35 गंभीर आपराधिक मामले हैं। इसके बाद तमिलनाडु के मुख्यमंत्री और डीएमके नेता एमके स्टालिन तीसरे स्थान पर हैं। स्टालिन के खिलाफ 47 मामले हैं। उनमें से 27 आपराधिक मामले हैं।
इसी तरह, दिल्ली के मुख्यमंत्री अरविंद केजरीवाल (आप), मिजोरम के सीएम जोरनतांगा (मिजो नेशनल फ्रंट) के खिलाफ तीन-तीन आपराधिक मामले हैं, जबकि केरल के सीएम पिनाराई विजयन (सीपीआई-एम), बिहार के सीएम और जेडी (यू) नेता नीतीश कुमार के खिलाफ दो आपराधिक मामले हैं। इन नेताओं के चुनावी हलफनामे में कहा गया है कि उनके साथ-साथ महाराष्ट्र, हिमाचल प्रदेश, छत्तीसगढ़, झारखंड, सिक्किम और पंजाब के प्रत्येक मुख्यमंत्रियों के खिलाफ एक आपराधिक मामला दर्ज है।
यहां अजीब बात यह है कि 43 प्रतिशत मुख्यमंत्रियों ने खुद ही घोषणा की है कि उनके खिलाफ आपराधिक मामले दर्ज हैं। सूची में कुल 30 नेताओं में से 13 के खिलाफ आपराधिक मामले दर्ज हैं। उनमें से कुछ जिन आपराधिक मामलों का सामना कर रहे हैं उनमें हत्या, हत्या का प्रयास, अपहरण और आपराधिक धमकी शामिल हैं।
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై అత్యధిక క్రిమినల్ కేసులు
హైదరాబాద్: భారతదేశంలో అత్యధిక కేసులున్న సీఎంలలో సౌత్ ఇండియాకు చెందిన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ సీఎంలే టాప్‌లో ఉన్నారు. ఇందులో తెలంగాణ సీఎం కేసీఆర్‌పై 64 కేసులు ఉన్నట్టు సమాచారం. ఇందులో 34 సీరియస్ ఐపీఎస్ కేసులు ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 38 కేసులు ఉండగా ఇందులో 35 సీరియస్ క్రిమినల్ కేసులు ఉన్నాయి. అలాగే మూడో స్థానంలో తమిళనాడు సీఎం డీఎమ్‌కే అధినేత ఎంకే స్టాలిన్ ఉన్నారు. ఇతనిపై 47 కేసులుండగా వాటిల్లో 27 క్రిమినల్ కేసులు ఉన్నట్టు సమాచారం.
అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (ఆప్), మిజోరం సీఎం జోరంతంగా (మిజో నేషనల్ ఫ్రంట్)పై ఒక్కొక్కరిపై మూడు క్రిమినల్ కేసులు ఉండగా, కేరళ సీఎం పినరయి విజయన్ (సీపీఐ-ఎం), బీహార్ సీఎం, జేడీ(యూ) నేత నితీశ్ కుమార్‌పై రెండు క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీరితో పాటు మహారాష్ట్ర, హిమాచల్‌ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, సిక్కిం, పంజాబ్ ముఖ్యమంత్రులపై ఒక్కొక్కరిపై ఒక్కో క్రిమినల్ కేసు ఉన్నట్లు వారి ఎన్నికల అఫిడవిట్‌లో తెలిపారు.
ఇక్కడ విచిత్రం ఏంటంటే 43 శాతం మంది ముఖ్యమంత్రులు తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు వారే ప్రకటించుకున్నారు. మొత్తం 30 మంది రాజకీయ నాయకులలో 13 మందిపై క్రిమినల్ కేసులు ఉన్న వారు లిస్టులో ఉన్నారు. వీరిలో కొందరు ఎదుర్కొంటున్న క్రిమినల్ కేసుల్లో హత్య, హత్యాయత్నం, కిడ్నాప్, క్రిమినల్ బెదిరింపులకు సంబంధించినవి ఉన్నాయి. (ఏజెన్సీలు)