हैदराबाद: हैदराबाद मौसम विज्ञान केंद्र के अधिकारियों ने कहा कि उत्तर-पश्चिम बंगाल की खाड़ी में बना अत्यधिक निम्न दबाव लगातार जारी है। उन्होंने कहा कि दबाव के संबंध में आवधिकता का भी निर्माण हुआ है। अगले दो दिनों में बहुत भारी से बहुत भारी बारिश होने की संभावना है। मौसम विभाग के मुताबिक 40 से 50 किमी प्रति घंटे की रफ्तार से तेज हवाएं चलेंगी। इस हद तक तेलंगाना में रेड अलर्ट घोषित कर दिया गया है।
अधिकारियों ने कहा कि खम्मम, नलगोंडा, सूर्यापेट, महबुबाबाद और यादाद्री जिलों में गुरुवार को भारी बारिश होने की संभावना है। उन जिलों को रेड अलर्ट जारी कर दिया गया है। सिद्दीपेट, निर्मल, वरंगल, हनमाकोंडा, जनगांव, रंगारेड्डी, मेडचल-मलकजगिरी, विकाराबाद, संगारेड्डी, मेदक, कामारेड्डी, महबूबनगर, नगरकर्नूल, वनपर्ती, नारायणपेट और गदवाल के लिए ऑरेंज का अलर्ट जारी किया गया है। जगित्याला, सिरिसिला, करीमनगर, पेद्दापल्ली, भूपालपल्ली, मुलुगु, भद्राद्रि, आदिलाबाद, आसिफाबाद, मंचेरिल और निज़ामाबाद जिलों के लिए येलो अलर्ट जारी किया गया है।
हैदराबाद के लिए हाई अलर्ट
जीएचएमसी अधिकारियों ने हैदराबाद के लिए हाई अलर्ट की घोषणा की है। भारी बारिश के पूर्वानुमान के मद्देनजर लोगों को सतर्क रहने की सलाह दी गई है। उन्हें चेतावनी दी गई कि जब तक जरूरी न हो बाहर न निकलें। जीएचएमसी ने आपातकालीन सहायता के लिए नंबर 9000113667 पर संपर्क करने को कहा है। 70 लाख लोगों को एसएमएस के जरिए इस हद तक अलर्ट किया जा चुका है। शहर के जलाशयों में भारी बाढ़ आ गई है। इसके साथ ही हिमायतसागर के दोनों गेटों को हटा चुके अधिकारी नीचे की ओर पानी छोड़ रहे हैं। जिलों में बारिश को लेकर सीएस शांति कुमारी ने सभी जिलों के कलेक्टर और एसपी के साथ टेलीकांफ्रेंस की। बारिश को लेकर सतर्क रहने की सलाह दी गई है।
తెలంగాణకు మళ్లీ భారీ వర్ష సూచన, హైదరాబాద్‌కు హై అలర్ట్
హైదరాబాద్: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. పీడనానికి అనుబంధంగా ఆవర్తనం కూడా ఏర్పడిందన్నారు. దీని వచ్చే రెండ్రోజులు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్రంలో రెడ్ అలర్ట్ ప్రకటించింది.
రేపు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, యాదాద్రి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఈ మేరకు ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. సిద్దిపేట, నిర్మల్, వరంగల్, హన్మకొండ, జనగామ, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు, వనపర్తి, నారాయణపేట, గద్వాలలకు ఆరెండ్ అలర్ట్ జారీ చేశారు. జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు.
హైదరాబాద్‌కు హై అలర్ట్
ఇక హైదరాబాద్‌కు జీహెచ్ఎంసీ అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. భారీ వర్షసూచన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరించారు. అత్యవసర సహాయం కోసం 9000113667 నంబర్‌ను సంప్రదించాలని జీహెచ్ఎంసీ తెలిపింది. 70 లక్షల మందిని ఈ మేరకు ఎస్‌ఎంఎస్‌ల ద్వారా అప్రమత్తం చేసింది. ఇక నగరంలోని జంట జలాశయాలకు భారీగా వరద పోటెత్తుతోంది. దీంతో హిమాయత్ సాగర్ రెండు గేట్లను ఎత్తిన అధికారులు దిగువకు నీటిని వదులుతున్నారు. ఇక జిల్లాల్లో వర్షాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎస్ శాంతి కుమారి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎప్పటికప్పడు నష్టనివారణ చర్యలు చేపట్టాలన్నారు.
భద్రాచాలం వద్ద మెుదటి ప్రమాద హెచ్చరిక
భారీ వర్షాలతో గోదావరికి వరద పోటెత్తుతోంది. భద్రాచలం వద్ద గంటగంటకు గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల వరకు 44.4 అడుగుల మేర నీరు చేరినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గోదావరి నీటిమట్టం మరో నాలుగు అడుగులు పెరిగి 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. భారీ వరదతో ఆలయ పరిసరాల్లోని దుకాణాల్లోకి నీరు చేరాయి. అలాగే రామయ్య నిత్యఅన్నదాన సత్రంలోనూ భారీగా వర్షపు నీరు చేరింది.(ఏజెన్సీలు)