आकाश में तारें दिखा रहे हैं सोने और चांदी की कीमतें, मार्केट विश्लेषकों को है यह उम्मीद

हैदराबाद : जियोपॉलिटिकल (भू-राजनैतिक) अनिश्चितताओं के चलते सोने और चांदी की डिमांड लगातार बढ़ रही है। मार्केट एक्सपर्ट्स का अनुमान है कि पिछले हफ्ते तेजी से बढ़ी कीमतों में इस हफ्ते भी और बढ़ोतरी रह सकती है। गुड रिटर्न्स वेबसाइट के मुताबिक, सोमवार (19 जनवरी) सुबह 6.00 बजे हैदराबाद बुलियन मार्केट में 24 कैरेट 10 ग्राम सोने की कीमत 1,43,770 रुपये है। 22 कैरेट 10 ग्राम सजावटी सोने की कीमत 1,31,790 रुपये पर बनी हुई है। विजयवाड़ा और विशाखापत्तनम में भी यही कीमतें हैं।

इसी क्रम में हैदराबाद में एक किलो चांदी की कीमत अभी 3,09,900 रुपये है। विजयवाड़ा और विशाखापत्तनम में भी कीमत लगभग इतनी ही है। मुंबई और दिल्ली में एक किलो चांदी की सबसे कम कीमत 2,94,900 रुपये पर है। मार्केट विश्लेषकों को उम्मीद है कि इस हफ्ते सोने की कीमतों में और बढ़ोतरी होगी। हालांकि, चांदी की कीमतों में सुधार की उम्मीद है। उनका यह भी कहना है कि यह सुधार थोड़े समय के लिए होगा। मार्केट एक्सपर्ट्स का कहना है कि अमेरिकी प्रेसिडेंट डोनाल्ड ट्रंप के टैरिफ के बाद सोने और चांदी की कीमतों में और बढ़ोतरी हो सकती है।

Also Read-

చుక్కలు చూపిస్తున్న బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ : భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పసిడి, వెండికి డిమాండ్ పెరుగుతూనే ఉంది. గతవారం భారీగా పెరిగిన ధరలు, ఈ వారం కూడా మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, సోమవారం (జనవరి 19) ఉదయం 6.00 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధరల 1,43,770గా ఉంది. 22 క్యారెట్‌ 10 గ్రాముల ఆర్నమెంటల్ పసిడి ధర రూ.1,31,790 వద్ద కొనసాగుతోంది. విజయవాడ, విశాఖపట్నం కూడా ఇవే ధరలు ఉన్నాయి.

ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ప్రస్తుతం రూ.3,09,900గా ఉంది. విజయవాడ, వైజాగ్‌లో కూడా దాదాపు ఇదే ధర కొనసాగుతోంది. ముంబై, ఢిల్లీలో కిలో వెండి అత్యల్పంగా రూ.2,94,900 వద్ద ట్రేడవుతోంది. ఇక ఈ వారం బంగారం ధరలు మరింత పెరుగుతాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే, వెండి ధరలు మాత్రం దిద్దుబాటుకు లోనుకావచ్చని భావిస్తున్నాయి. ఈ దిద్దుబాటు స్వల్పకాలికమేనని కూడా చెబుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు మరింత పెరగకతప్పదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. (ఏజెన్సీలు)

వివిధ నగరాల్లో 10 గ్రాముల బంగారం ధరలు (24కే, 22కే)

చెన్నై: ₹1,44,860; ₹1,32,790;

ముంబై: ₹1,43,770; ₹1,31,790;

న్యూఢిల్లీ: ₹1,43,920; ₹1,31,940;

కోల్‌కతా: ₹1,43,770; ₹1,31,790;

బెంగళూరు: ₹1,43,770; ₹1,31,790;

హైదరాబాద్: ₹1,43,770; ₹1,31,790;

విజయవాడ: ₹1,43,770; ₹1,31,790;

కేరళ: ₹1,43,770; ₹1,31,790;

పుణె: ₹1,43,770; ₹1,31,790;

వడోదరా: ₹1,43,820; ₹1,31,840;

అహ్మదాబాద్: ₹1,43,820; ₹1,31,840;

వెండి (కిలో) ధరలు ఇవీ

చెన్నై: ₹3,09,900

ముంబై: ₹2,94,900

న్యూఢిల్లీ: ₹2,94,900

కోల్‌కతా: ₹2,94,900

బెంగళూరు: ₹2,94,900

హైదరాబాద్: ₹3,09,900

విజయవాడ: ₹3,09,900

కేరళ: ₹3,09,900

పుణె: ₹2,94,900

వడోదరా: ₹2,94,900

అహ్మదాబాద్: ₹2,94,900

గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X