हैदराबाद: पूर्व मंत्री वट्टी वसंत कुमार (70) का निधन हो गया। वह कुछ समय से किडनी बीमारी से पीड़ित थे और विशाखापट्टणम के अपोलो अस्पताल में इलाज के दौरान उन्होंने अंतिम सांस ली।
वसंत कुमार का गृहनगर पश्चिम गोदावरी जिले का पुंडला गांव है। उन्होंने कांग्रेस की ओर से उंगुटुर से विधायक के रूप में 2004 और 2009 के चुनाव जीते। वसंत कुमार के निधन पर रेवंत रेड्डी ने गहरा शोक व्यक्त किया है। साथ ही परिवार को सांत्वना दी है। मंत्री के निधन पर अनेक नेता शोक व्यक्त कर रहे है।
वट्टी वसंतकुमार ने वाईएस राजशेखर रेड्डी, रोशय्या और किरण कुमार रेड्डी के मंत्रिमंडल में मंत्री के रूप में काम किया। ग्रामीण विकास एवं पर्यटन विभागों की जिम्मेदारी संभाली। वसंत कुमार 2014 के चुनाव के बाद से राजनीति से दूर हैं। परिवार के सदस्यों ने मीडिया को जानकारी दी कि वसंतकुमार का अंतिम संस्कार रविवार शाम को किया जाएगा.
హైదరాబాద్ : మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ (70) కన్నుమూశారు. గత కొంతకాలంగా మూత్రపిండము అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖపట్నంలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
వసంతకుమార్ స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా పూండ్ల గ్రామం. ఉంగుటూరు నుంచి కాంగ్రెస్ తరఫున 2004, 2009 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మంత్రి మృతి పట్ల పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్‌లలో వట్టి వసంతకుమార్ మంత్రిగా పని చేశారు. గ్రామీణాభివృద్ధి, పర్యాటక శాఖల బాధ్యతలను నిర్వర్తించారు. 2014 ఎన్నికల తర్వాత నుంచి రాజకీయాలకు వసంతకుమార్ దూరంగా ఉంటున్నారు. ఆదివారం సాయంత్రం పూండ్లలో వసంత్‌కుమార్ అంత్యక్రియలు జరగనున్నట్లు కుటుంబ సభ్యులు మీడియాకు వెల్లడించారు. (ఏజెన్సీలు)
రేవంత్ రెడ్డి సంతాపం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ప్రగాఢ సంతాపం. వట్టి వసంత్ కుమార్ ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నా.. ఆయన కుటుంబ సభ్యులకు నా సానుభూతి…. రేవంత్ రెడ్డి..
కిషన్ రెడ్డి సంతాపం
మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ కన్నుమూయడం పట్ల విచారం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 2004, 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యులుగా కలిసి పనిచేశాం. ఎప్పుడు కలిసినా ఆప్యాయంగా, ఆత్మీయంగా పలకరించేవారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నాను.