ధోకా, ధోకా, ధోకా… కాంగ్రెస్ అంటేనే ఓ పెద్ద ధోకా పార్టీ: అసెంబ్లీలో మాజీ మంత్రి హరీష్ రావు

డోకా లేకుండా ఉన్న తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ధోకా ఇచ్చింది.

8 నెలల్లో ఎన్ని ధోకాలు అధ్యక్షా!?

ప్రతి మహిళలకు నెలకు 2500- ధోకా
రైతు భరోసా కింద రైతన్నకు,
కౌలు రైతుకు 15 వేలు -ధోకా
డిసెంబర్ 9 న రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ – ధోకా
అన్ని పంటలకు మద్దతు ధరపై 500 బొనస్ -ధోకా
విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు -ధోకా
మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాల భర్తీ -ధోకా
25 వేల పోస్టులలో మెగా డిఎస్సీ – ధోకా
వంద రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు అన్నరు -ధోకా
నిరుద్యోగ భృతి -ధోకా
వెంటనే డిఏ, పిఆర్సి ఇస్తామని ప్రభుత్వ, ఉద్యోగులు ఉపాధ్యాయులకు -ధోకా
ప్రభుత్వంలోకి ఆర్టీసీ విలీనం -ధోకా
మైనార్టీలకు ప్రత్యేక సబ్ ప్లాన్ -ధోకా
అవ్వా, తాతలకు 4వేల ఫించన్ -ధోకా
దివ్యాంగులకు 6వేల పింఛన్ -ధోకా
కళ్యాణ లక్ష్మికి అదనంగా తులం బంగారం -ధోకా
ఆటో డ్రైవర్లకు 12 వేల ఆర్థిక సాయం -ధోకా
ప్రతి రోజూ సీఎం ప్రజాదర్బార్ -ధోకా

అసెంబ్లీలో బడ్జెట్ రిప్లై సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు

బీఆర్ఎస్పై ఆరోపణలతోనే బడ్జెట్ ప్రసంగం నిండి ఉంది -హరీష్ రావు
బడ్జెట్ ప్రసంగంలో ఆరోపణలు తప్పని బడ్జెట్ లెక్కలే చెబుతున్నాయి
మమ్మల్ని తిట్టుకుంటూ ఎంతకాలం బతుకుతారు? -హరీష్ రావు
ఈ ప్రభుత్వం దశ దిశ లేకుండా ఉంది -హరీష్ రావు మీరు ఏం చేస్తారో చెప్పండి.. హామీల అమలెప్పుడో చెప్పండి 100 రోజుల్లో అమలు చేస్తామన్న గ్యారంటీల సంగతేమైంది? 65 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 4 కోట్ల మెట్రిక్ టన్నులకు ధాన్యం ఉత్పత్తి ఎలా పెరిగింది?బీఆర్ఎస్ పాలనలో అన్నిరంగాలకు 24 గంటలు కరెంట్ ఇచ్చినం పది నిమిషాలు టీ బ్రేక్ ఇస్తే గన్పార్క్ దగ్గర రోడ్డు మీదికి వెళ్దాం నాతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను రమ్మనండి -హరీష్ రావు

Also Read-

మా పాలనలో కరెంట్ బాగుందా..ఇప్పుడు బాగుందా ప్రజల్ని అడుగుదాం తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ మేం ఏం చేయకుండా 4.5 లక్షల కోట్లున్న జీఎస్డీపీ 14 లక్షల కోట్లకు ఎలా పెరిగింది?
కాంగ్రెస్ పాలనలో రూ.200 ఉన్న పెన్షన్ మేం రూ.2016కు పెంచినం
కాంగ్రెస్ చెప్పిన రూ.4 వేల పింఛన్ నాలుకల మీదనే ఉంది -హరీష్ రావు
బడ్జెట్ ప్రసంగం అంతా అబద్దాల విస్తరి -హరీష్ రావు
కేంద్రం నుంచి రూ.26 వేల కోట్లు వస్తుందని బడ్జెట్లో పెట్టారు
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని తీర్మానం పెట్టారు
గత ఏడాది కేంద్రం నుంచి వచ్చిన నిధులు చాలా తక్కువ
పదేళ్ల మా పాలన విజయాలను ప్రజల మనసుల నుంచి తుడిచిపెట్టలేరు
స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఆదాయం రూ.4 వేల కోట్లు ఎక్కువ వస్తుందన్నారు
8 నెలలుగా రిజిస్ట్రేషన్లు తగ్గుతుంటే ఆదాయం ఎలా పెరుగుతుంది?
రిజిస్ట్రేషన్ ఫీజులు, భూముల విలువలు పెంచి ప్రజలపై భారం వేస్తారా?
మీరు తల దించుకోవడం తప్ప తలెత్తుకునే పరిస్థితి ఉండదు
ఎక్సైజ్ సుంకం రూ.5,700 కోట్లు ఎలా పెరుగుతుంది -హరీష్ రావు
ఎక్సైజ్ అండ్ వ్యాట్ ద్వారా రూ.42 వేల కోట్లు ప్రతిపాదించారు
ఊరికో బెల్ట్ షాప్ ఉందని గతంలో భట్టి అన్నారు -హరీష్ రావు
మీరు ప్రతిపాదించిన దాన్నిబట్టి గల్లీకో బెల్ట్ షాప్ పెడతారా? -హరీష్ రావు
ప్రజల రక్తమాంసాలు పీల్చి పిప్పిచేసి ఎక్సైజ్ ఆదాయం పెంచుతామని ఒప్పుకున్నారు
ఎక్సైజ్ ఆదాయం రూ.7,200 కోట్లు పెంచుతామని మంత్రి భట్టి చెప్పారు -హరీష్ రావు
మద్యాన్ని నియంత్రించి బెల్ట్ షాపులు ఎత్తేస్తామని చెప్పారు -హరీష్ రావు
రూ.7,200 కోట్లు ఎలా పెంచుకుంటారో చెప్పండి -హరీష్ రావు
బీర్లు, చీప్ లిక్కర్, విస్కీల మీద ఎక్కువ ఆదాయం వస్తుందని చెప్పారు మద్యా్న్ని ప్రోత్సహించవద్దు, తెలంగాణను బొందలగడ్డ చేయొద్దు -హరీష్ రావు

నాన్ ట్యాక్స్ రెవిన్యూ ప్రతిపాదన వాస్తవ విరుద్దంగా ఉంది -హరీష్ రావు
ప్రభుత్వ భూములు అమ్మొద్దని గతంలో రేవంత్, భట్టి, శ్రీధర్ బాబు అన్నారు భూములు అమ్మడం ద్వారా రూ.24 వేల కోట్లు తెస్తామని బడ్జెట్లో చెప్పారు రూ.10 వేల కోట్లు భూములు అమ్మడం ద్వారా వస్తాయన్నారు రూ.14 వేల కోట్లు ఇతర మార్గాల ద్వారా సాధిస్తామన్నారు అసెంబ్లీలో చెప్పకుండా దాచిపెట్టేంత ఇతర మార్గాలేంటి? -హరీష్ రావు

రుణమాఫీకి 41 వేల కోట్ల నుంచి 26 వేల కోట్లకు తగ్గించారు -హరీష్ రావు రుణమాఫీలో అనేక కోతలు పెట్టారు -హరీష్ రావు డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని పంద్రాగస్ట్కు వాయిదా వేశారు -హరీష్ రావు

డిసెంబర్ 9 తర్వాత అప్పుపై వడ్డీ రైతుల నుంచి వసూలు చేస్తున్నారు కాంగ్రెస్ సర్కార్ చేసిన తప్పుకి రైతులు ఎందుకు భారం మోయాలి ? డిసెంబర్ 9 తర్వాత వడ్డీ కడితేనే రుణమాఫీ చేస్తామని బ్యాంకులు చెబుతున్నాయి ఆరోగ్యశ్రీకి గత ఏడాది కంటే నిధులు తగ్గించారు -హరీష్ రావు

వైయస్ ప్రారంభించిన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, 108 కొనసాగించాం కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ పథకాలు ఈ ప్రభుత్వం ఆపేసింది -హరీష్ రావు

పేద గర్భిణుల పొట్ట కొట్టకండి -హరీష్ రావు

కేసీఆర్పై కోపం ఉంటే పథకానికి పేరు మార్చుకోండి -హరీష్ రావు

ఈ ప్రభుత్వం చేసిన అప్పులను కూడా మా ఖాతాలో వేశారు వాస్తవానికి 4 లక్షల కోట్లు అప్పుంటే 7 లక్షల కోట్లని అబద్దాలు చెబుతున్నారు కరోనా వల్ల రెండేళ్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయి -హరీష్ రావు

డిస్కంల అప్పులను కేంద్రం రాష్ట్రంపై బలవంతంగా రుద్దింది -హరీష్ రావు

కేంద్రం గ్రాంట్ ఇవ్వకుండా అప్పులు చేసుకోవాలని అనుమతి ఇచ్చింది
కరోనా, కేంద్ర ప్రభుత్వ విధాన నిర్ణయాల వల్ల 41 వేల కోట్ల అప్పు
పదేళ్ల పాలనలో మేం చేసిన అప్పు రూ.3 లక్షల 81 వేల కోట్లు
అవకాశం ఉన్నా ఎక్కువ అప్పులు తీసుకోలేదు -హరీష్ రావు
కేంద్రం చెప్పినట్టు మోటార్లకు మీటర్లు పెడితే మరో 30 వేల కోట్ల అప్పు వచ్చేది
భవిష్యత్ తరాల పట్ల మా నిబద్ధత ఏంటో దీన్నిబట్టి తెలుస్తోంది -హరీష్ రావు
బడ్జెట్ కంటే అత్యంత ప్రాధాన్యత అసెంబ్లీకి ఇంకొకటి ఉండదు -హరీష్ రావు
బేషజాలకు పోయి మా గొంతు నొక్కితే ప్రభుత్వానికే నష్టం –హరీష్ రావు
మా గొంతు నొక్కగలరు కానీ..ప్రజల గొంతు నొక్కలేరు -హరీష్ రావు
అప్పుల గురించి చెప్పారు..మేం సృష్టించిన ఆస్తుల గురించి చెప్పలేదు
సీతారామ మీద 8 వేల కోట్లు, పాలమూరు లిఫ్ట్ పై 4 వేల కోట్లు ఖర్చు చేశాం
కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద 90 వేల కోట్లు, మిషన్ భగీరథకు 35 వేల కోట్లు ఖర్చు
రైతుబంధు 72 వేల కోట్లు ఇచ్చాం -హరీష్ రావు

రైతుబంధు 72 వేల కోట్లు ఇచ్చాం -హరీష్ రావు
ముఖ్యమంత్రి నోటికొచ్చినట్టు మాట్లాడటం సబబా? -హరీష్ రావు
సీఎం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి సమయం ఇవ్వండి -హరీష్ రావు
ఓఆర్ఆర్ ప్రభుత్వానిదే..ఎవరికి అమ్మలేదు -హరీష్ రావు
భూములమ్మి రూ.24 వేల కోట్లు సమకూర్చుకుంటామన్నారు..సమాధానం చెప్పాలి
పాలమూరు, రంగారెడ్డి కరువు, వలసలకు..
రేవంత్ రెడ్డి గతంలో ఉన్న టీడీపీ, ఇప్పుడున్న కాంగ్రెస్ కారణం
గత ప్రభుత్వం అనేక ఆస్తుల కల్పన చేసింది -హరీష్ రావు
ప్రతి ద్రోహం నమ్మకంతోనే మొదలవుతుందని మార్టిన్ లూథర్ కింగ్ అన్నారు
లూథర్ కింగ్ మాట కాంగ్రెస్ ప్రభుత్వానికి సరిగ్గా సరిపోతుంది -హరీష్ రావు
ఆరు గ్యారంటీల అమలు గాలికి వదిలేశారు -హరీష్ రావు
రాహుల్ గాంధీతో చెప్పించి..పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ లీడర్ గ్యారంటీ కార్డ్ ఇచ్చారు
వంద రోజుల్లో గ్యారంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ ఇచ్చారు
సోనియాగాంధీతో కూడా తెలంగాణ ప్రజలకు లేఖ రాయించారు
సోనియమ్మ గౌరవం పోగొట్టారు..రాహుల్ పరువు తీశారు -హరీష్ రావు
సీఎం రేవంత్ రెడ్డి రాక్షస భాష చూసి జనం భయపడుతున్నారు
ఆరు గ్యారంటీల అమలు గురించి ప్రజలు ఇంకేం అడుగుతారు?
భాష మార్చుకుంటానని రేవంత్ సభావేదిక సాక్షిగా చెప్పారు
గ్రూప్-2 వాయిదా వేయాలని సన్నాసులు అడుగుతున్నారని సీఎం అన్నారు
మూడు రోజులకే ప్రభుత్వం గ్రూప్-2 వాయిదా వేసింది..ఎవరు సన్నాసులు?
మోతీలాల్ ఏ పరీక్ష రాయడం లేదంటే..ఆయన 3 హాల్ టికెట్లు బయటపెట్టాడు
ముఖ్యమంత్రి కుర్చీకి గౌరవం పోగొట్టొద్దని కోరుకుంటున్నాం -హరీష్ రావు
రేవంత్ రెడ్డి రూ.50కోట్లకు పీసీసీ అధ్యక్ష పదవి కొనుక్కున్నారని కోమటిరెడ్డే చెప్పారు
మాట తప్పినందుకు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది -హరీష్ రావు
బడ్జెట్ ప్రసంగం మొదట్లోనే ప్రజలను క్షమాపణ కోరాల్సింది -హరీష్ రావు
ఆరు గ్యారంటీలకు ఓటాన్ అకౌంట్లో రూ.53 వేల కోట్లు, పూర్తి బడ్జెట్లో రూ.47 వేల కోట్లు
ఆరు గ్యారంటీల్లోని 13 హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
అన్ని వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది -హరీష్ రావు
కాంగ్రెస్ పార్టీయే పెద్ద ధోకా -హరీష్ రావు
మహాలక్ష్మి పథకానికి బడ్జెట్లో నిధులు కేటాయించలేదు -హరీష్ రావు
రూ.500 గ్యాస్ సిలిండర్ పథకంలో అనేక ఆంక్షలు పెట్టారు
తెల్ల రేషన్ కార్డుదారులందరికి రూ.500 గ్యాస్ సిలిండర్ ఇవ్వాలి
కొత్త బస్సులు కొనండి..సర్వీసులు పెంచండి -హరీష్ రావు
పంట కాలానికి ముందే రైతుభరోసా ఇవ్వాలి -హరీష్ రావు
52 లక్షల మంది ఉపాధి హామీ కూలీలందరికి ఏడాదికి రూ.12 వేలు ఇవ్వాలి
సన్నవడ్లకే బోనస్ ఇస్తామని సన్నాయి నొక్కులు -హరీష్ రావు
రాష్ట్రంలో పండే వడ్లలో 90 శాతం దొడ్డురకమే -హరీష్ రావు
మేనిఫెస్టోలో చెప్పినట్టు అన్నిరకాల పంటలకు బోనస్ ఇవ్వాలి
90 లక్షల తెల్లరేషన్ కార్డుదారులున్నారు -హరీష్ రావు
తెల్లరేషన్ కార్డుదారులందరికి 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇవ్వాలి
యువ వికాసానికి ఎలాంటి హామీ లేదు -హరీష్ రావు
కాంగ్రెస్ ఆరో గ్యారంటీ చేయూత పథకం ఊసేలేదు -హరీష్ రావు
4 వేల పింఛన్ సంగతి దేవుడెరుగు..ఇచ్చే 2 వేలు కూడా సరిగ్గా ఇవ్వడం లేదు
ఇప్పటికే 3 నెలల పింఛన్ ప్రభుత్వం బాకీ ఉంది -హరీష్ రావు
చేతగానమ్మకు మాటలెక్కువని భట్టి అన్న మాట కాంగ్రెస్కే వర్తిస్తుంది -హరీష్ రావు
సిటీ సెంట్రల్ లైబ్రరీలో విద్యార్థులపై పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారు
రేవంత్ ప్రజాపాలన ప్రతాపం చూసి కాళోజీ ఆత్మ ఘోషించి ఉంటుంది
నిరుద్యోగులపై ఎక్కడికక్కడ పోలీసుల దాడులు -హరీష్ రావు
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఘోరంగా దెబ్బతిన్నది -హరీష్ రావు
ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 500 హత్యలు, 1800 అత్యాచారాలు జరిగాయి
హైదరాబాద్ నగరంలోనే మహిళలకు భద్రత లేదు -హరీష్ రావు
రాత్రి 10 గంటలకే హైదరాబాద్లో దుకాణాలు బంద్ చేస్తున్నారు
పోలీసులు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు -హరీష్ రావు
8 నెలల్లోనే లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి -హరీష్ రావు
ప్రతివారం సీఎం ప్రజలను కలుస్తారని రాహుల్ గాంధీ చెప్పారు
మొదటి రోజు తప్ప సీఎం మళ్లీ అక్కడ కనిపించలేదు -హరీష్ రావు

బీసీలకు ఐదేళ్లలో లక్ష కోట్లు ఖర్చు చేస్తామని ఈ బడ్జెట్లో 9 వేల కోట్లు పెట్టారు
రాష్ట్రంలో 14 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు
ఎంబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఊసులేదు -హరీష్ రావు
బడేబాయ్ బాటలో చోటేబాయ్ నడుస్తున్నారు -హరీష్ రావు
కాంగ్రెస్ మైనారిటీలకు ఎంపీ, మంత్రి పదవులు ఇవ్వలేదు
కొత్త నియామకాలకు, ఉద్యోగులకు కేటాయింపులు లేవు
గ్రూప్-2లో గతంలో వైయస్, ఏపీలో జగన్ పోస్టులు పెంచారు..లీగల్ సమస్య రాలేదు
గ్రూప్-2 పోస్టులు పెంచాలి, గ్రూప్-1లో 1:100 అవకాశం ఇవ్వాలి
నిరుద్యోగ భృతి ఎప్పటినుంచి ఇస్తారో చెప్పండి
మొన్న చంద్రబాబు కూడా కేసీఆర్ హైదరాబాద్ను అభివృద్ధి చేశారని చెప్పారు
అభివృద్ధి చేసినందుకే హైదరాబాద్లో అన్ని సీట్లు గెలిచాం -హరీష్ రావు

అప్పులు, ఆస్తులు, బడ్జెట్ వాస్తవాలపై అసెంబ్లీలో మాజీ మంత్రి హరీష్ రావు కూలంకషంగా చెప్పిన లెక్కలు

అప్పులు:
బిఆర్ఎస్ ప్రభుత్వం 6,71,757 కోట్లు అప్పు చేసిందని పదే పేద చెబుతున్నరు.
డిసెంబర్ 23నాడు మీరు విడుదల చేసిన శ్వేత పత్రంలో నాలుగు రకాల అప్పులు చూపించారు.
రెండు రకాల అప్పులు ప్రభుత్వం చెల్లించాల్సిన అవసరం లేదని, శ్వేత పత్రలో క్లియర్ గా మెన్షన్ చేశారు.
మీరు ఇచ్చిన శ్వేతపత్రంలోనే గవర్నమెంట్ హామి లేనివి, గవర్నమెంట్ కట్టనివి 59,414 కోట్లు అని చెప్పారు.
గవర్నమెంట్ హామి ఉండి, గవర్నమెంట్ కట్టవలసిన అవసరం లేనివి 95,462కోట్లు అని చెప్పారు.
అంటే గవర్నమెంట్ కట్టవల్సిన అవసరం లేని అప్పులు 1,54,876కోట్లు.
మీరు చెప్పిన 6,71,757 కోట్ల అప్పుల నుండి గవర్నమెంట్ కట్టవల్సిన అవసరం లేని 1,54,876 కోట్లను తీసేస్తే మిగిలిన అప్పు 5,16,881 కోట్లు.
మీరు ఇచ్చిన శ్వేతపత్రలో రాష్ట్రం ఏర్పడే నాటికి 72,658కోట్ల అప్పు తెలంగాణకు గత ప్రభుత్వాల నుంచి సంక్రమించింది అని చెప్పారు.
5,16,881 కోట్ల ప్రభుత్వం కట్టవల్సిన అప్పు నుంచి వారసత్వంగా వచ్చిన 72,658 కోట్ల అప్పును తీసివేస్తే 4,44,223 కోట్ల అప్పు ఉంటుంది.
తెలంగాణ ఏర్పడక ముందు ఎస్పీవీ (స్పెషల్ పర్పస్ వెహికిల్స్)ల ద్వారా గత ప్రభుత్వాలు చేసిన అప్పు 11,609కోట్లు.
ఈ మొత్తాన్ని కూడా 4,44,223 కోట్ల నుంచి తీసివేస్తే, 4,32,614 కోట్లు మిగులుతుంది.
మీరు శ్వేతపత్రంలో ఎఫ్ఆర్బిఎం అప్పులు మార్చి 31, 2024 వరకు ఉన్న బడ్జెట్ ఎస్టిమేట్స్ ను తీసుకున్నారు.
శ్వేతపత్రం డిసెంబర్ లోనే విడుదల చేశారనేది మనందరికి తెలిసిందే. ఈ శ్వేతపత్రంలో తెలివిగా కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న 6,115 కోట్ల అప్పును బిఆర్ఎస్ ఖాతాలో జమ చేశారు.
కాంగ్రెస్ తీసుకున్న 6,115 కోట్లను, 4,32,614 నుంచి తీసివేస్తే 4,26,499 కోట్ల అప్పు మిగులుతుంది.
అంటే తొమ్మిదిన్నరేళ్ల కాలంలో బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు 4,26,499 కోట్లు మాత్రమే. కానీ పదే పదే 6,71,757 కోట్లు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
అధ్యక్షా.. కేంద్ర ప్రభుత్వం ఉదయ్ అనే స్కీం తీసుకువచ్చి డిస్కంల అప్పులను రాష్ట్ర ప్రభుత్వం టేకోవర్ చేయాలని చట్టం చేయడం వలన 9వేల కోట్ల రూపాయల అదనపు అప్పు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సి వచ్చింది.
2019-20 15వ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లను కేంద్ర ప్రభుత్వం చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పు రూపంగా తీసుకోవాల్సిందేనని ఆదేశాలు జారీ చేయడంతో తెలంగాణ ప్రభుత్వం అనివార్యంగా 2,459కోట్ల అప్పు తీసుకోవాల్సి వచ్చింది.
కోవిడ్ మహమ్మారి దేశ, రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులను అతలాకుతలం చేశాయి అనేది అందరికీ తెలిసిన సత్యం. ఆ సందర్భంలో పన్ను రాబడిలు గణనీయంగా తగ్గడంతో కేంద్ర ప్రభుత్వం 2020-21 ఆర్థిక సంవత్సరానికి జీఎస్డీపీలో 1.75శాతం అధికంగా అప్పులు చేసే వెసులుబాటు కల్పించింది.
గ్రాంట్ల రూపంలో రాష్ట్రాలను ఆదుకోకుండా, అప్పులు తీసుకునే స్థితికి కేంద్రం నెట్టింది. అందువల్ల 17,558 కోట్ల అప్పు చేయవల్సిన అనివార్య పరిస్థితి తెలంగాణకు వచ్చింది.
అదే విధంగా కోవిడ్ కారణంగా 2021-22 సంవత్సరంలో జీఎస్డీపీలో 1శాతం అధికంగా అప్పు చేయాల్సి వచ్చింది. ఆ మొత్తం 10,784 కోట్లు
తెలంగాణ రాష్ట్రం అనివార్యంగా 41,159 కోట్ల అప్పు తీసుకోవల్సిన పరిస్థితికి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు, కోవిడ్ వలన నెట్టబడింది. ఇది ఏ ప్రభుత్వమున్నా అనివార్యంగా చేయాల్సిన అప్పు.
ఈ 41,159 కోట్ల అప్పును 4,26,499కోట్ల నుంచి తీసివేస్తే 3,85,340కోట్లుగా తేలుతుంది.
తొమ్మిదిన్నరేళ్ల బిఆర్ఎస్ పాలనలో అభివృద్ధి, మూలధన పెట్టుబడి, సంక్షేమాల కొరకు నెట్ గా చేసిన అప్పు 3,85,340కోట్లు మాత్రమే.

ఆస్తులు:
తొమ్మిదిన్నరేళ్ల బిఆర్ఎస్ పాలన తెలంగాణ రాష్ట్రానికి లక్షల కోట్ల ఆస్తులను సమకూర్చిందనే వాస్తవాలను కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే వెలుగు చూడనివ్వడం లేదు. చర్చకు రానివ్వడం లేదు.
కాళేశ్వరానికి 94,000 కోట్లతో లక్షల కోట్ల విలువైన ఆస్తులను సాధించాం.
మిషన్ భగీరథకు 28,000 కోట్లు
పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం ….27,554
సీతారామ ప్రాజెక్టు ….8056
దేవాదుల ప్రాజెక్టు 6000
సమ్మక్క సాగర్ 2000
మహబూబ్ నగర్ పెండింగ్ ప్రాజెక్టుల కోసం 4వేల కోట్లు ఖర్చు చేసి ఆరున్నర లక్షల ఎకరాలకు సాగు నీరు అందించాం.
తుమ్మిళ్ల, భక్తరామదాసు ప్రాజెక్టులు పూర్తి
ఆర్ అండ్ బీ 8200 కిలోమీటర్లు డబుల్ లైన్, 321 కి.మీ ఫోర్ లైన్, 382 బ్రిడ్జిలను బిఆర్ఎస్ ప్రభుత్వం కట్టింది.
దేవాలయాలను కట్టడానికి 2,800 కోట్లు.
రైతు బంధుకు 72,972కోట్లు
రైతు బీమా 6,800 కోట్లు
రైతు రుణమాఫీ 29వేల కోట్లు
ఉచిత కరెంట్ కు 61వేల కోట్లు
గొర్రెల పంపిణీకి 5వేల కోట్లు
ఆసరా పింఛన్లకు 61వేల కోట్లు
మీరు కూర్చుంటున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం
పటిష్టమైన భద్రత కోసం కమాండ్ కంట్రోల్ సెంటర్
జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ
జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజీ
జిల్లాకు ఒక కలెక్టరేట్
జిల్లాకు ఒక ఎస్పీ ఆఫీస్
వెయ్యి గురుకులాలు
68లక్షల మెట్రిక్ టన్నులుగా ఉన్న వరి ఉత్పత్తిని, 2కోట్ల మెట్రిక్ టన్నులకు పెంచినం.

అన్ రియలిస్టిక్ బడ్జెట్:
సెంట్రల్ గ్రాంట్స్:
2023-24కు గాను 9,729 కోట్లు గ్రాంట్ ఇన్ ఎయిడ్ గా తెలంగాణకు వచ్చింది.
2024-25 బడ్జెట్ ఎస్టిమేట్స్ లో 21,636 కోట్లు గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ గా వస్తుందని మీరు బడ్జెట్ లో పేర్కొన్నారు.
మొన్ననే కదా తెలంగాణకు సరైన సహకారం కేంద్రం అందించడం లేదని సభ తీర్మానం చేసి కేంద్రానికి పంపినం.
భట్టి గారూ.. 9 సంవత్సరాలుగా గ్రాంట్ ఇన్ ఎయిడ్ 9-10 వేల కోట్ల కంటే ఎక్కువ రావడం లేదని తమరే 2023-24 బడ్జెట్ సందర్భంగా మాట్లాడారు.
మరి ఇప్పుడు 21వేల 636 కోట్లు వస్తుందని ఎట్ల పెట్టారు.
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో 2023-24కు సీఎస్ఎస్ కింద 4,60,614కోట్లు పెడితే, ఈ ఏడాది 2024-25 గాను 5,05,978 కోట్లు పొందుపరిచారు. అంటే దేర్ ఈజ్ ఎ మార్జినల్ ఇంక్రీజ్ ఆఫ్ 45,000 కోట్లు.
అంటే దేశం మొత్తానికి 45వేల కోట్లు ఎక్కువ కేటాయించినప్పుడు, ఒక్క తెలంగాణకు 12వేల కోట్లు ఎట్ల ఎక్కువస్తది.

టాక్స్ రెవెన్యూ:
2023-24 (ఆర్.ఇ) ప్రకారం, 1,11,798 కోట్ల టాక్స్ రెవెన్యూ చూపించడం జరిగింది.
2024-25 బడ్జెట్ ఎస్టిమేట్స్ ప్రకారం, 1,38,118 కోట్ల టాక్స్ రెవెన్యూ వస్తుందని అంచనాలు వేశారు.
ఈ ఏడాది అదనంగా 26,383 కోట్ల టాక్స్ రెవెన్యూ వస్తుందని చూపించారు.
స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ద్వారా 2023-24 (ఆర్.ఇ) ప్రకారం, 14,295 కోట్లు రాబోతుందని చెప్పారు. అదే 2024-25లో 18,228 కోట్లు రాబోతుందని అంచనాలు వేశారు. ఇది గతేడాది కంటే సుమారు 4వేల కోట్ల అధికం.
దేశవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం కొనసాగుతున్న సందర్భంలో 4వేల కోట్లు డ్యూటీ అధికంగా పెంచడం వల్ల 2023-24 సంవత్సరానికి వచ్చిన 14,225 కోట్లు రావడమే కష్టసాధ్యం.
ఇలాంటి సందర్భంలో 4వేలు పెంచడం వలన పేద, మధ్య తరగతి వారు చిన్న ఫ్లాటో, ప్లాటో లేదా కొంత వ్యవసాయ భూమి కొనుగోలు చేసే వారిపై 4వేల కోట్ల అధిక భారం వేస్తున్నట్లు స్పష్టమైపోతుంది.

ఎక్సైజ్:
2023-24 బడ్జెట్ ఎస్టిమేట్స్ ప్రకారం, 19,884 కోట్ల ఆదాయాన్ని గత బిఆర్ఎస్ ప్రభుత్వం పెట్టుకుంటే, 2024-25కు గాను కాంగ్రెస్ ప్రభుత్వం 25,617 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. అంటే, 5,773 కోట్లు అదనంగా అంచనా వేసుకున్నారు.
2,760 కోట్లుగా ఉన్న బీర్లపై డ్యూటీని 3,500 కోట్లకు పెంచారు.
లిక్కర్ పై ఉన్న డ్యూటీని 11,031 కోట్ల నుంచి 15,500 కోట్లకు పెంచారు.
అంటే బీర్లు, లిక్కర్ ధరలు రాబోయే రోజుల్లో భారీగా పెంచబోతున్నట్లు స్పష్టం చేశారు.
2023-24లో ఉన్న 14,570 కోట్ల ఎక్సైజ్ వ్యాట్ ను 2024-25కు గాను 16,432 కోట్లుగా అంచనా వేశారు.
అంటే 2000 కోట్ల రూపాయల వ్యాట్ కు సమానమైన మద్యం అమ్మకాలను పెంచబోతున్నట్లు చెప్పారు.
బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మద్యం అమ్మకాలపై రాద్దాంతం చేసిన వాళ్లే, మద్యం అమ్మకం ద్వారా 7,700 కోట్ల అధిక రాబడిని సమకూర్చుకోవాలని బడ్జెట్ అంచనాలు పొందుపరిచారు.
ఒకవైపు స్టాంప్స్ అండ్ ఎక్సైజ్ ద్వారా ప్రజల నుంచి డబ్బును ముక్కు పిండి వసూలు చేస్తూ, మరోవైపు ప్రజలకు అందించే సంక్షేమ పథకాలకు బడ్జెట్ లో సరైన కేటాయింపులు చేయరు.
43లక్షల మందికి 2 వేల నుంచి 4వేల దాకా పెంచుతానన్న ఆసరా పింఛన్లు పెంచరు.
10లక్షల ఎంప్లాయి, ఉద్యోగ, పింఛనర్ల, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కు ఇవ్వవలిసిన డీఏ బకాయిలకు, పీఆర్సీకి కేటాయింపులు లేవు.
కొత్తగా ఇస్తామని చెబుతున్న 2లక్షల ప్రభుత్వ ఉద్యోగాల జీతభత్యాలకు సంబంధించిన ఎలాంటి కేటాయింపులు బడ్జెట్ లో చెయ్యరు.
ఇచ్చేది ఎగబెడుతరు. ప్రజల నుంచి లాక్కుంటరు అన్నట్లుగా ఉంది ఈ బడ్జెట్.

టాక్సెస్ ఆన్ సేల్స్ ట్రేడ్:
2023-24 బడ్జెట్ లో టాక్సెస్ ఆన్ సేల్స్ ట్రేడ్ 29,983 కోట్లుగా ఉంటే, 2024-25 బడ్జెట్ లో 33,449గా చూపించారు. 3,466 వ్యాట్ అధికంగా వసూలు అవుతుందని చెప్పారు. ఇది సాధ్యమవుతుందా?
నాన్ టాక్స్ రెవెన్యూ:
2023-24 బడ్జెట్ లో 23,819 కోట్లుగా ఉన్న నాన్ టాక్స్ రెవెన్యూ 2024-25 కి గాను 35,208 కోట్లుగా చూపించారు.
11,389 కోట్ల నాన్ టాక్స్ రెవెన్యూ అధికంగా రాబోతున్నట్లు లెక్కలు వేశారు.
ఇందులో 10వేల కోట్లు భూముల అమ్మకం ద్వారా వస్తాయన్నారు. 14వేల కోట్లు అడిషనల్ రిసోర్స్ మొబిలైజేషన్ అని పేర్కొన్నారు. అసలు ఈ అడిషనల్ రిసోర్స్ మొబిలైజేషన్ అంటే ఏంటి. ఇదేం బ్రహ్మ పదార్థం. అసెంబ్లీకి కూడా చెప్పనంత గోప్యంత ఏమిటి?
మేము భూములను అమ్మితే అమ్మకూడదు అన్నారు. మీరు 24వేల కోట్లు భూముల అమ్మి సమకూర్చుకోబోతున్నట్లు చెబుతున్నరు.

వాస్తవానికి దూరంగా:
నాన్ టాక్స్ రెవెన్యూ 11,389 కోట్లు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ 12వేల కోట్లు. టాక్స్ రెవెన్యూ 26,383 కోట్లు. మొత్తం కలిపి సుమారు 50వేల కోట్లు అధికంగా చూపించారు.
ఇందులో 10, 20 వేల కోట్లు దాటి నిధులు సమీకరించే అవకాశం లేదు.
వాస్తవిక బడ్జెట్ అని బ్రమలు కల్పిస్తూ సుమారు 30వేల కోట్లు అధికంగా ఆదాయం వస్తుందని చూపించారు.
ఒకవైపు ఆదాయం ఎక్కువ వస్తుందని చూపి మరోవైపు ఖర్చులు తక్కువ చేసి చూపించారు.

రుణమాఫీ:
రుణమాఫీ విషయంలో పూటకో మాట చెప్పిన్రు. ఒకసారి 40వేల కోట్లు అని, మరోసారి 35వేల కోట్లని, ఇంకోసారి 31వేల కోట్లని చెప్పారు.
రుణమాఫీ అర్హత నుంచి లబ్ధిదారులను సాధ్యమైనంతగా తొలగించే విధంగా వ్యవహరిస్తున్నరు.
రేషన్ కార్డు, పీఎం కిసాన్, ఎన్పీఏ వంటి కండీషన్స్ పెట్టి అర్హులను గణనీయంగా కుదిస్తున్నరు.
రుణమాఫీ పథకం అమలుకు ప్రారంభ తేదీగా డిసెంబర్9 2018గా పెట్టడం ఎంత వరకు సమంజసం.
డిసెంబర్ 9న చేస్తానన్న రుణమాఫీని సకాలంలో చేయకపోగా, ఈ ఎనిమిది నెలల వడ్డీని రైతునే కట్టుకోమనడం దుర్మార్గమైన చర్య.
బడ్జెట్ లో రుణమాఫీ కొరకు కేటాయించుకున్న నిదులు 26వేల కోట్లు మాత్రమే. మీరు చెప్పిన 31వేల కోట్ల కంటే ఇది 5వేల కోట్లు తక్కువ.
ఇంట్రెస్ట్ పేమెంట్స్:
గతేడాది ఇంట్రెస్ట్ పేమెంట్స్ 23,337 కోట్లుగా ఉంటే, ఈ ఏడాది 17,729 కోట్లుగా చూపించారు.

అగ్రికల్చర్ లేబర్:
రైతు భరోసా కింద వ్యవసాయ కూలీలకు గాను 1200 కోట్లు కేటాయించడం అనేది చాలా తక్కువ. ఏ మూలకు సరిపోదు.

ఆరోగ్య శ్రీ:
ఆరోగ్యశ్రీకి 2023-24 కు గాను 1,101 కోట్లు కేటాయిస్తే, ఈ ఏడాది బడ్జెట్ లో 1,065 కోట్లు కేటాయించారు.
ఆరోగ్య శ్రీ పరిధిని 5లక్షల నుంచి 10లక్షలకు పెంచామని, కొత్త రోగాలు యాడ్ చేశామని, రేట్లు 20శాతం పెంచామని చెబుతూ బడ్జెట్ ను మాత్రం 36కోట్లు తగ్గించారు. ఇదెట్లా సాధ్యం.
కేసీఆర్ కిట్ అనేది మంచి పథకం. దాన్ని కూడా తొలగించారు.
కేసీఆర్ కిట్ పథకం వల్ల ఎంఎంఆర్, ఐఎంఆర్ గణనీయంగా తగ్గింది. దేశంలో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది.
భట్టి గారిని కోరడం ఏమిటంటే…
వైఎస్ గారు ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ, ఫీజు రియెంబర్స్ మెంట్, 108 అనేవి మంచి పథకాలు అని, పేర్లు కూడా మార్చకుండా కొనసాగిస్తామని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇదే సభలో చెప్పారు.
కానీ మీరు ఆ మాగ్నానిటీని ప్రదర్శించకుండా పథకాలు రద్దు చేయడం వల్ల పేద గర్బిణీల మీద, రాష్ట్ర భవిష్యత్తు మీద ఎంతో ప్రభావం చూపుతుంది.
మీకు అంతగా కావాలంటే, భేషజాలు ఉంటే పథకాల పేర్లు మార్చుకోండి కాని దయచేసి పథకాలు ఆపకండి.
పుట్టబోయే బిడ్డల భవిష్యత్తు పై దెబ్బ కొట్టకండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X