హైదరాబాద్ : విద్యుత్ రంగంపై అసత్య ప్రచారాలు సరికాదని గెజిటెడ్ ఆఫీసర్స్ అండ్ రిటైర్డ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ హితవు పలికింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయకులు పవర్ కోటేశ్వరరావు, రామకృష్ణ, హనుమంత నాయక్, శంకర్ మాట్లాడారు. ప్రభుత్వాన్ని ఉద్దేశపూర్వకంగా విమర్శించేందుకు విద్యుత్ రంగాన్ని వాడుకుంటున్నారని మండిపడ్డారు.
గత పదేళ్లుగా ఏ విధంగానైతే ప్రజలకు సేవలందించామో అదే తరహాలో ఇప్పటికి సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. నిర్వహణలో భాగంగా కొద్ది మేర అంతరాయం ఉన్నవాళ్లు వాస్తవమేనని దానిని విద్యుత్ కోతలంటూ బీఆర్ఎస్ నాయకులు విమర్శలు గుప్పించడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా విద్యుత్ రంగంపై అసత్య ప్రచారం చేయడంతో విద్యుత్ సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగులను అఘోర చేయడంతో విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులను అగౌరవ పరుస్తున్నారని అన్నారు. ఇలాంటివి మానుకోకపోతే విద్యుత్ ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. (ఏజెన్సీలు)
ఇది కూడా చదవండి-