हैदराबाद/नई दिल्ली : कांग्रेस सांसद राहुल गांधी ने साफ कर दिया है कि लोकसभा में बजट पर बहस के दौरान उन्होंने जो बातें कहीं, उन पर कायम हैं और रहेंगे। राहुल ने आगे कहा कि अगर उनके खिलाफ अधिकार प्रस्ताव भी पास हो जाए तो भी वे पीछे नहीं हटेंगे। उन्होंने गुरुवार को इस बारे में एक वीडियो जारी किया। राहुल ने कहा कि उन्होंने जो कुछ कहा है वह सच और आगे भी कहते रहेंगे।

राहुल गांधी ने बुधवार को लोकसभा में हुई बजट बहस में अमेरिका के साथ ट्रेड डील की कड़ी आलोचना की। अमेरिका के साथ ट्रेड डील में कोई लॉजिक नहीं है। भारत बिना किसी बराबरी के फायदे लिए झुक गया है। सवाल किया कि अमेरिका ईरान, रूस या कहीं और से तेल खरीदने का फैसला कैसे कर सकता है? आपने भारत माता को बेच दिया है। आपको शर्म आनी चाहिए। मोदी अमेरिकी दबाव में झुक गए हैं। आपने देश को बेच दिया है। आपने भारत की एनर्जी सिक्योरिटी अमेरिका को सौंप दी है। आपने किसानों के हितों से समझौता किया है।

इस बीच, बीजेपी नेताओं ने राहुल की टिप्पणियों पर कड़ी आपत्ति जताई है। बीजेपी सांसद निशिकांत दुबे ने जॉर्ज सोरोस जैसी ताकतों की मदद से देश को गुमराह करने के लिए राहुल गांधी की आलोचना की। गुरुवार को लोकसभा में एक ‘सब्सटेंशियल मोशन’ फाइल कर दिया, जिसमें मांग की गई कि न सिर्फ राहुल गांधी की पार्लियामेंट की मेंबरशिप खत्म की जाए, बल्कि उन पर लाइफटाइम के लिए चुनाव लड़ने पर भी बैन लगाया जाए। इसके कुछ ही देर बाद राहुल ने जवाब दिया। उन्होंने सोशल मीडिया ‘X’ पर एक वीडियो शेयर करते हुए कहा कि उनके खिलाफ अधिकारों का कोई भी प्रस्ताव पास हो, वह सच बोलेंगे और पीछे नहीं हटेंगे। (एजेंसियां)
यह भी पढ़ें-
సభా హక్కుల తీర్మానం చేసినా వెనక్కి తగ్గను : రాహుల్ గాంధీ (వీడియో)
హైదరాబాద్/న్యూఢిల్లీ : లోక్‌సభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా తాను మాట్లాడిన మాటలకు కట్టుబడి ఉంటానని కాంగ్రెస్ ఎంపీ స్పష్టం చేశారు. తనపై సభా హక్కుల తీర్మానం పెట్టినా వెనుకంజ వేసేది లేదని తేల్చి చెప్పారు. ఈ మేరకు గురువారం నాడు ఒక వీడియోను ఆయన విడుదల చేశారు. తాను నిజమే చెప్పానని, చెబుతూనే ఉంటానని రాహుల్ పేర్కొన్నారు.
Also Read-
అమెరికాతో వాణిజ్య ఒప్పందం గురించి రాహుల్ గాంధీ లోక్‌సభలో బుధవారం నాడు జరిగిన బడ్జెట్ చర్చలో తీవ్ర విమర్శలు చేశారు. ‘అమెరికాతో ట్రేడ్ డీల్‌లో ఎలాంటి లాజిక్ లేదు. భారత్ ఎలాంటి దామాషా ప్రయోజనాలు పొందకుండానే సాగిలపడింది. ఇరాన్ నుంచో, రష్యా నుంచో, మరో చోట నుంచో చమురు కొనుగోలు చేయాలని అమెరికా ఎలా నిర్ణయిస్తుంది? మీరు భరతమాతను అమ్మేశారు. మీరు సిగ్గుపడాలి. అమెరికా ఒత్తిడితో మోదీ వణికిపోయారు. దేశాన్ని అమ్మేశారు. భారతదేశ ఇంధన భద్రతను అమెరికాకు అప్పగించారు. రైతుల ప్రయోజనాల విషయంలో రాజీపడ్డారు’ అని రాహుల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కాగా, రాహుల్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జార్జ్ సోరోస్ వంటి శక్తుల సహాయంతో రాహుల్ గాంధీ దేశాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే విమర్శించారు. రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయడమే కాకుండా, జీవితాంతం ఆయన ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని డిమాండ్ చేస్తూ లోక్‌సభలో గురువారం నాడు ‘సబ్‌స్టాంటివ్ మోషన్’ దాఖలు చేశారు. ఆ కొద్దిసేపటికే రాహుల్ స్పందించారు. తనపై ఎలాంటి హక్కుల తీర్మానం పెట్టినా నిజమే చెబుతానని, వెనుకంజ వేసేది లేదని సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో వీడియో షేర్ చేశారు. (ఏజెన్సీలు)
