कर्रेगुट्टा में भीषण एनकाउंटर, पांच माओवादी मारे गए, सामने आ रहे हैं इनके नाम కర్రెగుట్టల్లో భారీ ఎన్‌కౌంట‌ర్‌

हैदराबाद: तेलंगाना-छत्तीसगढ़ बॉर्डर पर घने जंगल के कर्रेगुट्टा में गुरुवार सुबह भीषण मुठभेड़ हुआ। शुरुआती मिली जानकारी के अनुसार सिक्योरिटी फोर्स और माओवादियों के बीच इस भीषण फायरिंग में अब तक पांच माओवादी मारे गए हैं। अधिकारियों का मानना ​​है कि मरने वालों की संख्या बढ़ सकती है।

केंद्र सरकार के ‘नक्सल-फ्री इंडिया’ के लक्ष्य के तहत चलाए गए ‘ऑपरेशन कगार-2’ के तहत कॉबिंग ऑपरेशन चल रहा था। इसी के तरह सुबह मुठभेड़ शुरू हो गई। कर्रेगुट्टा माओवादियों का एक अहम गढ़ माना गया है। इसलिए पक्की जानकारी मिलने पर सीआरपीएफ, कोबरा, ग्रेहाउंड्स और डीआरजी फोर्स ने मिलकर यह संयुक्त ऑपरेशन शुरू किया। इस ऑपरेशन में करीब पांच हजार सिक्योरिटी के जवान शामिल हैं।

फोर्स जंगल में कॉबिंग कर रही है। सुरक्षा बलों को जानकारी मिली है कि माओवादी नेता देवजी और बड़े चोक्का राव जैसे माओवादी पार्टी के टॉप लीडर इस इलाके में पनाह लिए हुए हैं। सुबह-सुबह फोर्स का माओवादियों से सामना हुआ और दोनों तरफ से फायरिंग शुरू हो गई।

खबर है कि जंगल के अंदर अभी भी फायरिंग जारी है। हालांकि, मारे गए पांच माओवादियों की पहचान अभी तक नहीं हो पाई है। पता चला है कि एनकाउंटर में मौके से बड़ी संख्या में हथियार और क्रांतिकारी साहित्य बरामद किया गया है।

यह भी पढ़ें-

కర్రెగుట్టల్లో ఎన్‌కౌంట‌ర్‌, ఐదుగురు మావోయిస్టులు మృతి

హైదరాబాద్ : తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని దట్టమైన అటవీ ప్రాంతమైన కర్రెగుట్టల్లో గురువారం ఉదయం భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. భద్రతా దళాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఈ భీకర ఎదురుకాల్పుల్లో ఇప్పటి వరకు ఐదుగురు మావోయిస్టులు మరణించినట్లుగా ప్రాథమిక సమాచారం అందుతోంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న ‘నక్సల్ రహిత భారత్’ లక్ష్యంలో భాగంగా చేపట్టిన ‘ఆపరేషన్ కగార్-2’లో భాగంగా కూబింగ్ ఆపరేషన్ చేపడుతుండగా ఇవాళ తెల్లవారుజామున ఎదురు కాల్పులు ప్రారంభమయ్యాయి. కర్రెగుట్టలు మావోయిస్టులకు కీలకమైన స్థావరం కావడంతో పక్కా సమాచారంతో సీఆర్‌పీఎఫ్, కోబ్రా, గ్రేహౌండ్స్, డీఆర్జీ దళాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ను చేపట్టాయి. సుమారు 5 వేల మంది భద్రతా సిబ్బంది ఈ ఆపరేషన్‌లో పాల్గొంటున్నారు.

మావోయిస్టు పార్టీ అగ్రనేతలు దేవ్‌జీ, బడే చొక్కారావు వంటి వారు ఈ ప్రాంతంలోనే తలదాచుకున్నారన్న సమాచారంతో బలగాలు అడవిని జల్లెడ పడుతున్నాయి. తెల్లవారుజామున బలగాలకు మావోయిస్టులు తారసపడటంతో ఇరువర్గాల మధ్య కాల్పులు మొదలయ్యాయి.

అడవి లోపల ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్లుగా సమాచారం. అయితే, మరణించిన ఐదుగురు మావోయిస్టుల గుర్తింపు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ మేరకు ఎన్‌కౌంటర్‌లో స్పాట్‌లో భారీగా ఆయుధాలు, విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X