జె.ఎన్.ఏ.ఎఫ్.ఏ.యూకి భూ కేటాయింపులను వ్యతిరేకిస్తూ అంబేద్కర్ వర్శీటీలో కొనసాగుతున్న నిరసనలు
హైదరాబాద్ : డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ పది ఎకరాల స్థలాన్ని జవహర్ లాల్ నెహ్రు అర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయానికి (జె.ఎన్.ఏ.ఎఫ్.ఏ.యూ) కేటాయించాలనే ప్రభుత్వ ఆలోచనను నిరసిస్తూ అంబేద్కర్ వర్షీటీ ఐక్య కార్యాచరణ సమితి సభ్యులు నిరసనను కొనసాగించారు. అధ్యాపక, అధ్యాపకేతర, ఉద్యోగ సంఘాల నేతలు శనివారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో విశ్వవిద్యాలయంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ప్రదర్శన చేశారు. ఇంఛార్జ్ వీసీ విశ్వవిద్యాలయానికి వచ్చి ఈ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు.
Also Read-
ఈ నిరసన కార్యక్రమంలో జేఎసే కన్వీనర్ ప్రొ. వడ్డాణం శ్రీనివాస్; డా. డి. రాబింద్రనాథ్ సోలమన్ మాట్లాడతూ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ప్రకారం ఏ విశ్వవిద్యాలయానికి అయినా కనీసం 60-100 ఎకరాలు ఉండాలని పేర్కొన్నారు. జేఎసీ సెక్రటరీ జనరల్ డా. పి. వేణుగోపాల్ రెడ్డి; ప్రొ. జి.పుష్పా చక్రపాణి; ప్రొ. చంద్రకళ; డా. ప్రమీల కేతవత్; డా. బి. శ్రీనివాస్; రజనికాంత్; రాములు; డా. అవినాష్; డా. కిషోర్; అధ్యాపక, అధ్యాపకేతర, అడ్మినిస్ట్రేటివ్, టెక్నికల్ అసోసియేషన్; టైం స్కేల్, ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.