हैदराबाद: बुधवार (10 दिसंबर) को 65 नई इलेक्ट्रिक बसें महानगरों की सड़कों पर दौड़ेंगी। ईवी ट्रांस द्वारा चलाई जाने वाली इन बसों को रानीगंज डिपो में केंद्रीय मंत्री जी. किशन रेड्डी, मंत्री पोन्नम प्रभाकर, हैदराबाद शहर की मेयर गदवाल विजयलक्ष्मी, TGRTC MD वाई नागी रेड्डी, स्थानीय जनप्रतिनिधि, अधिकारी और अनऑफिशियल प्रतिनिधियों की मौजूदगी में हरी झेंडी दिखाया जाएगा। बसों का लॉन्च सुबह 10 बजे होगा।
मालूम हो कि हैदराबाद शहर में कई रूट पर पहले से ही इलेक्ट्रिक बसें चल रही हैं। आरटीसी शहर में दिन-ब-दिन बढ़ते प्रदूषण को कम करने के मकसद से कई रूट पर इलेक्ट्रिक बसें चला रहा है। तेलंगाना सरकार ने ग्रेटर हैदराबाद में प्रदूषण मुक्त पब्लिक ट्रांसपोर्ट सिस्टम के लिए आरटीसी को 2027 तक ओआरआर इलाके में 2,800 इलेक्ट्रिक बसें चलाने का आदेश दिया है। यह फैसला एयर पॉल्यूशन और ट्रैफिक की समस्याओं को कम करने और एक साफ और ग्रीन ट्रांसपोर्ट सिस्टम चलाने के लिए लिया गया है। सरकार को उम्मीद है कि इन बसों के इस्तेमाल से व्यक्तिगत वाहनों की खरीद कम होगी और पब्लिक ट्रांसपोर्ट का इस्तेमाल बढ़ेगा। ग्रेटर हैदराबाद में अभी 25 डिपो हैं। इनमें से 6 डिपो में 265 इलेक्ट्रिक बसें चल रही हैं।
इस साल और 275 इलेक्ट्रिक बसें उपलब्ध कराई जा रही हैं। हर डिपो में 8 करोड़ रुपये की लागत से फुल चार्जिंग के लिए एचटी कनेक्शन TGSPDCL और ट्रान को के जरिए ने बनाए गये हैं। कंपनी नई इलेक्ट्रिक बसों के लिए 19 डिपो में चार्जिंग एचटी कनेक्शन लगाएगी। यह पब्लिक ट्रांसपोर्ट को बढ़ाने के लिए 10 नए डिपो और 10 चार्जिंग स्टेशन भी बनाएगी। TGSRTC अधिकारियों का अनुमान है कि इस इंफ्रास्ट्रक्चर पर आने वाले साल में 392 करोड़ रुपये खर्च होंगे।
Also Read-
హైదరాబాద్ లో రోడ్డెక్కనున్న ఎలక్ట్రిక్ బస్సులు
హైదరాబాద్ : బుధవారం (డిసెంబర్ 10) నాడు 65 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డెక్కనున్నాయి. ఈవీ ట్రాన్స్ సంస్థ నిర్వహణలో నడిచే ఈ బస్సులను రాణిగంజ్ డిపోలో కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, టీజీఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి , స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు అనధికార ప్రజా ప్రతినిధుల సమక్షంలో ప్రారంభించనున్నారు. ఉదయం 10 గంటలకు బస్సుల ప్రారంభ కార్యక్రమం జరుగుతుంది.
ఇప్పటికే హైదరాబాద్ నగరంలోని పలు రూట్లలో ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్న విషయం తెలిసిందే. నగరంలో రోజు రోజుకు పెరిగిపోతున్న కాలుష్యాన్ని తగ్గించాలనే లక్ష్యంతో ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ పలు రూట్లలో నడుపుతోంది. గ్రేటర్ హైదరాబాద్లో కాలుష్యరహిత ప్రజా రవాణా వ్యవస్థ కోసం 2027 నాటికి ఓఆర్ఆర్ పరిధిలో 2,800 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలని ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. వాయు కాలుష్యం, ట్రాఫిక్ సమస్యలను తగ్గించి, క్లీన్ అండ్ గ్రీన్ రవాణా వ్యవస్థను నడిపేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ బస్సుల వినియోగంతో వ్యక్తిగత వాహన కొనుగోళ్లు తగ్గి, ప్రజా రవాణా వాడకం పెరుగుతుందని ప్రభుత్వం ఆశిస్తున్నది. గ్రేటర్ పరిధిలో ప్రస్తుతం 25 డిపోలు ఉన్నాయి. వీటిలో 6 డిపోల పరిధిలో 265 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి.
ఈ ఏడాది మరో 275 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తున్నాయి. ఒక్కో డిపోలో రూ.8 కోట్ల వ్యయంతో పూర్తి చార్జింగ్ కోసం హెచ్టీ కనెక్షన్లను టీజీఎస్పీడీసీఎల్, ట్రాన్కో ద్వారా నిర్మించింది. కొత్త ఎలక్ట్రిక్ బస్సుల కోసం 19 డిపోల్లో చార్జింగ్ హెచ్టీ కనెక్షన్లను సంస్థ ఏర్పాటు చేయనుంది. అలాగే ప్రజా రవాణా విస్తరణకు కొత్తగా 10 డిపోలు, 10 చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తుంది. ఈ మౌలిక సదుపాయాలకు రానున్న సంవత్సరంలో రూ.392 కోట్ల వ్యయమవుతుందని టీజీఎస్ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. (ఏజెన్సీలు)
