Hyderabad: Dr. B. R. Ambedkar Open University (BRAOU), Faculty of Social Sciences, Department of Political Science in collaboration with Telangana State Council for Higher Education (TSCHE) organized a Two Day International Conference on “Tribal Livelihood Patterns : Issues and Strategies for Empowerment” at the University Campus on August 8, 2024.
Dr. Dasari Anasuya Seethakka, Hob’ble Minister of Panchayati Raj & Rural Development, Government of Telangana was the chief guest for the Inaugural function of Two Day International Conference. Minister Seethakka said revealed that she is proud to be a tribal child. She made it clear that Adivasis are a race that does not trouble anyone. It is said that the tribals have been fighting for their self-respect for the last few years and the fight is still going on. Intellectuals on the solution and empowerment of tribals should hold such conferences and give suggestions and advice to the governments for the solution of the problems. She discuss with Chief Minister Sri A.Revanth Reddy and work for the solution of the problems of the tribals. She expressed his concern that the society has been developing in one direction for the last few decades and the rural areas, especially the tribal areas, have not progressed much. The Minister stated that along with the governments, corporate organizations should also work towards the development of rural areas and many corporate organizations are also coming forward for the programs undertaken by their government, which is a welcome development.
Prof. G. Haragopal, Former Dean, School of Social Sciences, University of Hyderabad was the keynote addressee for the program. He recollected his long association with the tribals and their issues. Shared his experiences of his visits to tribal villages to investigate the issues emerged time to time. He expressed his concern that in any model of development, tribals are locked and there is no key either from outside or inside. There is always a conflict between the interests of governments and tribals, and it is the tribals who loose here. Tribals struggles arose with the entry of East India Company who invaded forests areas with the agenda of laying of railway lines in the forest areas. Resources Exploitation lead to confrontation. Tribals are displaced in the name of development and the rulers do not have any strategy to integrate them in a development model. This is not the model of development but model of inequality. If people do not have wealth of Society, this is not humane model Prof. Haragopal pointed out. He mentioned that it is alarming there is no language of welfare but only language of growth, GDP and development everywhere. In this language where is human being. Human civilization is the process of growth of all humans but not few and conference has to discuss about all these issues and come out with the possible recommendations from this conference and he has suggested the organizers to submit out come of the conference to the Govt.
Also Read-
Prof. E. Sudha Rani, Registrar I/c, BRAOU presided over the program. She explained about the significant role of Open University in catering the educational needs of marginalized sections. She expressed that tribal communities are custodians of culture and heritage but are facing several challenges. Addressing their challenges is the responsibility of academicians and researchers and this conference will serve as a platform for discussions and deliberations on tribal issues
Guest of honor Prof. G. Pushpa Chakrapani, Director (Academic) appreciated the efforts of organizers and thanked TSCHE for collaboration and financial assistance. Stressed that we need to pay attention to the needs of tribals and address their core challenges. Traditional practices are not barely their economic activity but backbone of their culture. Tribals are facing issues like displacement and rehabilitation. Urged for collective efforts for the upliftment of tribals.
Prof. Gunti Ravinder, Conference Director, Welcomed all the participants and explained the relevance of the conference. Emphasized the role of Sri Jaipal Singh Munda in the empowerment of tribals and in struggle of reservations. Threw light on objectives, themes and subthemes of conference. He expressed that diverse perspectives on the themes in the conference are expected.
Prof. Vaddanam Srinivas, Dean, Faculty of Social Sciences, acknowledged the contribution of eminent social scientists in the development of course material of Department of Political Science. He revealed that this conference provides unique opportunity to discuss the challenges and issues of tribals and their rights. As scholars and practitioners it is our responsibility to provide innovative solutions. Prof. G. Lakshmi, Conference Co-Director Proposed vote of thanks. All Directors, Deans, Heads of the Branches, Research Scholars & Students are participated in the program.
ఆదివాసి గూడేల అభివృద్ధిదే నిజమైన అభివృద్ధి : మంత్రి సీతక్క
డా బి ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో “ఆదివాసీ జీవనోపాధి పద్ధతులు : సాధికారత సాధనలో సమస్యలు మరియు వ్యూహాలు” అనే అంశంపై 2 రోజుల అంతర్జాతీయ సదస్సు ప్రారంభం
హైదరాబాద్: దేశంలోని మారుమూల ప్రాంతాలు, ఆదివాసీ గూడేల అభివృద్ధి జరిగినప్పుడే నిజమైన అభివృద్ధి అని రాష్ట్ర మంత్రి డా. దాసరి అనసూయ సీతక్క అభిప్రాయపడ్డారు. డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, పొలిటికల్ సైన్సు విభాగం, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో “ఆదివాసీ జీవనోపాధి పద్ధతులు : సాధికారత సాధనలో సమస్యలు మరియు వ్యూహాలు” అనే అంశంపై నిర్వహిస్తున్న రెండు రోజుల అంతర్జాతీయ సదస్సును తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. దాసరి అనసూయ సీతక్క ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమే మాట్లాడుతూ ఆదివాసీ బిడ్డగా గర్వంగా ఉందని వెల్లడించారు. ఆదివాసీలు ఎవరినీ ఇబ్బంది పెట్టని జాతిగా ఆమే స్పష్టం చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆత్మగౌరవం కోసం ఆదివాసీలు పోరాటాలు చేస్తున్నారని, ఆ పోరాటం కొనసాగుతూనే ఉందని పేర్కొన్నారు. ఆదివాసీల సమస్యల పరిష్కారం, సాధికారతపై మేధావులు ఇలాంటి కాన్ఫరెన్స్ లు నిర్వహించి, సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాలకు సూచనలు, సలహాలు ఇవ్వాలని, వాటి పరిష్కారం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి ఆదివాసీల సమస్యల పరిష్కారం కోసం పనిచేద్దామని పేర్కొన్నారు. గత కొన్ని దశాబ్దాలుగా సమాజం ఒక వైపే అభివృద్ధి చెందుతోందని, గ్రామీణ ప్రాంతం, ముఖ్యంగా ఆదివాసీలు నివసించే ప్రాంతాల్లో అభివృద్ధి అంతగా జరగట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలతో పాటు కార్పొరేట్ సంస్థలు కూడా గ్రామీణ ప్రాంతాలకు అభివృద్ధి బాటులో నడుపాలని, తమ ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు పలు కార్పొరేట్ సంస్థలు కూడా ఈ మధ్య ముందుకు వస్తున్నాయని, ఇది ఆహ్వానించదగ్గ పరిణామంగా మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో ముఖ్యంగా ఏజెన్సీ ఏరియా లో అడవుల పెంపకంపై దృష్టి పెట్టాల్సిన భాద్యత అటు ప్రభుత్వాలపై ఇటు సమాజంపై ఉందని మంత్రి పిలుపునిచ్చారు.
కార్యక్రమానికి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ మాజీ డీన్, ఆచార్య. జి.హరగోపాల్ హాజరై కీలకోపన్యాసం చేశారు. ఆయన మాట్లడుతూ ఆదివాసీలతో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని, వారి సమస్యలను గుర్తు చేసుకున్నారు. ఎప్పటికప్పుడు వచ్చే సమస్యలను పరిష్కరించడానికి ఆదివాసీ గ్రామాలను సందర్శించినట్లు వెల్లడించారు. ఏ అభివృద్ధి నమూనాలోనైనా ఆదివాసీలు వెనకంజలోనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు, ఆదివాసీల ప్రయోజనాల మధ్య ఎల్లప్పుడూ వైరుధ్యం ఉంది, ఇక్కడ నష్టపోయేది గిరిజనులే. అటవీ ప్రాంతాల్లో రైల్వే లైన్లు వేయాలనే అజెండాతో అటవీ ప్రాంతాలను ఆక్రమించిన ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రవేశంతో ఆదివాసీల పోరాటాలు తలెత్తాయి. వనరుల దోపిడీ ఘర్షణకు దారి తీస్తుంది. అభివృద్ధి పేరుతో ఆదివాసీలు నిర్వాసితులవుతున్నారని, వారిని అభివృద్ధిలో భాగస్వాములను చేసే ఆలోచన పాలకులకు ఉండాలన్నారు. సామాన్య ప్రజల వద్ద సంపద లేకపోతే, ఇది మానవత్వం కాదని ప్రొ.హరగోపాల్ పేర్కొన్నారు. సంక్షేమం అనే ఆలోచన లేకపోవడం ఆందోళన కలిగిస్తోందని, అయితే ప్రతిచోటా వృద్ధి, జిడిపి మరియు అభివృద్ధి భాష మాత్రమే ఉందన్నారు. అభివృద్ధి అనేది మానవులందరి ఎదుగుదల ప్రక్రియ, కానీ కొంత మందిది మాత్రమే కాదన్నారు. ఈ సమస్యలన్నింటి గురించి ఈ కాన్ఫరెన్స్ లో చర్చించాలి. సరైన సిఫార్సులతో ప్రభుత్వానికి నివేదిక అందించాలని ఆయన నిర్వాహకులకు సూచించారు.
కార్యక్రమానికి విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ప్రొ. ఇ. సుధా రాణి అధ్యక్షత వహించారు. ఆమే మాట్లాడుతూ అట్టడుగు వర్గాల విద్య అవసరాలను తీర్చడంలో తమ విశ్వవిద్యాలయం ముఖ్యమైన పాత్ర పోషిస్తోందన్నారు. ఆదివాసీ సమాజం సవాళ్లను పరిష్కరించడం కోసం విద్యావేత్తలు, పరిశోధకులు భాద్యతగా వ్యవహరించాలని, ఆదివాసీ సమస్యలపై చర్చలకు ఇలాంటి సదస్సులు వేదికగా ఉపయోగపడుతుందన్నారు.
కార్యక్రమంలో గౌరవ అతిధులుగా పాల్గొన్న విశ్వవిద్యాలయ అకాడమిక్ డైరెక్టర్ ప్రొ. జి. పుష్ప చక్రపాణి మాట్లాడుతూ ఆదివాసీల అవసరాలపై శ్రద్ధ వహించాలని, వారి ప్రధాన సవాళ్లను పరిష్కరించాలని నొక్కి చెప్పారు. సాంప్రదాయ పద్ధతులు వారి ఆర్థిక కార్యకలాపాలే కాదు, వారి సంస్కృతికి వెన్నెముక అని పేర్కొన్నారు. నిర్వాసిత, పునరావాసం వంటి సమస్యలను ఆదివాసీలు ఎదుర్కొంటున్నారు. ఆదివాసీల అభ్యున్నతికి సమిష్టిగా కృషి చేయాలని సూచించారు.
కార్యక్రమంలో సదస్సు డైరెక్టర్ ప్రొ. గుంటి రవీందర్ మాట్లాడుతూ ఆదివాసీల సాధికారత మరియు రిజర్వేషన్ల పోరాటంలో శ్రీ జైపాల్ సింగ్ ముండా పాత్రను ప్రధానంగా ప్రస్తావించారు. సదస్సు నిర్వహణ లక్ష్యాలు, ఆవశ్యకతను వివరించారు. సామాజిక శాస్త్రం విభాగ డీన్ ప్రొ. వడ్డాణం శ్రీనివాస్ మాట్లాడుతూ రాజనీతీ శాస్త్ర విభాగం మెటీరియల్ అభివృద్ధిలో ప్రముఖ సామాజిక శాస్త్రవేత్తల సహకారాన్ని ప్రొ. వడ్డాణం శ్రీనివాస్ అభినందించారు. ఆదివాసీల సవాళ్లు, సమస్యలు, వారి హక్కులపై చర్చించేందుకు ఈ సదస్సు మంచి అవకాశాన్ని కల్పిస్తోందని వెల్లడించారు. సదస్సు కో-డైరెక్టర్ ప్రొ. జి. లక్ష్మీ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో పలు విభాగాల అధిపతులు, డీన్లు, అన్ని విభాగాల అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు.