Delhi Liquor Scam: ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు, డిసెంబర్ 6న విచారణకు హాజరు

Hyderabad: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుమార్తె, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కు సీబీఐ నోటీసులు ఇచ్చింది. లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ ఆరా తీయనుంది. లిక్కర్ స్కామ్లో వివరణ ఇవ్వాలని 160 సీఆర్‌పీసీ కింద కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చింది. విచారణకు ఢిల్లీ, హైదరాబాద్లో ఎక్కడైనా హాజరుకావచ్చని నోటీసుల్లో అధికారులు పేర్కొన్నారు. డిసెంబర్ 6న హైదరాబాద్లో సీబీఐ విచారణకు కవిత హాజరుకానున్నారు. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన రిమాండ్ రిపోర్ట్‌లో సీబీఐ కవిత పేరును చేర్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్‌లో కవిత పేరును సీబీఐ పొందుపర్చిన విషయం తెలిసిందే. దీంతో ఈ కేసులో కవిత పాత్ర ఏంటనే అంశంపై విచారణ చేసేందుకు సీబీఐ ఆమెకు నోటీసులు జారీ చేసింది.

రెండు రోజుల క్రితం సీబీఐ కోర్టులో దాఖలు చేసిన రిమాండ్ రిపోర్ట్‌లో అమిత్ పలు అంశాలను పొందుపర్చింది. శరత్ చంద్రారెడ్డి, కవిత, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, అమిత్ అరోరా నియంత్రణలో ఉన్న సౌత్ గ్రూప్ అనే కంపెనీ నుంచి ఆప్ నాయకుల తరపున విజయ్ నాయర్ రూ. 100 కోట్ల ముడుపులు అందుకున్నట్లు దర్యాప్తులో తేలింది. ఇదే విషయాన్ని అమిత్ అరోరా వెల్లడించారు. ఈ కేసులో కవిత పాత్ర ఉందంటూ మీడియాకు లీకులు ఇవ్వడం వరకే పరిమితమైన ఈడీ మొదటి సారి సీబీఐ ప్రత్యేక కోర్టుకు సమర్పించిన ఓ రిమాండ్‌ రిపోర్ట్‌లో కవిత రోల్‌ ఏమిటి? ఆమెతో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన అరబిందో ఫార్మా డైరెక్టర్‌ శరత్‌చంద్రారెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఏం చేశారు? ఆప్‌ నేతలకు రూ. 100 కోట్ల ముడుపులను ఎవరు ఇచ్చారు? ఎలా లబ్ధి పొందారు? అనే విషయాలను కోర్టుకు వివరించారు. ఈ కేసులో మద్యం వ్యాపారి, మనీశ్‌సిసోడియా కుడిభుజంగా చెప్పే అమిత్‌ అరోరాను ఈడీ బుధవారం అరెస్టు చేసి, సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్‌ ఎదుట హాజరుపరిచింది. ఈ సందర్భంగా కోర్టుకు సమర్పించిన రిమాండ్‌ రిపోర్టులో ఈ కుంభకోణంలో ఎవరి పాత్ర ఏమిటి? ముడుపులు ఎవరెవరి చేతులు మారాయి? అనే విషయాలను వెల్లడించింది. అమిత్‌ అరోరా ఈ కుంభకోణంలో కీలక పాత్ర పోషించినట్లు ఈడీ తెలిపింది.

దర్యాప్తును అడ్డుకునేందుకు ఉద్దేశపూర్వకంగానే విస్తృతమైన డిజిటల్ సాక్ష్యాలను ధ్వంసం చేశారని వెల్లడించింది. అలా ధ్వంసం చేసిన డివైజ్‌ల విలువ రూ.1.30 కోట్లు ఉంటుందని ఈడీ స్పష్టం చేసింది. కేసును ఏజెన్సీకి అప్పగించిన తర్వాత 36 మంది తమ 176 సెల్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లను ధ్వంసం చేశారని రిపోర్టులో పేర్కొంది. 170 సెల్‌ఫోన్‌లలో 17 సెల్‌ఫోన్‌ల నుంచి డేటాను తిరిగి పొందగలిగామని… అన్ని ఫోన్లు దొరికి ఉంటే ఈ కేసులో చేతులు మారిని మరిన్ని ముడుపులు వెలుగులోకి వచ్చేవని తెలిపింది. ఇతర ముఖ్యమైన వ్యక్తుల ప్రమేయం మరింత స్పష్టంగా బయటపడి ఉండేదని రిపోర్టులో ఈడీ పేర్కొంది. ఇంతకు ముందు సమర్పించిన చార్జిషీట్‌లో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా పేరు లేకపోవడం, కవిత పాత్రను ప్రస్తావించకపోవడంతో కేసు మొత్తం మద్యం వ్యాపారులకే పరిమితమైందనే సందేశం వెలువడ్డా.. తాజా రిమాండ్‌ రిపోర్టులో మనీశ్‌ ఈ కుంభకోణానికి సంబంధించిన డిజిటల్‌ ఆధారాలను ధ్వంసం చేశారని ఈడీ పేర్కొంది. (Agencies)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X