हैदराबाद/नई दिल्ली: लगभग नौ घंटे की पूछताछ के बाद एमएलसी कविता ईडी कार्यालय से बाहर आ गई। ईडी अधिकारियों ने 16 मार्च को अगली सुनवाई के लिए उपस्थित होने का कविता को निर्देश दिया। इसके चलते कविता, मंत्री केटीआर, हरीश राव और अन्य नेता हैदराबाद के लिए रवाना हो गये है।
लोगों को अभिवादन करते हुए एमएलसी के कविता
इससे पहले पुलिस ईडी कार्यालय के बाहर कविता के आने का इंतजार कर रहे है बीआरएस नेता और कार्यकर्ताओं को वहां से भेज दिया है। सुबह से ही अटकलें लगाई जा रही है कि कविता को गिरफ्तार किया जाएगा। लेकिन ऐसा कुछ नहीं हुआ। पता चला है कि दोपहर को कविता ने भोजन नहीं किया। सुबह से ही तेलंगाना के अलावा देश की लोगों की नजरें ईडी कार्यालय पर टिकी थी। अधिकतर लोग टीवी के सामने बैठकर पल-पल की जानकारी ले रहे थे।
घर आने पर कविता की आरती उतारती महिला
దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ విచారణ ముగిసింది. రాత్రి 8 గంటల సమయంలోఆమె ఈడీ ఆఫీసు నుంచి బయటకు వచ్చారు. ఆఫీస్ నుంచి నేరుగా తుగ్లక్ రోడ్డులోని సీఎం కేసీఆర్ ఇంటికి వెళ్లారు. ఉదయం 11 గంటలకు ఆఫీసులోకి వెళ్లిన కవిత రాత్రి ఎనిమిది గంటల వరకు ప్రశ్నించారు అధికారులు. సౌత్ గ్రూప్ ద్వారా 100 కోట్ల రూపాయల ముడుపులను ఆప్ పార్టీకి ఇచ్చినట్లు సిసోడియా, పిళ్లయ్, బుచ్చిబాబు, మాగుంట రాఘవరెడ్డిలు ఇచ్చిన సమాచారం ఆధారంగా కవితను ప్రశ్నించారు.
కేసులో విచారణ ఇంకా ముగియలేదని మార్చి 16వ తేదీన కవితను మళ్లీ విచారించనున్నట్లు తెలిపారు ఈడీ అధికారులు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ 50 కింద కవిత స్టేటమేంట్ రికార్డ్ చేశారు అధికారులు. విచారణ సందర్భంగా లిక్కర్ స్కాం గురించి నాకేం తెలియదని నేను కుట్రదారుని కాదు అని స్పష్టం చేశారామె. ఎలాంటి ఆధారాలు ధ్వంసం చేయలేదంటూ ఈడీ ప్రశ్నలకు సమాదానం ఇచ్చారు కవిత.
కవితను ప్రశ్నించే సమయంలో అరుణ్ పిళ్లయ్ కూడా అక్కడే ఉన్నారు. గత విచారణలో కవిత బినామీ అంటూ ఆయన ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా రిమాండ్ రిపోర్టులో కవిత పేరును ప్రస్తావించారు అధికారులు. ఆ తర్వాత తన స్టేట్ మెంట్ ఉప సంహరించుకుంటున్నట్లు పిళ్లయ్ రిట్ పిటీషన్ దాఖలు చేశారు. ఇప్పుడు. ఆయన సమక్షంలోనే కవితను ఇంటరాగేషన్ చేయటం విశేషం.
दिल्ली ईडी मुख्यालय में हाई टेंशन, रैली-धरना को अनुमति नहीं
दिल्ली ईडी मुख्यालय में हाई टेंशन है। शराब घोटाला मामले में एमएलसी कविता की जांच कर रहे ईडी अधिकारियों के मद्देनजर पुलिस ने दिल्ली के कई हिस्सों में भारी सुरक्षा व्यवस्था की है। मालूम हो कि बड़ी संख्या में बीआरएस के सांसद, मंत्री, विधायक, अन्य नेता और कार्यकर्ता दिल्ली पहुंचे और विरोध प्रदर्शन किया। ऐसा लगता है कि जांच के बाद ईडी ने कविता को गिरफ्तारी किया जाता है तो बड़े पैमाने पर आंदोलन के लिए बड़ा कदम उठाया है। इस पृष्ठभूमि में, पुलिस को सतर्क कर दिया गया था। पुलिस ने तुगलक रोड स्थित सीएम केसीआर के आवास पर भी बैरिकेड्स लगा दिए। ईडी कार्यालय के आसपास धारा 144 लगा दी गई है। चेतावनी जारी की जा रही है कि सार्वजनिक रूप से लोगों के समूह होने पर कार्रवाई की जाएगी।
दिल्ली पुलिस ने खुलासा किया है कि रैलियों और धरनों की अनुमति नहीं है। उन्होंने स्पष्ट किया कि बीआरएस का कोई भी कार्यकर्ता ईडी कार्यालय के आसपास नहीं रहना चाहिए। उन्होंने कहा कि सुरक्षा कारणों से एहतियाती कदम उठाए जा रहे हैं। आदेश पहले ही जारी किए जा चुके हैं कि एमएलसी कविता की जांच की पृष्ठभूमि में कोई भी ईडी कार्यालय न आए।
मोदी सरकार के निशाने पर सीएम केसीआर परिवार: असदुद्दीन ओवैसी
एआईएमआईएम के अध्यक्ष और सांसद असदुद्दीन ओवैसी ने मोदी सरकार पर तेलंगाना सरकार और सीएम केसीआर के परिवार को निशाना बनाने का आरोप लगाया। ओवैसी ने अपने ट्वीट में भाजपा सांसदों पर देश में मुसलमानों के आर्थिक शोषण का आह्वान करने का आरोप लगाया। ओवैसी ने आरोप लगाया कि मुसलमानों का सामना करने के लिए लोगों को अपने घरों में हथियार रखने के लिए बुलाया गया था। उन्होंने ट्वीट किया कि मोदी सरकार तेलंगाना के विकास में सहयोग कर रहे केसीआर परिवार पर कोई कार्रवाई कर उन्हें निशाना बनाने में लगी है।
సీఎం కేసీఆర్ ఫ్యామిలీని మోడీ సర్కార్ టార్గెట్ చేసింది : అసదుద్దీన్ ఓవైసీ
తెలంగాణ ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్ ఫ్యామిలీని మోడీ సర్కార్ టార్గెట్ చేసిందని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. దేశంలోని ముస్లింలను ఆర్థికంగా వెలివేయాలని బీజేపీ ఎంపీలు పిలుపునిచ్చినట్లు ఓవైసీ తన ట్వీట్ లో ఆరోపించారు. ముస్లింలను ఎదురుకునేందుకు ప్రజలు తమ ఇళ్లలో ఆయుధాలు పెట్టుకోవాలని పిలుపునిచ్చినట్లు ఓవైసీ ఆరోపించారు. వీరిపై ఎలాంటి చర్యలు తీసుకొని మోడీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి పాటుపడుతున్న కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేయడంలో మాత్రం బీజీగా ఉందని ఆయన ట్వీట్ చేశారు.
ఢిల్లీ ఈడీ ప్రధాన కార్యాలయం వద్ద హైటెన్షన్
ఢిల్లీ ఈడీ ప్రధాన కార్యాలయం వద్ద హైటెన్షన్ నెలకొంది. లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు విచారించనున్న నేపథ్యంలో ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే బీఆర్ఎస్ ఎంపీలు, మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు, ఇతర నాయకులతో పాటు కార్యకర్తలు భారీ సంఖ్యలో ఢిల్లీకి చేరుకొని అక్కడ తిష్టవేసిన సంగతి తెలిసిందే. విచారణ అనంతరం ఈడీ కవితను అరెస్ట్ చేస్తే ఆందోళనలు చేసేందుకే భారీ గా తరలివెళ్లినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులు అలెర్టయ్యారు. ఇటు తుగ్లక్ రోడ్డు లోని సీఎం కేసీఆర్ నివాసం వద్ద కూడా పోలీసులు బారీకేడ్లు ఏర్పాటు చేశారు. ఈడీ ఆఫీసు పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు. గుంపులు గుంపులుగా పబ్లిక్ ఉంటే చర్యలు తప్పవంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
ర్యాలీలు, ధర్నాలకు అనుమతి లేదు
ర్యాలీలు, ధర్నాలకు అనుమతి లేదని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. బీఆర్ఎస్ కార్యకర్తలెవరూ ఈడీ ఆఫీస్ పరిసరాల్లో ఉండొద్దని స్పష్టం చేశారు. భద్రతా కారణాల రీత్యా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఎమ్మెల్సీ కవితను విచారించనున్న నేపథ్యంలో ఈడీ ఆఫీస్ వైపునకు ఎవరూ రావొద్దని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మైకుల్లోనూ పోలీసులు అనౌన్స్ మెంట్ చేశారు.
दूध का दूध और पानी का पानी करने ईडी कार्यालय पहुंची एमएलसी कविता
बीआरएस एमएलसी और सीएम केसीआर के बेटी कविता दिल्ली शराब घोटाले में ईडी की पूछताछ में शामिल होने ईडी कार्यालय पहुंची है। वह सुबह 10:30 बजे तक दिल्ली के एपीजे अब्दुल कलाम रोड स्थित ईडी के मुख्य कार्यालय पहुंच गई। ईडी के अधिकारी सुबह 11 बजे कविता से पूछताछ करेंगे। इसके चलते ईडी कार्यालय के सामने भारी बंदोबस्त किया है। किसी को भी इस मार्ग से आने-जाने नहीं दिया जा रहा है।
बीआरएस की आंदोलन की संभावना के चलते ईडी कार्यालय के पास धारा 144 लागू किया गया है। बड़े- पैमाने पर बीआरएस के नेता और कार्यकर्ता मौजूद है। अप्रिय घटना को रोकने के लिए पुलिस ने कड़ा बंदोबस्त किया है। ठीक 11 बजे कविता आवास से ईडी कार्यालय के लिए रवाना हुई है। दिल्ली पुलिस काफिले साथ कविता अपने वाहन में ईडी कार्यालय रवाना हुई। ईडी कार्यालय और केसीआर का आवास दो किलोमीटर दूरी पर है।
इस मामले में ईडी ने इस महीने की 8 तारीख को हैदराबाद के एक शराब व्यापारी अरुण रामचंद्र पिल्लई, ब्रिंडको के बिक्री निदेशक अमन दीप सिंह ढल, ऑडिटर बुचिबाबू और अभिषेक बोइनपल्ली के बयानों के आधार पर कविता को नोटिस जारी किया था। इसी क्रम में मंत्री केटीआर और हरीश राव दिल्ली में मौजूद है। विधि विशेषज्ञों से सलाह मशविरा किया हैं।
ఈడీ విచారణకు ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్/న్యూఢిల్లీ : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ విచారణకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హాజరుకానున్నారు. ఢిల్లీ ఏపీజే అబ్దుల్ కలాం రోడ్డులోని ఈడీ హెడ్ ఆఫీసుకు ఉదయం 10 గంటల 30 నిమిషాల వరకు ఆమె చేరుకోనున్నారు. 11 గంటలకు కవితను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఈ కేసులో హైదరాబాద్‌కు చెందిన లిక్కర్ వ్యాపారి అరుణ్ రామచంద్ర పిళ్లై, బ్రిండ్‌కో సేల్స్ డైరెక్టర్ అమన్ దీప్ సింగ్ ధాల్, ఆడిటర్ బుచ్చిబాబు, అభిషేక్ బోయినపల్లి ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా కవితకు ఈడీ ఈ నెల 8న నోటీసులు ఇచ్చింది.
9న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. తనకు 15 వరకు టైమ్ ఇవ్వాలని కవిత కోరగా, ఈడీ నుంచి రిప్లై రాలేదు. దీంతో 11న వస్తానని రిక్వెస్ట్ పంపి, బుధవారం సాయంత్రం ఆమె ఢిల్లీకి వచ్చారు. ఇందుకు ఈడీ అధికారులు అంగీకరించడంతో మార్చి 11న కవిత విచారణకు హాజరుకానున్నారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగే చాన్స్ ఉండడంతో ఈడీ ఆఫీసుకు వెళ్లే రూట్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
కవితను ఈడీ విచారించనున్నందున మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు శుక్రవారం (మార్చి 10న) రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం ముగిశాక కేటీఆర్ మరో ఇద్దరు ప్రజాప్రతినిధులతో కలిసి ఢిల్లీకి వెళ్లారు. ఆ తర్వాత హరీశ్‌రావు కూడా వెళ్లారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకే వారు ఢిల్లీకి వెళ్లినట్లు తెలుస్తోంది. కవిత అరెస్టు తప్పదనే ప్రచారం నేపథ్యంలో కేటీఆర్, హరీశ్ రావు ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యం సంతరించుకుంది.
మరోవైపు లీగల్ టీమ్ కూడా ఢిల్లీకి చేరుకుంది. మహిళా రిజర్వేషన్లపై దీక్ష ముగిసిన తర్వాత ఆ టీమ్‌తో కవిత భేటీ అయి, ఆమెకు న్యాయ సలహాలు ఇచ్చినట్టు సమాచారం. బలవంతంగా తన వాంగ్మూలాన్ని తీసుకున్నారన్న అరుణ్ పిళ్లై పిటిషన్‌పై కూడా చర్చించినట్లు తెలిసింది. ఈడీ విచారణకు హాజరయ్యే ముందు కూడా లీగల్ ఒపీనియన్ తీసుకోనున్నారు.
మహిళా రిజర్వేషన్ల కోసం శుక్రవారం కవిత చేపట్టిన దీక్షలో పాల్గొనేందుకు వచ్చిన బీఆర్ఎస్, భారత్ జాగృతి కార్యకర్తలు ఢిల్లీలోనే ఉండిపోయారు. వీరిలో పెద్ద సంఖ్యలో మహిళలు ఉన్నారు. దీక్ష తర్వాత చాలామంది తిరిగి వెళ్లిపోవాల్సి ఉన్నా కవిత విచారణ నేపథ్యంలో వీరంతా ఆగిపోయారు. ఒకవేళ కవితను అరెస్ట్ చేస్తే పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించాలని యోచిస్తున్నట్లు తెలిసింది.
కవితకు 33 శాతం వాటా
సౌత్ గ్రూప్‌లో కవిత కోసమే పని చేశామని అరుణ్ పిళ్లై, గోరంట్ల బుచ్చిబాబు, అభిషేక్ బోయినపల్లి ఇచ్చిన స్టేట్మెంట్లే కవిత విచారణలో కీలకం కానున్నాయి. ఫోన్ల ధ్వంసం, ఢిల్లీ, హైదరాబాద్ లో మీటింగ్స్, ఆప్ కు హవాలా రూపంలో డబ్బు తరలింపు వంటి అంశాలపై ఈడీ ఫోకస్ పెట్టనున్నట్టు తెలిసింది. కవితను ముందు విడిగా, ఆ తర్వాత జాయింట్ సెషన్ లో విచారిస్తారని సమాచారం.
కవిత అనుచరుడు పిళ్లై ఇప్పటికే ఈడీ కస్టడీలో ఉన్నారు. అలాగే తీహార్ జైలులో ఉన్న మనీశ్ సిసోడియాను 7 రోజుల కస్టడీకి అప్పగిస్తూ సీబీఐ స్పెషల్ కోర్టు శుక్రవారం ఆర్డర్స్ ఇచ్చింది. దీంతో కవిత విచారణలో మనీశ్ సిసోడియా, అరుణ్ పిళ్లై కూడా ఉంటారని చర్చ జరుగుతోంది. ఈ విచారణ ఒక్క రోజుతోనే ముగిసే పరిస్థితి లేదని, ఆదివారం కూడా కవితను పిలిచే ఆవకాశం ఉందని తెలిసింది.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు హీటెక్కిస్తోంది. రేపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా రిమాండ్ రిపోర్టులో ఈడీ అధికారుల కీలక విషయాలు పొందుపర్చారు. సిసోడియా రిమాండ్ రిపోర్టులో పలుమార్లు కల్లకుంట్ల కవిత పేరును అధికారులు ప్రస్తావించారు. మద్యం కుంభకోణం కుట్రలో కవిత భాగస్వామిగా ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. సౌత్ గ్రూపులో కవితది కీలక పాత్ర అని అధికారులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈడీ చేతికి వీళ్ల మధ్య జరిగిన చాటింగ్ దొరికింది. ఈ చాటింగ్‌లో ‘V’ పేరుతో విజయ్ నాయర్, మేడమ్ పేరుతో కవిత, Samee పేరుతో సమీర్ చాటింగ్ చేసినట్టు రిమాండ్ రిపోర్టులో ఈడీ పేర్కొంది. ఈ స్కాం మొత్తం హైదరాబాద్‌లోనే జరిగినట్టు ఈడీ పేర్కొంది. ఐటీసీ కోహినూర్ హోటల్‌లో కుట్ర జరిగినట్టు తేల్చింది.
ఆప్ పార్టీకి సౌత్ గ్రూపు నుంచి 100 కోట్ల రూపాయలు ముడుపులు ముట్టజెప్పినట్టు తెలుస్తోంది. కవిత తరపున అరుణ్ పిళ్లై ప్రాతినిధ్యం వహించారని విచారణలో వెల్లడైంది. అయితే ఇండో స్పిరిట్లో 65 శాతం భాగం సౌత్ గ్రూప్‌దే కావటం గమనార్హం. ఈ గ్రూపులో కవిత కూడా ఓ భాగస్వామిగా తెలుస్తోంది. సిసోడియా రిమాండ్ రిపోర్టులో సౌత్ లాబీపైన ఈడీ పలు విషయాలు ప్రస్తావించింది. సౌత్ గ్రూప్‌లో అరుణ్ రామచంద్ర పిళ్ళై, సమీర్ మహేంద్ర, మాగంటి శ్రీనివాస్ రెడ్డికి 65 శాతం భాగస్వామ్యం ఉందని తేల్చింది. సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్ల పైగా కిక్ బాక్స్ వైసీపీ ఎంపీ మాగంటి శ్రీనివాసులతో కలిసి సౌత్ గ్రూప్ ఏర్పాటు చేశారు. సౌత్ గ్రూప్ వ్యవహారంలో ఆప్ నేత విజయ్ నాయర్ కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తుంది. సౌత్ గ్రూప్ మొత్తం తొమ్మిది జోన్స్‌లను కైవసం చేసుకుంది. ఇండో స్పిరిట్‌లో పెట్టుబడులపై రామచంద్ర పిళ్లై ఇప్పుటికే ఈడీకి 11 సార్లు వాంగ్మూలం ఇచ్చారు. ఇండో స్పిరిట్‌లో బినామీ పెట్టుబడులు ఉన్నట్లుగా పేర్కొన్నారు.
సౌత్ గ్రూప్ సంబంధించి లాబీని గోరంట్ల బుచ్చిబాబు మెయింటైన్ చేస్తున్నట్టు ఈడీ పేర్కొంది. సౌత్ లాబీకి సంబంధించి 100 కోట్ల రూపాయలను హవాలా రూపంలో బదిలీ చేసినట్టు తెలిపింది. గోరంట్ల బుచ్చిబాబు హవాల రూపంలో డబ్బులు ఢిల్లీకి తరలించాడని పేర్కొంది. అరుణ్ పిళ్లై, విజయ నాయర్ హైదరాబాద్‌లోని ఐటీసీ కోహినూర్‌లో కలుసుకున్నారని తెలిపారు. ఈ మీటింగ్ తర్వాత అభిషేక్ బోయినపల్లి డబ్బులను ఢిల్లీ వరకు తరలించే విషయంలో కీలకంగా వ్యవహరించినట్టు సిసోడియా రిమాండ్ రిపోర్టులో తెలిపింది. కాగా.. సిసోడియాను ఈడీ ఆఫీస్‌కు తరించారు అధికారులు. ఈరోజు నుంచి ఏడు రోజుల పాటు కస్టడీకి న్యాయస్థానం అనుమతించిన నేపథ్యంలో అధికారులు విచారించనున్నారు. (ఏజెన్సీలు)