హైదరాబాద్ : భావి భారత ప్రధాని కాంగ్రెస్ అగ్రహత రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు.. ఎఐసిసి కార్యదర్శి మాజీ శాసనసభ్యులు డాక్టర్ ఎస్ ఏ సంపత్ కుమార్ గారు కార్యకర్తల సమక్షంలో హాత్ సే హాత్ జోడో యాత్రను ఐజ మండలం ఏక్లాస్ పురం, దేవబండ గ్రామ వీధుల్లో తిరుగుతూ ప్రతి ఒక్కరితో చేయి చేయి కలుపుతూ ప్రజలందరితో మమేకమై కాంగ్రెస్ వాదాన్ని వినిపిస్తూ పాదయాత్రను కొనసాగిస్తున్నారు.
కేశపూర్ లో వరి, మిర్చి మహిళా రైతులను కలిసి వారి సమస్యలు తెలిసుకున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. పాదయాత్రలో కేశపూర్ లో వరి, మిర్చి తోటలో పనిచేస్తున్న మహిళా కూలీలు,రైతులను కలిసి వారి సమస్యలు తెలిసుకున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. పంట గిట్టుబాటు గురించి అడిగి తెలుసుకున్న రేవంత్. కూలీలతో కలిసి మిర్చి తెంపిన రేవంత్. రైతు కూలీలు తెచ్చుకున్న సద్ది లోంచి రేవంత్ కు సీతక్కకు,మల్లు రవి లకు కలిపి ముద్దలు పెట్టిన మహిళలు.
జనవరి లో మన ప్రభుత్వం వస్తుంది… రేవంత్ రెడ్డి. పేదలందరికీ ఇల్లు ఇస్తాం… ఇళ్ళ నిర్మాణానికి ఒక్కొక్కరికి 5 లక్షలు మంజూరు చేస్తాం… రేవంత్ రెడ్డి. ప్రభుత్వం వస్తేనే పేదలకు న్యాయం చేసేందుకు సాధ్యమౌతుంది… రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ను గెలిపించేందుకు మీరంతా పని చేయాలని మహిళా కూలీలతో రేవంత్ రెడ్డి.
ఈ సందర్భంగా సంపత్ కుమార్ గారు మాట్లాడుతూ…
“కన్యాకుమారుని నుండి కాశ్మీర్ వరకు పాదయత్ర చేసిన రాహుల్ గాంధీ గారి యాత్రకు దేశంలో విప్లవాత్మకమైన మార్పు వచ్చింది. అవినీతి కుటుంబ పాలనతో విసిగిపోయిన తెలంగాణ ప్రజలు సోనియా గాంధీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. నిరంకుశ పాలనతో నివ్వరపోయిన తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పాలన కోసం ఎదురుచూస్తున్నారు.
అలంపూర్ పాలన అవినీతికమిషన్లతో రాజ్యమేలుతుందని, అక్రమ ఇసుక, మద్యం దందాలతో అధికార పార్టీ నాయకులు అక్రమ ఆస్తులు కూడబెట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 60 రోజులపాటు అలంపూర్ లోని అన్ని మండలాలలో ప్రతి గ్రామాన్ని దర్శించి ప్రజలు పడుతున్న సమస్యలను ఇబ్బందులను తెలుసుకుని పరిష్కార దిశగా అడుగులు వేస్తూ ప్రజల ఆదర అభిమానాలతో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి ప్రజల ఆశయాలను సుసాధ్యం చేస్తామని హామీ ఇస్తూ యాత్రను విజయవంతం చేస్తామన్నారు.
ఈ యాత్రతో టీఆర్ఎస్ అవినీతి పాలన అంతమై సోనిఅమ్మ రాజ్యం అధికారంలోకి వస్తుందని ప్రజలకు భరోసా నింపుతూ యాత్రలో అడుగు ముందుకు వేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సంపత్ కుమార్ గారి వెంట అన్ని మండలాల పార్టీ అధ్యక్షులు ,నాయకులు, కార్యకర్తలు,పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.”
..