Big Challenge: పాలమూరులో 14కు 14 సీట్లు గెలుస్తాం: రేవంత్ రెడ్డి

హైదరాబాద్ : పాలమూరులో 14కు 14 సీట్లు గెలిపించి రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగరేసే బాధ్యత నాది అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. నాగర్ కర్నూలు శాసనసభ నియోజకవర్గం పరిధిలోని బిజినేపల్లిలో నిర్వహించిన దళిత గిరిజన ఆత్మగౌరవ సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు.

“పాలమూరులో 14కు 14 సీట్లు గెలిచి రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగరేసే బాధ్యత నాది. పార్టీ ఎవరికి అవకాశం ఇచ్చినా వారిని భుజాలపై మోసుకెళ్లి కుర్చీపై కూర్చోబెట్టే బాధ్యత నాది. అందరం నాయకులం కలిసికట్టుగా పని చేస్తాం. దళిత, గిరిజన, ఆదివాసీ, బడుగు బలహీనవర్గాలు కలిసికట్టుగా కాంగ్రెస్ ను గెలిపించాలి” అని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ పార్టీ దళితులకు, గిరిజనులకు ఎన్నో పదవులు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడి మల్లికార్జున ఖర్గేకు, సీఎల్పీ లీడర్ గా భట్టి విక్రమార్కకు, కేంద్రమంత్రిగా బలరాం నాయక్ కు, పంజాబ్ ముఖ్యమంత్రిగా దళితులకు అవకాశమిచ్చింది.

తెలంగాణ, పాలమూరు గడ్డ ఇంకా దొరలు దళిత గిరిజనులపై కాలుపెట్టి తొక్కి ఆధిపత్యం చెలాయించాలని చూశారు. భూస్వాములు, దొరలు దళితులపై దాడులు చేస్తుంటే వారిని దురాగతాలను తరిమిన చరిత్ర ఈ గడ్డది. అనాడు నిజాం రజాకార్లను తరిమికొట్టిన చరిత్ర ఈ పాలమూరు జిల్లాకు, నల్లమల్ల ప్రాంతానికి ఉంది. పాలమూరు గడ్డ అంటేనే పేదోల అడ్డ. అటువంటి గడ్డ మీద పేదోల మీద దాడి చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ కూర్చోదు.

2018 ఎన్నికల్లో కేసీఆర్ 8 వేల ఎకరాలకు సాగు నీరందించే మార్కండేయ ప్రాజెక్టును కట్టిస్తా అని మాటచ్చిండు. 2019లో శిలాఫకం వేశారు. ఇంతవరకు అక్కడ తట్టెడు మట్టి మీద కూడా తీయలేద. నాలుగేళ్లయినా ఇక్కడ కడతామన్న ప్రాజెక్టు అడుగు ముందుకు పడలేదు. మాట తప్పి ఈ ప్రాంత ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్ అన్యాయాన్ని ప్రశ్నించడానికి నాగం జనార్దన్ రెడ్డి అక్కడి వెళ్లారు. ఆ సమయంలో దళితులు, గిరిజనలు అండగా నిలబడ్డారు. ప్రాజెక్టు పనుల పరిశీలనకు వెళితే నాగం జనార్దన్ రెడ్డిపై కేసులు పెట్టారు. హామీలు నిలబెట్టుకోని ఈ ప్రభుత్వాన్ని నిలదీసేందుకే నాగం జనార్దన్ రెడ్డి అక్కడికి వెళ్లారు. ఒక వేళ మీకు చేతనైతే ప్రాజెక్టు కట్టండి లేకుంటే మేము సన్నాసులం అని ఒప్పుకోండి.

చంద్రబాబు హయాంలో పాలమూరు నుంచి 10 లక్షల మంది వలస వెళ్లారు. వలసలను నివారించడానికి పాలమూరను పచ్చగా చేయడానికి రూ. 2వేల కోట్లతో 3.60 లక్షల ఎకరాలకు నీరు అందించే కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని నాగం జనార్ధన్ రెడ్డి మంజూరు చేయించారు. తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి ప్రభుత్వం దాని సామర్ధ్యాన్ని 5 లక్షల ఎకరాలకు పెంచింది. అనాడు పాలమూరు రైతుల కోసం కాంగ్రెస్ పార్టీ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును మంజూరు చేసింది. మీ ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టును ఎండబెట్టింది.

జూరాల, బీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? మేం కట్టిన ప్రాజెక్టుల దగ్గర ఇక్కడ ఎమ్మెల్యే ఫోటోలు దిగుతున్నాడు. లాల్చి వేసి ప్రతొక్కడు లాల్ బహదూర్ శాస్త్రి కాదు. పంచెలు కట్టిన ప్రతీవాడు వైఎస్ రాజశేఖరరెడ్డి కాడు. ప్రాజెక్టుల విషయంపై ఎక్కడైనా చర్చకు సిద్ధం. దళితుడిని సీఎం చేస్తానని చెప్పి.. దరిద్రుడు సీఎం అయిండు. దళితులకు మూడెకరాల భూమి, ఎస్సీ వర్గీకరణ, ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తానని చెప్పిన సీఎం… ఏమీ చేయలేదు. పైగా దళిత గిరిజనుల గొంతుపై కాలు పెట్టి తొక్కిస్తున్నాడు. ఇదేనా నీ జాతి నీ నీతి.

మేమిచ్చిన తెలంగాణలో దళిత గిరిజనులపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకొం. ఎన్నికలొస్తున్నాయ్ బిడ్డా… నీ నడి నెత్తిపై కాలు పెట్టి తొక్కి జనం నిన్ను పాతాళంలోకి పంపిస్తారు. గతంలో నాగం జనార్దన్ రెడ్డి సంగతి చూస్తానన్న గాలి జనార్ధన్ రెడ్డికి చిప్ప కూడే గతి అయింది. ఇప్పుడు ఇక్కడున్న ఈ తిర్రి జనార్దన్ రెడ్డి పరిస్థితి కూడా అంతే. శిశుపాలుడికి పట్టిన గతే ఈ తిర్రికి పడుతుంది.

రాష్ట్రంలో దళిత గిరిజనులను బీఆరెస్ నేతలు అవమానిస్తున్నారు. దళిత గిరిజనులకు కాంగ్రెస్ అండగా నిలబడుతుంది. దొరలకు బీఆరెస్, పెట్టుబడిదారులకు బీజేపీ ఉంది. కానీ దళిత గిరిజనులకు కాంగ్రెస్ ఉంది. ఈ పార్టీ మీది… ఈ జెండా మీది… దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది. ప్రవీణ్ కుమార్, అకూనూరి మురళి, కృష్ణ ప్రసాద్, ప్రదీప్ చంద్ర వంటి అధికారులను అవమానించారు.

మాదిగలకు మంత్రివర్గంలో స్థానంలో లేదు. మంద కృష్ణ మాదిగను జైలులో పెట్టిండు కేసీఆర్. పాలమూరులో 14కు 14 సీట్లు గెలిచి రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగరేసే బాధ్యత నాది. పార్టీ ఎవరికి అవకాశం ఇచ్చినా వారిని భుజాలపై మోసుకెళ్లి కుర్చీపై కూర్చోబెట్టే బాధ్యత నాది. దళిత, గిరిజన, ఆదివాసీ, బడుగు బలహీనవర్గాలు కలిసికట్టుగా కాంగ్రెస్ ను గెలిపించాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

We will win 14 out of 14 seats in Palamuru: Revanth Reddy

Hyderabad: TPCC president Revanth Reddy said that it is his responsibility to win 14 out of 14 seats in Palamuru and hoist the Congress flag in the state. Revanth Reddy addressed the Dalita Girijana Atmagaurava Sabha held at Bijinepally under the Nagar-Kurnool Legislative Assembly constituency.

“It is my responsibility to win 14 out of 14 seats in Palamuru and raise the Congress flag in the state. It is my responsibility to carry whoever the party gives them a chance on my shoulders and make them sit on the chair. All the leaders will work together. Dalit, Tribal, Adivasi and weaker sections should come together and make the Congress win,” Revanth Reddy gave a call.

Congress party has given many posts to Dalits and Tribals. Congress party has given an opportunity to Mallikarjuna Kharge as National President, Bhatti Vikramarka as CLP leader, Balaram Naik as Union Minister and a Dalit as Punjab Chief Minister. Doras of Telangana, Palamur still try to suppress Dalits and Tribals. Chasing away landlords and nobles attacking Dalits is in the history of this land. This Palamuru district and Nallamalla area have a history of driving out the Rajakars of the Nizam. Palamuru Gadda means Pedolla Adda.

The Congress party will not sit back and watch if the peasants are being attacked on such soil. In the 2018 elections, KCR said that he would build the Markandeya project to irrigate 8,000 acres. The foundation stone was laid in 2019. So far, there has not even been a knock on the soil. Even after four years, the project to be built here has not taken a step forward. Nagam Janardhan Reddy went there to question the injustice of KCR who is cheating the people of this region by not standing on his word. At that time Dalits and tribals stood by. When the project works were being examined, cases were filed against Nagam Janardhan Reddy. He went there to question this government which did not keep its promises. If you can, build the project, if not, admit that you are lazy. 10 lakh people migrated from Palamuru during Chandrababu’s regime.

To make Palamuru green to prevent migration, Nagam Janardhan Reddy sanctioned the Kalvakurti upliftment scheme to provide water to 3.60 lakh acres at a cost of Rs. 2 thousand crores. The subsequent Rajasekhara Reddy government increased its capacity to 5 lakh acres. Congress party has sanctioned Palamuru-Ranga Reddy project for Palamuru farmers. Your government has dried up the Palamuru project. Isn’t it the Congress government that built Jurala, Bima, Nettempadu and Kalvakurti projects? The MLA is taking photos here near the projects we have built. Not everyone wearing a pyjama is Lal Bahadur Shastri. Not everyone who wears a dhoti is YS Rajasekhara Reddy. Get ready to discuss projects anywhere. Saying that he will make a Dalit the CM.. he himself became the CM. The CM who said he would give Dalits three acres of land, SC categorization, one job for every household, and double-bedroom houses did nothing.

Moreover, he is stepping on the throats of the Dalits and Tribes. If you attack Dalits and Tribes in our Telangana, we will not keep quiet. In the past, Gali Janardhan Reddy, who said that he would see the matter of Nagam Janardhan Reddy, has gone to jail. The same is the case with Marri Janardhan Reddy here. What happened to Sisupaludi will happen to Marri. BRS leaders are insulting Dalits and Tribals in the state. Congress will stand by Dalits and Tribals. The aristocrats have BRS and the capitalists have BJP. But Dalits have Congress.

This party is yours.. this flag is yours.. it is your responsibility to protect it. Officials like Praveen Kumar, Akunuri Murali, Krishna Prasad and Pradeep Chandra were insulted. Madigas have no place in the cabinet. KCR put Manda Krishna Madiga in jail. It is my responsibility to win 14 out of 14 seats in Palamuru and raise the Congress flag in the state. It is my responsibility to carry whoever the party gives them a chance on my shoulders and make them sit on the chair. Revanth Reddy appealed to Dalit, Tribal, Adivasi and weaker sections to unite and make the Congress win.

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కామెంట్స్

ఆత్మగౌరవం కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇంకా దలిత, గిరిజనులపై దాడులు, అవమానాలు జరుగుతుంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. తెలంగాణ రాష్ట్రం రాచరిక వ్యవస్థలో లేదు సంపూర్ణ ప్రజాస్వామ్యంలో ఉందన్న విషయాన్ని పాలకులు గ్రహించాలి.

ఆపార రాజకీయ అనుభవం కలిగిన, మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి మార్కండేయ ప్రాజెక్టు సందర్శనకు వెళ్తున్న క్రమంలో ఆయన వెంట వెళ్ళిన గిరిజనుడు వాల్య నాయక్, దలిత నాయకుడు రాములు ను కింద పడవేసి మెడపై కాలు వేసి తొక్కిన దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నా. మా జెండా మోస్తే చాలు… ఎవరినైన చంపుకోండి.. అని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ధైర్యంతోనే ఆ పార్టీ నాయకులు ఈ దుశ్చర్యకు ఒడిగట్టారు

ప్రభుత్వం అండ చూసుకుని ఆ పార్టీ నాయకులు చేస్తున్న ఆగడాలు పేట్రేగిపోతోన్నాయి. ఇంకా వీటిని సహించేది లేదు. ప్రాజెక్టు పూర్తి చేయాలని ప్రజల సమస్యల్ని అడిగిన దలిత, గిరిజన కార్యకర్తల గొంతుపై కాలు మోపిన దుర్మార్గాన్ని, దుశ్చర్యని తెలంగాణ సభ్య సమాజం చూస్తూ ఊరుకోదని చెప్పడానికే బిజినేపల్లి వచ్చాం. గిరిజనుడు వాల్య నాయక్, దలిత నాయకులు రాములు పై జరిగిన దాడి వారి పైన జరిగిన దాడిగా భావించడం లేదు. ఇది తెలంగాణ ఆత్మగౌరవ పోరాట సమస్యగా భావిస్తున్నాం.

మాజీ పిసిసి అధ్యక్షులు మల్లు అనంత రాములు లాంటి పెద్ద నాయకులు ఈ పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించి సామాజిక న్యాయం కావాలని తిరుగాడిన గడ్డపై న దలితులపై జరిగిన దాడిని తిప్పికొట్టాలి
దలిత, గిరిజనులపై ఇలాంటి దాడులు జరుగుతుంటే ఇంకా చూస్తు ఊరుకోము.

దలిత, గిరిజనులపై దాడులు చేసిన వారిని వదిలి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ప్రాజెక్టు కట్టాలని సర్కార్ ను నిలదీసిన మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి పై మహిళను తిట్టాడని అక్రమంగా కేసులు పెట్టడం అన్యాయం. పోలీసులు ప్రజలను సురక్షించడానికి ఉద్యోగాలు చేయాలి కానీ, అధికార పార్టీ చెప్పు చేతుల్లో పని చేయడానికి కాదు అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోండి. ప్రభుత్వాలు వస్తుంటాయి. పోతుంటాయి. చట్ట ప్రకారంగా పని చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నాను.

చట్ట ప్రకారంగా పని చేయకుండా ప్రభుత్వానికి తొత్తులుగా మారి అక్రమంగా కేసులు పెట్టి ఇలాగే చేస్తామని చెప్పడం పోలీసు శాఖకి మాయని మచ్చ తేవడమే. రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్న ధర్మంగా పాలన చేయాలి. న్యాయంగా ఉండాలి. చట్టం ప్రకారం నడవాలి. భిన్నంగా వ్యవహరిస్తే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు.

బీహార్లో దళితులపై ఊచకోత జరిగినప్పుడు స్వర్గీయ ప్రధాని ఇందిరాగాంధీ అక్కడికి వెళ్లి నేనున్నానని ధైర్యం చెప్పింది. అదే స్ఫూర్తితో తెలంగాణలో దళితులకు, గిరిజనులకు ఎక్కడ అవమానాలు జరిగిన, అన్యాయం జరిగిన కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. దళిత గిరిజనులకు అండగా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మేము ఉన్నాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X